నేను ఇప్పుడేతెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-44- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు
నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-4
4- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్ లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహా సభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు
ఆంధ్ర దేశం లో నూతన ప్రజాహిత జీవనానికి పునాది శ్రీ న్యాపతి సుబ్బారావు గారు వేస్తె ,దాన్ని పరిపక్వం చేసి సక్రమ రూపం కల్పించి మన కళ్ళ ఎదుట నిలబెట్టిన వారు దివాన్ బహాద్దర్ సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు.1868లో పశ్చిమ గోదావరిజిల్లా బాదంపూడిలో పుట్టిన వీరు న్యాపతి గారికంటే పన్నెండేళ్ళు చిన్న వారు .ఈయన పెరిగి పెద్ద వారయ్యే సరికి న్సుబ్బారావు గారు దేశీయ స్థానిక సంస్థలకు కొంత పునాది వేశారు .వాటి సమస్యలూ పెరిగాయి .వాటి గురించి తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచించి ఆచరణ చేయటానికి మోచర్ల వారికి గొప్ప అవకాశం కలిగింది .ఈయన తిరువలిక్కేణి హిందూ హై స్కూల్ లో ,,ప్రేసిడేన్సి కాలేజీ ,లా కాలేజి లో చదువు పూర్తి చేసి ,’’ఆండ్రూ లాంగ్ ‘’ అనే సొలిసిటర్ దగ్గర కొంతకాలం అప్రెంటిస్ చేసి , గోదావరి జిల్లా రెండుగా విడిపోయినప్పుడు, ఏలూరులో స్థిరపడి అక్కడ బార్ అసోషియేషన్ అధ్యక్షునిగా పదిహేనేళ్లకు పైగా పనిచేశారు. అక్కడే నగరపాలిక యొక్క తొలి ఛైర్మన్ గా ఎన్నికై పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాడు. ఏలూరులో ఈయన చేసిన సేవలకు ఒక పేటకు ‘’రామ చంద్రరావు పేట ‘’అని గౌరవంగా పేరు పెట్టారు ఏలూరు వచ్చి . జిల్లా రాజధాని నిడుదవోలుకు బదలుగా ఏలూరును చేయటానికి రామచంద్రరావే ప్రధాన కారణం. కొన్నాళ్ళు ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా బోర్డులకు అధ్యక్షునిగా పనిచేశారు. మోచర్ల రామచంద్రరావు 1914-4-10 నుండి 1919-11-15 వరకు విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం నకు తొలి అధ్యక్షుడిగా ఉన్నారు [1].
దీనితో ప్రజా సమస్యలు వారి పరిష్కార మార్గాలు గురించి పుష్కలంగా తెలుసుకో గలిగారు .వ్యవసాయం నీటిపారుదల ,అడవులు ,శిస్తులు ,విద్య, ప్రజారోగ్యం మొదలైన సమస్యలను క్షుణ్ణంగా అర్ధం చేసుకొని పరిష్కార మార్గాలు రూప కల్పన చేశారు .
ఎవరికీ ఏవిషయం చెప్పిన సూటిగా మెత్తగా చెప్పటం పంతులుగారి అలవాటు .ఆయన చేసిన సూచనలకు ప్రతి సూచనలు చేయటానికి ఎవరికీ వీలు ఉండేది కాదు .ఇంతటి విషయ గ్రహణం అమూల్యమైన పాండిత్యం ఉండటం చేత ప్రభుత్వం వారికి అనేక కమితీలల్లో సభ్యులను చేసి వారి అమూల్య సలహాలు తీసుకోనేది .లిట్తాన్ కమిటీ ,స్కీన్ కమిటీ సా౦డర్స్ కమిటీ ,రౌండ టేబుల్ కాన్ఫరెన్స్ వంటి అనేక సాబ్ కమిటీలలో ఆయన ఉండాల్సిందే .అనేక రిఫారం స్కీమ్స్ లో నూ ఆయన సభ్యులే .అనధికార సభ్యులుగా ఆయన ప్రజోపకారమైన అనేక సూచనలు ప్రభిత్వానికి చేసి అమలు పడేట్లు చూసేవారు .ప్రజల తరఫున సాక్ష్యం ఇవ్వటానికి 1919లో జాయంట్ పార్లమెంటరి కమిటీలు మొదలైన వాటి లో వెళ్ళి సాక్షమిచ్చి ప్రజోపకారం చేశారు . జాతీయ కాంగ్రెస్‌లో మితవాద వర్గంలో ఉండేవారు. మద్రాసు రాష్ర్ట శాసన సభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న కాలంలో ప్రజలకు అండగా ఉంటూ రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా కృషిచేశారు . 1924లో సాధారణ శాసన నిర్మాణ సభ సభ్యుడిగా నియమితులయ్యారు.
1927లో స్వదేశీ సంస్థానాల ప్రజల డిప్యు టేషన్ ను ఇంగ్లాండ్ తెసుకు వెళ్లారు మోచర్ల పంతులుగారు . రిజర్వు బ్యాంకు గవర్నరుగా అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు ఆయన ఆంధ్రోద్యమ నాయకుల్లో ఒకరు. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఆయన కార్యదీక్షత, నమ్రత, సేవానిరతిని గుర్తించిన ఆంధ్ర ప్రజలు ఆయనకు ‘దక్షిణ దేశపు గోఖలే’ 1932లో ‘’నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ‘’కు అధ్యక్షులయ్యారు .ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సూచనా ప్రభుత్వానికి చేసినా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్య తీస్సుకోనేది .ఆయన చెప్పిన సంస్కరణ అమలు జరగాల్సిందే .ఇలాంటి విషయాలలోమోచర్ల వారు రాష్ట్రానికే కాదు యావద్భారత జాతికి ఆదర్శమైన మణి పూస.దేశ నాయకులు ఆయన్ను ‘’దక్షణ దేశ గోఖలే ‘’అనే వారు మర్యాదగా .మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కృష్ణా గోదావరి జిల్లాల తరఫు సభ్యులుగా 12ఏళ్ళు ఉన్న ఘనత పంతులుగారిది .1924లో ‘’ఇంపీరియల్ కౌన్సిల్ ‘’సభ్యులుగా ఎన్నికయ్యారు .సహకార సంఘాలకు నిధులు పెద్ద ఎత్తున రాబట్ట టానికి తీవ్ర కృషి చేశారు .వారి సేవా నిరతి గమనించిన ప్రభుత్వం రాజబహద్దర్ ,కేయిజరే హింద్ స్వర్ణపతకం ,సర్ బిరుదు అత్యంత విశిష్టమైనవి ‘.మోచర్ల రామ చంద్రరావు గారు 1936 మే నెలలో తన 68వ యేట మద్రాసులో పరమపదించారు. సంతాపసభలో రైట్ హానరబులు వి.ఎస్.శ్రీనివాసశాస్త్రి ఈయనను దక్షిణభారత గోఖలేగా అభివర్ణించారు . రిజర్వు బ్యాంకు గవర్నరుగా అనేక ప్రభుత్వ కమిటీలలో సభ్యుడిగా పనిచేశారు . ఆయన ఆంధ్రోద్యమ నాయకుల్లో ఒకరు. 1916లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు .
మనవి-, ‘’నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం’’అన్న ఈ ధారావాహికకు ఆధారం –ఆంధ్రులైన శ్రీ ఆవట పల్లి నారాయణ రావు గారు బర్మాలోని రంగూన్ లోస్థిరపడి , 1940లో రచించి ,మద్రాస్ లో ముద్రించిన ‘’విశా లాంధ్రము ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-10-11-23-ఉయ్యూరు

