శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం -2(చివరిభాగం )
రుద్రుడు లయకారుడు రుద్రబీజం చిన్ముద్ర .శంకరుడు ఆనంద రూపుడు .చిర శుభాకార మంగళుడు .శుద్ధ జీవుడు దేహ బద్ధ జడుడు .జ్ఞానాప్తితో జడత పోతుంది .బ్రహ్మమొక్కడే దృక్కు.కంటితో రూపం చూద్దాము అనుకొంటే మనసు కంటికి అదృశ్యం .మనసుతో చూద్దామంటే బుద్ధికి దృశ్యమై బద్ధమౌతుంది .బుద్ధి దృష్టితో తెలుసుకొందామంటే ధీ వృత్తికి దృశ్యమౌతుంది .దృశ్య సృష్టికి సాక్షి దృక్కు ..బ్రహ్మ సత్యం జగం మిధ్య .బుద్ధి నిర్మలమైతే ఈశ్వర విభూతి కలుగుతుంది .శివ ,జీవ సృస్టులతో జగత్తు వ్యష్టి సమష్టి అవుతుంది.బుద్ధికల్పితమే ఈ జగం.నువ్వు సూత్రాత్మకుడవైతే తే అన్నీ కనిపిస్తాయి .
విక్షేప శక్తి ప్రత్యక్షమై లింగమాది జన్మ జగత్సంగమైంది .అవ్యక్తాత్మలో మాయబ్రహ్మం ఉంటాడు .దేహం అసత్తు ,జడం ,క్లేశ వర్దితం .పూర్వ జన్మ పుణ్యంతో పుణ్య పాపాలు సంక్రమిస్తాయి .సృష్టికి పూర్వం బ్రహ్మం అఖండం మాయారహితం .ప్రాగభావం ప్రధ్వంసమౌతుంది .ఇంద్రియ ప్రాణ బుద్ధులు నువ్వు కాదు .ఆత్మకు అనాత్మలేదు .అవతల అయస్కాంత సన్నిధితో భ్రాన్తమైనట్లు ,జపాపుష్పకాంతులు స్ఫటికం లో ప్రతిఫలించి నట్లు ఉంటుంది.వడ్ల గింజకు పొట్టు ఉన్నట్లు ,ఒరలోని ఖడ్గం లాగా ఆత్మ భిన్నంగా ఉంటుంది .
శుద్ధ పరమాత్మ శ్రుతులకు అందడు .సుఖమే ఆత్మగా దృక్కుగా ఉంటాడు .వస్తువు ఉంది, లేదు.చిత్తానుభవంతో సర్వజీవ జగాలు కనిపిస్తాయి అవినిజంగాలేవు .సూక్ష్మగా స్తూలంగా ఉంటాయి .ఈశ్వరానుభవం కలిగితే ముక్తి లభిస్తుంది .బ్రహ్మ వస్తువు .తానూ బ్రహ్మమే అవుతాడు .జ్ఞానాన్ని దాచి అజ్ఞానాన్ని కనిపింప చేసేది భ్రమ .భావాద్వైతం క్రియాద్వైతం అని రెండున్నాయి .చిద్విశేష విలాస చిహ్నమైనది భావాద్వైతం శ్రేష్టమైనది .పూర్ణ యోగాభ్యాసంలో క్రియా ద్వైతం సహకరిస్తుంది .రేచకం లో విశ్వం అనశ్వరం పూరకం లో బ్రహ్మమే .నూట రెండవ పద్యంలో –‘’రత్నాకరంబున క్షారజలంబు నిలిచి శుద్దాంబువుల్ రవిరశ్మి నాకసమున –వరలి మేఘాకృతివర్షించు కరణి బో-ధానంద సాగర౦బదు వెలయు –పరమ రసామృత వర్షధారల దొప్ప –దోగుచు బ్రహ్మ సాధుత్వ మెరిగి –పద్యపద్య౦బున పరమ సిద్దేశుండు –మకుటమందున నొప్పుమహిమ గాంచి
తేగీ.-బ్రహ్మవిత్పాజ పంకజ భక్తుడైన –కొట్ట మన్వయ వారాసి కుముద హితుడు-రమ్య గుణు౦డు రామస్వామి రచన జేసే –గ్రంథమియ్యది సిద్దేశు కరుణ వలన ‘’అని ముగించారు .
పద్యాలన్నీ పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి గారి ‘’సీతారామాంజనేయ సంవాదం ‘’లోని రసధారతో అవ్యక్తానంద శోభాయమానంగా ,సుబోధకంగా ,మనసుకు హత్తుకోనేట్లు అవ్యాజాను భూతి నిచ్చేట్లు శతక రచన సాగి చరిత్రలో వన్నె కెక్కిన శతకరాజమైంది .ఈ శతకానికి ముందుమాటలు రాసి ఆశీస్సు లందించిన వారంతా కవి దిగ్గజాలు ,అవధాన సరస్వతులు ,బహు కావ్య నిర్మాణ చాతురీ మతులు .వారి స౦సర్గం లభించటం గొప్ప వారి ఆశీస్సులు అందుకోవటం మరీ గొప్ప .ఇలాంటి శతకాన్నీ, ఈకవీశ్వరుని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు లభి౦చటం నా అదృష్టం.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-23-ఉయ్యూరు .

