ఆంజనేయ శతకం
పుష్పగిరి సంస్థాన పాఠశాల సాహిత్య విద్యార్ధిగుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అందుకూరు కు చెందిన పరాశరం నరసింహా చార్యులు రాసిన ఆన్జనేయశతకం 1934లో గుంటూరు ఆర్యవైశ్య ముద్రాక్షరశాలలో ముద్రి౦ప బడింది .మనవి మాటలు లో కవి’’తాను పదహారేళ్ళ వయసులో ‘’శృంగార నక్షత్రమాల ‘’పుస్తకం రాశానని ,అది శృంగారం కనుక ప్రచురించలేదని తర్వాత శ్రీ శంకరాచార్యుల చే స్థాపి౦ప బడిన గీర్వాణ విద్యాలయం లో చదువుతూ ఈ శతకం రాశానని ‘’చెప్పాడు .పరిశీలనకర్త కేసనపల్లి లక్ష్మణకవి పద్యాలలోనే –‘’సరళంగా మృదు శబ్ద భరితంగా ,నవరస ప్రాగాల్భ్యంగా కవి ఈశతకం రాశాడని ,లేబ్రాయ౦ లోనే కడు ప్రౌఢ కవిత్వ సంపద అలవడిందని ,రఘురాముడు ఈకవిని అన్నిరకాలుగా ఆదుకోవాలి ‘’అని కోరారు .మత్తేభ విక్రీడితమైన ఈ శతక౦ మకుటం –‘’అ౦దుకూరిపురవాసా ఆ౦జనేయప్రభో ‘’.పుస్తకం వెల ప్రకటించలేదు .
మొదటి పద్యంలో –‘’శ్రీ కంజాప్తకులు౦డురాముపదముల్ సేవ్య౦బు తానంచున-స్తోకోత్ఫుల్ల కరాబ్జయుగ్మమున ద్దోశాలి క్షేమా౦ఘ్రులన్ -వీకన్ జేరిచి సేవజేయు నిను నేప్రీతిన్ దగన్ గొల్చెదన్ –సాకల్య౦బుగ నందుకూరి పురవాసా యా౦జ నేయప్రభో ‘’.రెండవ పద్యంలో క్లిష్ట ప్రబంధ రచనలో మేధాశాలి ,పౌరాణిక విస్తరణ వాణీ శుక సామ్యు లక్ష్మణ కవి స్తవనీ యుడని,ఆంజనేయుడే అనాదిమూర్తి అనీ ,సృష్టి స్థితిలయకారకుడని ,యజ్ఞాదికర్మలను పోషించే సత్కర్త అనీ ,రామ క్లేశ విదారకుడని ,దైత్యరాజ సంహర్త అనీ ,వినయాకార సద్భక్తి చిత్తుడు అనీ ,’’జలధిన్ దాటి సురారి పట్టణాన్ని సప్తార్చిషున్ చేశాడని ,నిగమాగమాలు ఆయన వద్ద వర్తిల్లుతాయని ,దురితాబ్ధి లో ఈదేవారికి ఏడుగడ ఆయనే అనీ,చెప్పాడు
తర్వాత తనఇంటి పేరు పరాశర తనపేరు నరసింహ వచ్చేట్లు పద్యం ప్రారంభాక్షరాలను ఉంచి పద్యాలు ఆశువుగా అందంగా రాశాడు .దాస్యాది సమస్త కస్ట దశలలో స్వామి నామకీర్తనమే శరన్యమన్నాడు .తనకు లే ప్రాయంలో కవిత్వం శాస్త్రపరిజ్ఞానం అబ్బటం స్వామి కృపమాత్రమే అనీ,పద్నాలుగవ ఏట పౌరాణిక విద్ఫుత ధైర్యం ఇచ్చాడని ,’’న మాతుః పర దైవతం ‘’అనీ ,స్వామి నామ రసైకపానంతో మత్తిల్లిన భక్తితో రాసిన శతకమని ,శత మత్తేభాలతో కూర్చిన ఈ శతకాన్ని ఆదరించమని కోరాడు .తండ్రి శేషాచార్యుడు తల్లి లక్ష్మా౦బ.వందవ మత్తేభం లో –‘’అల యుష్మత్క్రుతమయ్యు నొప్పు శతకం బా చంద్ర తారా-ర్క మై యలరున్ గావుత ,భూమినంచు నిరతంబా శీస్సు –లందిమ్ము నాకిల ,నీ కబ్బము ‘’వే ‘’పతించు వినునో ఏ మాన-వుల్ ప్రేమ వారల శ్రీతో కుల జేయుచుండు బుధపాలా యాంజనేయ ప్రభో ‘’.అని ముగించి తర్వాత ఆంజనేయ దండకం రాశాడు .
ధారాశుద్ధి భక్తీ కవితా ప్రావీణ్యం నిండుగా ఉన్న యువకవి రాసిన ఈ శతకం మెచ్చదగినదే .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-9-23-ఉయ్యూరు

