హరి ముకుంద శతకం

హరి ముకుంద శతకం
శ్రీ కోట్రెడ్డి నాగిరెడ్డి హరి ముకుంద శతకం రాసి ,శ్రీ ఖాద్రి నరసింహ సోదరులచే పరిష్కరిమ్పజేసి ,అనంతపురం సాధన ముద్రాణాలయం లో 1932లో ముద్రించారు .కవిగారిది కదిరి తాలూకా పందుల గుంట గ్రామం .అక్కడి ముకుంద స్వామికే అంకితమిచ్చారు .ఇది సీస పద్య శతకం .మకుటం –‘’భువిని పందులకుంట సత్పుర నివాస –అరసి నన్నేలు గోవింద హరి ముకుంద ‘’శతకం వెల తెలియబర్చలేదు .
మొదటి సీసం –‘’శ్రీ రావికులజు నాశ్రిత జన మందారు –నజు నచ్యుతుని గూర్చి నతులోనర్తు-కోటి భాస్కరుకాంతిగోటమీటు కిరీట-ములును దాల్చువాని ని౦పొదవ గొల్తు –కౌస్తుభ మణిహార కంకణ కేయూర –ధారికిని భక్తీ ని దండమిడుదు-సిరి యురంబున గల్గు సరసిజోదరు గృష్ణు –హరికి బరేశుజోహారోనర్తు–‘’భువిని పందులకుంట సత్పుర నివాస –అరసి నన్నేలు గోవింద హరి ముకుంద ‘
.గీ-భవవినుత నాది దేవుని౦ బ్రణతు జేసి –సీస పద్య౦బు లోసగితి చిత్తగింపు -’భువిని పందులకుంట సత్పుర నివాస –అరసి నన్నేలు గోవింద హరి ముకుంద ‘’.తర్వాత అస్టేదిక్పాలకులను స్తుతించి వ్యాసవాల్మీకాదులకు మొక్కి ,తెలుగుకవులన్దర్నీ పలకరించి భక్తితప్ప తనకు ఏమీలేదని చెప్పారు .తర్వాతపద్యంలో దండాలు పెట్టారు .ఆతర్వాత శరణు శరణు అని కాళ్ళపై పడ్డారు .పిమ్మట రామక్రిష్ణావతార స్తుతి చేసి ,గోకుల బాలకిట్టయ్య చిలిపి చేష్టలు చెప్పి ,భక్తులను కాపాడే దైవమని ధూపం వేసి ,మీన కూర్మాది రూప వైభవం వర్ణించి ,మాతృగర్భం లో అందరూ అనుభవించే బాధలు వివరించి ఖా౦డవదహనం బామ్మర్ది అర్జునుని చె చేయించిన విధానం చెప్పి ,’’ధాతను గన్నట్టి తమ్మి పొక్కిలి వాడివి తొగలను మించే కనుదోయి,శతృలను కూల్చే చక్రంతో లోక పాలన చేస్తావు .అన్నిటా నీ మూర్తి సంచరిస్తుంది అని రహస్యం చెప్పారు .నరకాసుర చెరలోఉన్న రాకన్యల మానం,ద్రోవది మానం ని౦డుకొల్వులో కాపాడాడు .పిడికెడు అటుకులు తిని మిత్రుడు కుచేలునికి అఖిలార్ధాలు ఇచ్చావు నన్ను కాపాడి మోక్షం ఇవ్వు చాలు .ఇకపుట్టటం గిట్టటం నావల్ల కాదు –‘’నీదు సామీప్యమిచ్చి నన్నేలు ‘’ .
మరోపద్యంలో రామనామమే ముక్తి రక్షా శుభం బుధ విజయం .’’నాలాంటి మూర్ఖునికి ఏమి తెలుస్తున్దయ్యా అన్నీ నువ్వే అనినమ్మే నన్ను కృపతోకాపాడి కైవల్యం అనుగ్రహించు ‘’’వారాసులేకమై వర్తిల్లునప్పుడు –మర్రియాకుననున్న కుర్ర –పాలమున్నీట పవళించిన పన్నగశాయి,చరాచర సృష్టికి తమ్మిచూలినిగన్న తండ్రి ,బ్రహ్మాండమంతా భస్మమైపోగా ఒక్కడేఉండే వటువు నువ్వే. నువ్వులేక నేను అనాధ . అన్ని మోహాలు తెన్చేసుకొన్నా .నీనామ భక్తితో అనుదినం ఆర్తిగా సేవిస్తున్నా .మరోపద్యంలో ‘’రామ భానుకులాబ్దిసోమ ,ఇందీవరశ్యా మ ,రాక్షసభీమ ,విష్ణు సామ్యప్రదీప ,జిష్ణులోకప్రతాప ,శక్రమిత్ర మురారి ఆదితేయ సుపోష ,యాదవాన్వయభూష మౌని బృంద విహార ‘’శరణుశరణు అన్నారు .తర్వాత రామ కృష్ణులకు దివ్యమంగళాలు పలికారు .107వ సీసం లో-అనంతపురం జిల్లా ఖాద్రి ప్రాంతం లో పందులకుంట గ్రామ వాసినని .కోటి రెడ్డి గోత్రీకుడనని తనపేరు నాగిరెడ్డి అని ‘’హరిభక్తి సుధ అనుదినంబును గ్రోలి ‘’ ఈ శతకం చెప్పానని చెప్పి చివరి 108వ సీసం లో ఫలశ్రుతికూడా పేర్కొన్నారు భక్తకవి నాగిరెడ్డి .
శతకం భద్రాద్రి రామదాసు శతకం లా అత్యంత సుందర రచనలో సాగింది భక్తీ ,శరణు .ఖాద్రి కుంకుమ అంత పవిత్రంగా ,అక్కడ విరివిగా లభించే మల్లెపూల కనకాంబరాల సొగసు సువాసనలతో శతకం పరిమళించింది .ఖాద్రి దర్గా అంతటి పవిత్రత కలిగించింది .అక్కడి లక్ష్మీ నృసింహస్వామి అంతటి అనుగ్రహం కలిగించింది .ధన్యులు కవిగారు చదివి విన్నమనమూ అంతటి ధన్యులమే .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-9-23-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged , . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.