సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమా ‘’జైలర్ ‘’ను మొన్నరాత్రి మా మనవడు చరణ్ మద్రాస్ నుంచి ఫోన్ లొ ‘’తాతా !ప్రైం లొ జైలర్ ఉంది చూడు బాగుంది ‘’అని చెబితే ,నిన్న చూశాను .పాపం ఆవయసులో వంగాలేకా నడవలేక గెంతలేక ఒక చిరునవ్వుతో సినిమాను రోబో నడిపినట్లు నడిపాడు రజని .ప్లాట్ మామూలే .అయితే అతన్నిఎలివేట్ చేసిన విధానం సూపర్ .ఈ క్రెడిట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కకే దక్కుతుంది .అనిరుథ్ రవి చందర్ సంగీతం అందించాడట .అసలు పాటలున్నాయా లేదా అని పించి౦దినాకుమాత్రం .సినిమాటోగ్రఫీ విజయ్ కార్తిక్ కన్నన్ విజయమే సినిమా విజయం .కామెడి నటుడు సునీల్ ,అరవనటుడు మోహన్ లాల్,తమన్నా పీలికల డ్రెస్ తో చేసిన గెంతుల్లాంటి డాన్స్ ,నాగబాబు ల పాత్ర వెగటు పుట్టిస్తుంది .వాళ్ళ సన్ని వేశాలు తీసేసి ఉంటే ఒక అర గంట సినిమా నిడివి తగ్గి మరింత కాంపాక్ట్ గా ఉండేదేమో .రజని సినిమాలలో ప్రత్యర్ధి పాత్ర పోషించే రమ్యకృష్ణ సైలెంట్ గా భర్త విధేయురాలిగా ,’’డూడూ బసవమ్మ’’లా తలాడించి నటించింది .సినిమాలో నటనలో హైలైట్ అయిన వాడు మాత్రం విలన్ వర్మగా నటించిన వినాయకన్ .ఏ యాంగిల్ లొ చూసినా సుపర్బ్ పెర్ఫార్మెన్స్ అతడిది .రజని మనవడు రుత్విక్ గా తాతను ‘’ముత్తూ’’అని పిలుస్తూ ముద్దుముద్దు మాటలతో మురిపించాడు .తీహార్ జైలు జైలర్ గా రజని అటూ ఇటూ చక్కర్లు చేస్తూ చేతి టెలిఫోన్ ద్వారానే పనులన్నీ చక్కబెడుతూ మట్టుపెట్టాల్సిన వారిని మట్టుపెడ్డుతూ రోబో లా అన్నీ చేసేస్తాడు .అలాగే రజని ఇంట్లోకి వచ్చిన వర్మ అనుచరుల్నీ అలాగే సైలెంట్ కిల్లర్ లా చంపి పారేయిస్తాడు .అంతే చేతికి మట్టి అంటకుండా ,ఇన్ షర్ట్ నలక్కుండా ,చిరునవ్వు చెదరకుండా చి౦పేశాడు .డైలాగ్ డేలివరిలో’’ మనో ‘’ అనే మన గాయకుడు నాగూర్ బాబు అనే నాగూర్ సాహిల్ రజని జీవించాడు .ఈ క్రెడిట్ అంతా మనోకే దక్కింది . వర్మ బందీ నుంచి విడుదలయిన రజనికొడుకు అర్జున్ ఇంటికి వస్తే ‘’నాకేమైనా చెప్పాలా ?’’అని రెండుమూడు సార్లుఅదగతం లేదని అతడు అనటం ‘’ఎందుకైనా మంచిది ఈ పిస్టల్ ఉంచు ‘’అని రజని ఇవ్వటం ,చివరి సీన్ లొ వాడు తండ్రినే చంపే స్థితిలోకి రాగా వాడి చేతిలోని గన్ రికాయిల్ అయి వాడినే చంపేయటం మాత్రం బాగా తీశాడు డైరెట్రు .దాదాపు మూడు వందలకోట్లు ఖర్చు పెట్టి చేసిన ఈ సినిమా ఆరువందలకోట్లకు పైగా వసూలు చేసిందట .చూస్తున్నంత సేపు సినిమా బాగానే ఉంది.ఇదంతా రజని మహాత్మ్యమే .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-23-ఉయ్యూరు

