’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు
‘’పొ ద్దుటిపూట ఎనిమిది గంటల ప్రాంతం లో , ఒక ఎర్ర చెంగావిబట్ట కట్టుకొని, కఫ్పు పెట్టినషర్టు తొడుక్కొని, పట్టే నామాలు ధరించివున్న వారొకరు లోపలినుండివచ్చి . కచేరీచావడిలో నేలమీద పారచిన ఒక చిన్న కుషన్ మీద కూర్చున్నారు , వారికి సుమారు అరవై ఏళ్ళ నయ స్పుం[టుంది. చిన్నప్పుడు దట్టంగా పోసిన స్ఫోటకపుమచ్న లింకా ఆ మొగంమీద కనిపిస్తూ చేవున్నాయి ., కొంచెం స్థూల కాయం . ; నలుపు ఛాయ, డాబులేను ; దర్పం లేదు. వారు కూర్చున్న చోట ఎడమవవైపూనా ఒక చంగుకా పెట్టె, ముంచుప్రక్క_ ఒక డస్కు_ పెట్టి వున్నాయి, వచ్చిన పెద్దలూ, పిన్నలూ అందరూ అక్క_డి తివాచీలమిదనే కూర్చుండి పోతూ వచ్చారు, దానధర్మాలకూ, పారి(శామిక కార్యనిర్వా హక త్యానికీ ఖ్యాతి కెక్కిన రావు బహద్దూర్ మోతే వీరరాజు వారే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏలూరు నగ రాభివృద్ధికి జరిగిన కృపి. యావగ్తూ ముగ్గురు నలుగురు [ప్రముఖులకు సంబంధించినదిగా కని శీ మూతే గంగరాజాగారు పిస్తుంది. దివాన్ బహాద్దూరు సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులు, రావుబహాద్దూరు బడేటి వెంకట రామయ్యనాయుడుగార్లు మునిసిపల్ సంఘం ద్వారా . నగ రాభఫవృద్ధిని సాధిస్తే, రావు బహాద్దర్ మోతే గంగరాజు గారు విసుగు లేని తమ ప్రజోపకార కార్యాల ద్వారానూ, అవసరమైన సంస్కరణలతో ప్రజా సౌఖ్యాన్ని సంపాదిస్తున్నారు’’ Jఅని ఆయనను బాగా ఎరిగిన వారి కధనం.
ఏలూరు లో ‘’అన్న వస్త్ర దాన సమాజం ‘’స్థాపించి ,60వేల రూపాయలు మూల ధనం ఏర్పాటు చేసి ,రోజూ ఎంతమంది వచ్చినా భోజనం పెట్టి ఆకలి తీర్చారు గంగరాజు .పండుగ ,పర్వాలలో పిండి వంటలతో భోజనంపెట్టే వారు .చలికాలం లో వస్త్రాలు ఇచ్చే వారు .ఇలాంటి సంస్థ ఆంధ్ర దేశంలో లేనే లేదు.అలాగే గోరక్షణ సమాజమూ నిర్వహించారు .రావు బహాద్దర్ వేంకటరామయ్య గారు స్థాపించిన మిషన్ హైస్కూల్ ఎత్తేసే పరిస్థితి వస్తే ,అండగా నిలబడి విద్యా దానం కొనసాగించారు .ఏలూరు బందరు బెజవాడలలో దేశీయ విద్యాలయ స్థాపనకు ముందుకు వచ్చి నిర్వహించారు .ఏలూరు గాంధీ విద్యాలయానికి 25 వేల రూపాయలు విరాళమిచ్చిన విద్యాదాత ఆయన . వైశ్యులైన ఆయన కన్యకాపరమేశ్వరి సత్రానికి ,ఆర్య వైశ్య సభకు చెరొక పది వేలరూపాయలు అందించారు .జనార్దన స్వామి ,కన్యకా పరమేశ్వరి ఆలయాలను మహా యాత్రా స్థల్లాలుగా మార్చారు .
గంగరాజు గారు తమ ఇంట్లో కుమారుల కుమార్తెల వివాహాలకు కవి పండిత ,కళాకారులను ఆహ్వానించి సత్కరించి బహూకరించే వారు .స్ట్రీ సమాజాలకు ,పురమందిరం అంటే టౌన్ హాల్ కూ అండగా నిలబడ్డారు .ఏలూరులోని జూట్ మిల్ ఆయన స్థాపించి,విదేశీ మిల్లులతో పాటు అద్భుత ప్రగతి పధం లో నిర్వహించి ఆదర్శ ప్రాయులయ్యారు .ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన లాభాలను వాటాదార్లకు 25 లక్షల రూపాయలు పంచిపెట్టిన ఘనత ఆయనది .ఇంతగా అభి వృద్ధి చేసిన ఆయన మిల్లును ఇంకొకరి చేతిలో నమ్మి పెడితే మూలధనం అంతా హరించి ,అప్పులు పెరిగి మిల్లు కార్మికులు వేయి మందికి పని లేకుండాపోయి మిల్లు మూతపడింది .
14-5-1933 న గంగరాజు గారి షష్టి పూర్తి మహోత్సవం నభూతో గా జరుపుకున్నారు .పండితుల వేదా శీస్సులు మేళ తాలాలాతో ఊరేగింపు ,బ్రహ్మాండమైన వేదిక పై జరిగింది .తులాభారం జరిగింది .కాటాలో ఎడమవైపు ఆయన కూర్చోగా ,కుడివైపు వెండి గంగాళం లో వెండి రూపాయలు కుమ్మరిస్తుండగా ,కాటాముల్లు మధ్యకు వచ్చి ఆగింది .వేద పండితుల ఆశీర్వాదాలలతో కాటానుంచి దిగారు .కాటాలో తూగిన డబ్బు 20 వేల రూపాయలు దేశోపయోగ సంస్థ లకు , ,పండితులకు, ఆప్తులకు సంతృప్తిగా పంచిపెట్టిన వదాన్యులు ఆయన .
గంగరాజు గారిని ఎన్నో పదవులు వరించాయి .ఆనరారి మేజిస్ట్రేట్ ,పంచాయతి కోర్టు ,సహకార బ్యాంక్ ప్రెసిడెంట్ జిల్లాబోర్డు ,మునిసిపాలిటి సభ్యులు ,శాసన సభ్యులు .ఇన్ని పదవులలో ఉన్నా ఎవరికీ అపకారం చేయని మహాను భావులాయన .వివాహాలకు సప్తాహాలకు సంతర్పణలకు దేవాలయాలకు సత్రాలకు ఆయన అందించిన ధనం ఎంతో లెక్కలకు అందనిది .ఆయన గుండె పూడి ,విస్సన్న పేటల జమీందార్ .అయినా ఆరాజసం ,గర్వం ఆయనలో యే కోశానా కనిపించేదికాదు .అంత నిగర్వి .జనాభిమానం ,దీన జనాభిమానం మూర్తీభవించిన మానవతా మూర్తి .’’రాజా’’గారు అని ప్రజలు మనసారా పిలిస్తే ‘’,రావు బహాద్దర్’’ అని ప్రభుత్వం గంగరాజు గారిని గౌరవించింది .
ఇంతకూ మించి విశేషాలు నాకు లభ్యం కాలేదు . నెహ్రూగారు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించే ప్పుడు శ్రీమతి మోతే వేదకుమారి గారు శ్రావ్యంగా వందేమాతరం జనగణ మన గానం చేసేవారు .బహుశా గంగారాజుగారి కుటుంబం లోని వారే అయి ఉంటారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-11-23-ఉయ్యూరు

