మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -3
గయోపాఖ్యానం తర్వాత నాయుడుగారి కోరికపై చిలకమర్తి వారు ‘’పారజాతాపహరణం ‘’అయిదంకాల నాటకం1890 వేసవిలో రాశారు .నటించే నటులు పద్యాలు చదివే సామర్ధ్యం ఉంటే వారికి పద్యాలు రాసేవారు లేకపోతె వచనమే .సత్యభామ పాత్ర ప్రకాశం గారు పోషించి ఆయా రసాలను బట్టి ముఖ వైఖరి ,కంఠ స్వరం మారుస్తూ బాగా రక్తి కట్టించే వారని కవిగారు సంబర పడేవారు .ప్రేక్షకులు మహదానందంతో చప్పట్లు మారు మొగించేవారు .కైరవ పాత్ర తాతయ్య నాయుడు వేసేవారు .కృష్ణుడు వేసే పిళ్ళారి శెట్టి రామ కృష్ణమ్మ నాయుడు పద్యాలు చదవ లేకపోవటంతో వచనమే రాశారు. తర్వాత కృష్ణుడికీ పద్యాలు రాశాను అని కవి గారు ఉవాచ .నెప్పల్లి బుల్లి కృష్ణయ్య చిన్న చిన్న స్ట్రీ పాత్రలు ధరించేవాడు .నాట్యం మనోహరంగా చేసేవాడు .
ఆకాలం లో మద్రాస్ పచ్చయప్ప కాలేజి తెలుగు పండితులు శ్రీ కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గుంటూరు నాటక సమాజానికి చాలా వచన నాటకాలు రాసిచ్చారు .ఈ సమాజం 1884 డిసెంబర్ లో రాజమండ్రి వచ్చి చాలానాటకాలు ప్రదర్శించారు .నాటక సమాజ సభ్యులలో దేశాభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు కూడా ఉండేవారు .ఈ సమాజం ప్రదర్శించిన ‘’యుగంధర, హరిశ్చంద్ర నాటకాలు ‘’అద్భుతం అన్నారు చిలకమర్తి .జనం విశేషంగా ఆక ర్శింప బడేవారు .శైలి సులభంగా ,ప్రేక్షకులకు అందు బాటులో ఉండేది .హనుమంతరావు నాయుడుగారి రాజమండ్రిలోని ‘’హిందూ నాటక సమాజం ‘’కూడా అందుకే వచన నాటకాలే ఆడేవారు .నాయుడు ,ప్రకాశం గార్ల అద్భుత నటన ఉండటం తో వీరి నాటకాలలో పద్యాలు లేవు అన్న వెలితి ఉండేదికాదు .నటులంతా క్రమ శిక్షణ పాటించే వారు .తాగుడు సిగరెట్ బీడీ వగైరాలకు దూరంగా ఉండేవారు .అయితే సూత్రధారి సాతాని రామానుజయ్య ఇంటి దగ్గరే’’ బాటిల్ లేపి’’ వచ్చేవాడు .ఒకసారి 1890లో అతడుతాగి రంగస్థలానికి రాగా ,నాయుడుగారు కోపంతో తిట్టి ఇంటికి పంపించేశారు .పశ్చాత్తాపం చెంది నాయుడు గారి కాళ్ళ మీద పడి వేడు కొని అప్పటినుంచి మళ్లీ ఎప్పుడూ ‘’బుడ్డి ‘’ఎత్తలేదు రంగస్థలం పై అన్నారు చిలకమర్తి .ఒక సారి కిర్లం పూడి నుండి బండీలో వెడుతూ మందుకోడుతూ ,తెల్లార్లూ జాగారం చేసి పిఠా పురం చేరే సరికి బండిలోనే ‘’ఠా ‘’అయ్యాడని బాధపడ్డారు కవి .అతనంత గొప్ప సూత్ర దారుడు తమకు మళ్లీ దొరకలేదని బాధ పడ్డారుకూడా .తర్వాత వల్లూరి సూర్య ప్రకాశరావు ,రాయవరపు హనుమంతరావు లు ఆలోటు పూరించారు .ఒకసారి పిఠాపురం నుంచి కంచి ఆనందరావు గారు వచ్చి హాస్యం చెప్పారట .ఆయనది కాకినాడ .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-11-23-ఉయ్యూరు

