సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-2 వ భాగం (చివరిభాగం ).

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో

99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-2 వ భాగం (చివరిభాగం ).

జనార్దన శతకకర్త శ్రీ బులుసు వెంకటరామమూర్తి శతకలో తనజన్మభూమి ‘’వీరబొబ్బిలి ‘’గురించి ఘనమైన సేసపద్యం రాసి ,తర్వాత తేట గీతిలో తన వంశం గురించి చెబుతూ ‘’తమదియాగాలు చేసి సోమయాజి లైన  బులుసు వంశమని,తను కవిగాయక విబుధనిలయమైన విజయనగర వాస్తవ్యుడనని,చెప్పి చంపలమాలలో శారదా,విఘ్నేశ్వర  స్తుతి చేసి ,గురు ప్రణామం చేసి ,కాళిదాసాది కవులప్రస్తుతి చేసి ,శతకం ముద్రించిన ఈదర వెంకటరావుగారికి కృతజ్ఞత చెప్పి రంగంలోకి దిగారు .

  మొదటి చంపకం లొ-‘’శ్రీ రమణీ మణీ విమల చిత్త నివాస ,వికర్మ దుష్క్రియా –వార నివాస ,సద్విషయ వర్గ విలాస ,మణీవికాస –వి-స్ఫార కృపాభి రక్షితనిజస్మరణ స్థితి దాస భవ్య శృ౦ –గార  గుణాభిలాష నను గావు ననంత కృపన్ జనార్దనా ‘అని మొక్కుకొన్నారు .తరణం పీడా సంహరణం ఆశ్రిత భరణం అయిన నీ స్మరణం భవ బంధ హరణం అన్నారు .కుచేలుని గజేంద్రుని కాచిన వేల్పు అని ,కురుక్షేత్రయుద్ధంలో పార్ధుని రధసారదివై ధర్మ రక్షణ చేశావు ,ద్రౌపదీ మాన సంరక్షణ చేసి సురవందితుడవయ్యావు .లలితకలావిలాస బహుకోమలకోమల కీర్తిశాలి వి. నీ విలాసమే సకల జగత్తు .’’గంగను తెచ్చి నీ పదపంకజమూలన్ కడగంగా కల్మష హీనమై వెలుగొంది ,పాలంగడుగంగ నిరంతర వాసం పాల సంద్రంలో ఉంటున్నావు .

  పదాలు తొట్రిలుతున్నాయి ప్రాయం చిన్నది .రవిరాహువులు సప్తమంలో శుక్రుడు ఉచ్చలో ధనుస్సులో శనిబుధ గురులు అష్టమం లొ ,తొమ్మిదిలో చంద్రుడు నీచం లొ ఉన్నప్పుడుతులాలగ్నం లొ  పుట్టాను.అని తన జ్యోతిష పాండిత్యాన్ని ప్రకటించారు వందనమార్యసననుత శుభస్థితి దాయక తార్ఖ్య వాహనా వందనం అని శరణు చెప్పారు నూరవ పద్యం లొ తనది గౌతమ గోత్రమని తప్పో ఒప్పో చంపక మాల శతకం కూర్చి నీకు సమర్పించాను గ్రహించి ముక్తినివ్వు .చివరి 101 పద్యం లొ’’మంగళమార్త రక్షక ,రమాధవ సజ్జనలోక సన్నుతా-మంగళమబ్జనాభ ,గుణ మండన ,,చారు కటాక్ష యుక్తి చే –మంగళ సౌఖ్య సంపదలమాకొనర్చి ,కృపాబ్ధినేలు మా-మంగళరీతి నభ్యుదయమార్గము జూపి కృపన్ జనార్దనా ‘’అని ముగించి గద్యంలో ‘’గౌతమస గోత్ర పవిత్ర బులుసు బుచ్చన్న పౌత్ర ,నరసింహశాస్త్రిపుత్ర ,లక్ష్మీ నరసా౦బా గర్భ ముక్తాఫల అస్టావధానాశుకవితావిలాస  వేంకట రామమూర్తి శర్మకృత జనార్దన శతకం ‘’అన్నారు .

  దారాశుద్ధికల కవిత్వం .పండిత విరాజితం .ఔచిత్య పోషణం .సకల రసాను సంధానంగా జనార్ధన శతకం పండించారు అష్టావధాని శ్రీ బులుసు వేంకట రామమూర్తికవి .  కవిత్వాన్ని గూర్చి మహామహులు చెప్పిన మాటలన్నీ తెలియజేశాను కనుక అంతకంటే ఎక్కువ చెప్పక్కరలేదు .

మీ-గబ్బితడుర్గాప్రసాద్ -13-9-23- ఉయ్యూరు         

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.