శ్రీ సువర్చలాంజ నేయ దేవాలయం లో నవరాత్రి మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమం
ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారి దేవాలయం లో శ్రీ శోభకృత్ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 15-10-23 ఆదివారం నుండి దశమి పర్యంతం 23-10-23 సోమవారం వరకు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ,సాయంత్రం 6-30గం .లకు శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి వారలకు అష్టోత్తర సహస్రనామ పూజ ,శ్రీ లలితాదేవి అమ్మ వారికి ప్రతి రోజు విశేష అలంకారం ,అష్టోత్తర పూజ నిర్వహించ బడును . విజయ దశమి నాడు సాయంత్ర పూజ తర్వాత శమీ పూజ జరుగుతుంది .భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులు కాగలరు .
కార్యక్రమం
15-10-23 ఆదివారం నుండి 23-10-23 సోమవారం వరకు –సాయంత్రం -6-30 గం లకు స్వామివార్లకు ప్రత్యేక పూజ అనంతరం ,నైవేద్యం ,మంగళహారతి, తీర్ధ ప్రసాద వినియోగం .
20-10-23-శుక్రవారం –మూలా నక్షత్రం –శ్రీ సరస్వతి దేవి పూజ –బాలబాలికలచే
22-10-23-ఆదివారం –శ్రీ దుర్గాష్టమి
23-10-23- సోమవారం –మహర్నవమి ,విజయ దశమి –సాయంత్రం ప్రత్యేక పూజ తర్వాత శమీ పూజ జరుగుతుంది .
గబ్బిట దుర్గాప్రసాద్ –ఆలయ ధర్మకర్త -14-10-23-ఉయ్యూరు
మరియు భక్త బృందం

