ఒక మంచి వార్త
సాహితీ బంధువులకు శుభకామనలు – మొన్న అంటే ఈ నెల 28 సోమవారం ఉయ్యూరుకు చెందిన ఇస్రో చంద్రయాన్ కు చెందిన సైంటిస్ట్ శ్రీ మధిర చైతన్యతో మాట్లాడి అతన్ని సెప్టెంబర్ 5 సరస భారతి ,అమరవాణి హైస్కూల్ తో కలిసి నిర్వహించే శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవానికి ఆహ్వానించాము నేనూ మాబ్బాయి శర్మ .ఆయన ధన్యవాదాలు చెప్పి చాలా బిజీగా ఉన్నానని, ఇస్రో లో మరొక ప్రాజెక్ట్ లో తలమునకల పనిలో ఉన్నానని ,బహుశా భార్యాపిల్లలతో ,వినాయక చవితికి ఉయ్యూరు రాగలనని ,అప్పుడు వీలునుబట్టి చేద్దామని చెప్పారు .సరే అన్నాము తర్వాత ఉయ్యూరు లో నే ఉన్న అతని తండ్రి గారితోనూ మాట్లాడి,దంపతులను సెప్టెంబర్ 5గురు పూజోత్సవానికి ఆహ్వానించాము . ఆయనకూడా ధన్యవాదాలు తెలియజేసి ”అబ్బాయి వచ్చినప్పుడు అందరం కలుద్దాము మీ ఆశీస్సులు మావాడు వచ్చి తీసుకొంటాడు ”అన్నారు మర్యాదగా .కనుక శ్రీ చైతన్య ఉయ్యూరు వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేసి, చైతన్యను ఘనంగా సత్కరిద్దా౦ అని సరసభారతి భావిస్తోంది . ఈ ఆలోచనకు స్పూర్తి ,ప్రేరణ ఉయ్యూరుకు చెందిన హాం రేడియో నిర్వాహకుడు ,ప్రస్తుతం హైదరాబాద్ లో వివిధ సేవాసంస్థలను నిర్వహిస్తున్న శ్రీ సూరి బుచ్చిరాం .అతడు మమ్మల్ని ఊపిరి సలప నివ్వటం లెదు .
ఉయ్యూరుకు చెందిన”కేమోటాలజి పిత ”శ్రీ కొలచల సీతారామయ్య (రష్యా సీతారామయ్య ),ఆకునూరుకు చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్117 వ మూలకం కనిపెట్టిన డా.ఆకునూరి వెంకటరామయ్య గార్ల జీవితాలపై అరుదైన పుస్తకాలు నేను రచించి సరసభారతి ప్రచురించటం చారిత్రాత్మకమైన విషయం .అలాగే ఇస్రో సైంటిస్ట్ శ్రీ మధిర చైతన్యను కూడా సన్మానించి మనం అందరం ధన్యులమవుదాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -30-8-23-ఉయ్యూరు

