97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం
సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో
97 వ శతకం –శ్రీ సిద్దేశ్వర శతకం
గుంటూరుజిల్లా పల్నాడు తాలూకా రాయవరం వాసి శ్రీచిదంబర గురుస్వామి శిష్యుడు శ్రీ కోటయాఖ్య కవి శ్రీ సిద్దేశ్వర శతకం రచించి ,గుంటూరు అనసూయ ముద్రాక్షర శాలాలో 1933లొ ముద్రించారు .వెల తెలుపలేదు .ఇది కంద శతకం .’’సిద్ధేశ్వరా అనేది శతక మకుటం .
శార్దూలం లొ ‘’శ్రీ వైకుం ఠనీవాన దేవా విలసచ్చిన్మాత్ర తత్వంబవై ‘’అంటూ స్వామి విభూతిని ప్రశంసించి ,గురు చిదంబరస్వామిని సన్నుతించి ,తర్వాత ‘’శంకరతనయా గజముఖ ‘’అంటూ వినాయకుని ,’’పారావారము దాటి లంక కెలమిన్ బల వేగమొప్పారగా ‘’దాటిన ఆంజనేయస్వామిని ,సరస్వతిని చిత్తం లొ నిల్పి ,’’ఏ దేవతా శక్తి వేద శాస్త్రములకు తల్లియై తనరుచుండు ‘’అని ‘’దేవీ స్తౌత్యం ‘’చేసి ,వాల్మీకాది కవి స్తుతి చేశారు కవి .సీసమాలికలో తన వంశావళి వివరించారు –తండ్రి వెంకయ్య రమ్యమూర్తి ,తల్లి అచ్చమాంబ .మేనమామఅల్లయ్య ,తమ్ముడు కృష్ణయ్య .భార్య రామ లక్ష్మమ్మ .వీరికోడుకులు హనుమయ్య వెంకయ్య కోటయ్య .వారిభార్యాలు కోటమ్మ వేంకట రామమ్మ లచ్చమ్మ .కుమార్తెలు కాత్యాయని ,అంతమ్మ బాలకోటమ్మ,అచ్చమ్మ .వీరయ్య మొదటికుమారుడు హనుమయ్యకు వెంకట రాములు .రెండవకుమారుడు శ్రీరాములు .మూడవకొడుకు కోటయ్యకు పుట్టిన కూతురు రామ లక్ష్మ .ఈమెకు వీరయ్యకు పుట్టినవాడు మనకవి కోటయ్య .
తర్వాత శతకం అంతా శివ స్తుతే –‘’శ్రీ రజతాచల వాసునికోరి భజించెదను నాదుకోర్కులు మీరన్నేరుపుతో నీ సత్కృతి భారకుడవు నీవే యంచు భజింతు శివా ‘’అని మొదలుపెట్టి ‘’రజతగిరివాసా , పరమేశ సింధు గంభీర ఈశా ,మారసంహార శశిధరా’’కృపతో చూడు అన్నారు .అండపిండాలు నీలో నిండి ఉంటాయి .మార్కండేయుని బ్రోచినట్లు కాపాడు .ఎంతపిల్చినా పలకవు అని ,కోటిసూర్యప్రకాశంతో కైలాసంలో ఉంటావు ,గిరిజ వామామ్కంలో ఉంటుంది .మూలం లేని జగతి నిర్మూలనమౌతుంది .ఆదిమునులు నిన్ను సర్వేశ్వరుడు అని కొలిచారు .గరళం మింగి లోకాలు కాపాడావు .ఆపదోద్ధారకుడవు .నిన్ను వర్ణించటానికి ‘’ఫణివిభుడు కూడా చాలడు.కోటి మంత్రాలు శివమంత్రం ముందు నిలవవు .
సర్వభూతాలకు నువ్వే సాక్షి ‘’ .’’పంచ శిరాలలో శ్రీ గంగ కుదురుగా కూర్చుని ఉంటుంది .కైలాసంలో నీ గణాలు పరివేష్టించి నిన్ను కోలుస్తుంటే వామభాగంలో ఉమాదేవితో చిన్మయానందం అనుభవిస్తూ భక్తులకు వరదాయిగా ఉంటావు .గౌరికి శ్రీరామనామ మహాత్మ్యం బోధించి నిత్యం స్తుతి చేసేట్లు చేశావు .అనమస్కము నిరాకార సా౦ఖ్యము బోధించావు .ఆరు అక్షరాలతో హరుడుగా వెలుగుతున్నావు .మణులహారంలో ఆధారంగా జగాలన్నీ అణగి ఉంటాయి .సిద్దేశ్వరంలో క్రవ్యాదుడు నీమహిమ బోధించాడు .నీపాదాల పూజించే వరమిమ్ము .తేరాల వాసుడవు కృపా సి౦ధుడవు .భావంలోనే కనిపించే భవ్యుడవు.సిద్దేశ్వర క్షేత్రంలో శివరూప కళలతో శిద్ధీశుడు అనే పేరుతొ తేరాలలో ఉన్నావు .అని 146కందాలు అందంగా చెక్కారుకోటయ్యకవి. చివర మంగళమూ పాడారు .’’సిద్ధే శ్వర ఈ శతకము శుద్ధంబుగసంస్మరింప శుభ సౌఖ్య౦బుల్ – సిద్ధించు జదివి,వ్రాసిన శిద్ధులకు గల్గు మోక్ష సిరులీ భువిలో ‘’అని గ్యారంటీ ఇస్తూ ముగించారు .
సరళపద సపద తో ఆడంబర హడావిడి లేకుండా మనసులోని భావధారను ప్రవహింప జేసి సిద్ధే శ్వర శివునికి అంకితమిచ్చి ధన్యమయ్యారు కవి .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-23-ఉయ్యూరు–

