6-ప్రత్యేక ఆంధ్ర కు పునాదులు వేసిన న్యాయవాది ,సహకార రంగం పై ప్రత్యేకదృష్టిపెట్టి ,అంతర్జాతీయ సహకార సభకు ప్రతినిధి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు అయిన- శ్రీ వేమవరపు రామదాసు పంతులు గారు
హానరబుల్ వేమవరపు రామదాసు పంతులు (1873 – 1944) ప్రముఖ న్యాయవాది, సహకారోద్యమ ప్రముఖుడు. అఖిల భారత సహకార సంస్థల సంఘానికి అధ్యక్షుడు. 1935 నుండి 1944లో మరణించేవరకు ఇండియన్ కో-ఆపరేటివ్ రివ్యూ పత్రికకు సంపాదకత్వం వహించారు.[1]
వేమవరపు రామదాసు కృష్ణా జిల్లాలోని వేమవరంలో 1873 అక్టోబరు నెలలో జన్మించారు. ఈయన పసికందుగా ఉండగానే సంతానం లేని ఈయన పినతండ్రి రామదాసును దత్తతు తీసుకున్నాడు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో, మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, రామదాసు అనతికాలంలోనే స్థానిక న్యాయవాద సంఘంలో (బార్) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
1926 లో రెండవ వైస్రాయి కౌన్సిల్లో మద్రాసు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు.
రామదాసు 1913లో బాపట్లలో జరిగిన తొలి ఆంధ్ర మహాసభ సమావేశాల్లో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1936లో కాకినాడలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడరు. రామదాసు రాష్ట్ర సహకార సంఘానికి అధ్యక్షునిగాను, అఖిలభారత సహకార పత్రికాధిపతులుగాను ఉన్నారు
కృష్ణా జిల్లా సంఘం ,కృష్ణా జిల్లా సభ ,కృష్ణా పత్రికలతో ఆయనకు అనుబంధం ఎక్కువ .సామాన్యుల ,రైతులకు సేవ చేసిన మహానుభావులాయన. ఆయన విశాల భావాలకు ఇక్కడి రాజ కీయం సంకుచితం అని పించి మద్రాస్ చేరారు .వస్తూత్పత్తి విక్రయపద్దతి,సహకార పరపతి మొదలైన విషయాలను మద్రాస్ లో క్షుణ్ణంగా అధ్యయనం చేశారు .వీటన్నిటికి ఆర్ధిక విధానం ముఖ్యమని గ్రహించారు భూస్వామి, గొప్ప న్యాయవాది, రైతు బాంధవులు అయిన పంతులుగారు దృష్టినంతా సహకార పరపతి సంఘాలపై కేంద్రీకరించి రాష్ట్రానికేకాక యావద్దేశానికీ దిక్సూచి అయ్యారు. ఆంధ్ర ,ఆంగ్ల భాషలలోఅపార పాండిత్యం ఉన్న ఆయన యేది చెప్పినా రాసినా ,పరమ ప్రామాణికంగా ఉండేది .వాటితో సహకారోద్యమానికి ఊపిరులూది ,నిలబెట్టి ,వ్యాపింపజేసి అభి వృద్ధిలోకి తెచ్చారు .ఎలాంటి మారుమూల కుగ్రామం లో నైనా ,,ఎక్కడ సహకార నిధి ఏర్పడినా ,సంఘం స్థాపించ బడినా పంతులులు గారు రావాల్సిందే, వారి వాక్కు వినబడాల్సిందే వారి అమృత హస్తాలతో నెలకొల్పాల్సిందే .
హైదరాబాద్ వంటి స్వదేశ సంస్థానాలు కూడా రామదాసు పంతులు గారిని ఆహ్వానించి వారి సేవలను వినియోగించు కోనేవి .ఇలా భారత దేశ సహకారోద్యమానికి పంతులుగారు ప్రధాన ఆచార్యులయ్యారు .ఆయన ఎన్నో రాష్ట్రీయ ,దేశీయ సహకార సంఘాలకు అధ్యక్షులు .అంతర్జాతీయ సహకార సాంఘ సమ్మెళన సభ్యులు కూడా .లండన్ లో జరిగిన అంతర్జాతీయ సహకార సహకార మహా సభకు భారత దేశ ప్రతినిధి పంతులుగారు .సహకార సంఘ విచారణ ,,బ్యాంకింగ్ సంస్థల కేంద్ర విచారణ సంఘాల సభ్యులు ఆయన .మొదట మద్రాస్ ప్రేసిడేన్సి ‘’సహకార భీమా సంఘం’’స్థాపించిన ఘనులు పంతులుగారు .ఆంధ్రదేశ స్వరాజ్య పార్టీ అద్ద్యక్షులు .మద్రాస్ మహా జనసభ ఉపాధ్యక్షులు .స్టేట్ కౌన్సిల్ సభ్యులు .ఇలా వివిధ హోదాలలో ఆయన సహకార సంఘాలకు చేసిన సేవ చిరస్మరణీయం .స్టేట్ కౌన్సిలో స్వరాజ్య పార్టీ నాయకులై .ప్రజాభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించి ,తమ అనుభవాన్ని ప్రజాహితం కోసం ధారపోసిన త్యాగ మూర్తి ఆనరబుల్ శ్రీ వేమవరపు రామదాసు పంతులుగారు .74 వ ఏట మద్రాస్ లో మరణించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-23-ఉయ్యూరు

