, అలనాటి ఆంధ్ర మహాను భావులు (నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం)-7
7-ఆంధ్రభోజ ,సాహితీ వల్లభ ,కళాప్రపూర్ణ , గ్రంథ కర్త ,పారిశ్రామిక వేత్త ,రైతు నేస్తం తణుకు తాలూకా బోర్డ్ అధ్యక్షులు శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజుగారు
మహా భాగ్యవంతమైన భూస్వామి కుటుంబం లోజన్మించినా ,సామాన్యరైతుగానే నీరుకావి పంచ ,మోచేతులు దాటని ముతక చొక్కా బుజంపై ఏదో ముతక ఖద్దరు పైపంచ ధరించేవారు .మంచి సాహిత్య పరిజ్ఞానమున్నవారు తెలుగు సంస్కృతాలలో .ఆయన తన సాహితీ మిత్రులు నారాయణ శాస్త్రి ,సూర్య నారాయణా రాజు గార్లతో ఊరుకు దూరంగా ఉన్న తమ మామిడి తోటలో తరుచు కలుసుకొంటూ’’మృచ్ఛ కటికం ‘’లాంటి నాటకాలు చదువుతూ విశ్లేషించుకొంటూ ,ప్రాచీన కవులు సృష్టించిన పాత్రలను ,మానసిక ప్రవృత్తులను ,ఈకాలం వారి మనో వృత్తులకు ఉన్న భేదాలను క్షుణ్ణంగా చర్చించి అవగాహన చేసుకొనేవారు .తణుకు లాంటి పట్టణం లో ఉన్నా ఆర్భాటం లేని సాహిత్యోపజీవిగా తిమ్మరాజు గారు ఆంధ్ర దేశం లో ఆదర్శ ప్రాయులు .
ఆయన జీవితం గ్రామ పునరుద్ధరణకే అంకితం చేశారు .ఇర్రిగేషన్ అడ్వైజరీ బోర్డ్ ,,జిల్లా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ,,ప్రాధమిక విద్యాసంఘం వంటి ఎన్నో సంస్థలతో సంబంధం కలిగి తమ అదికారాన్నీ ,పలుకుబడిని ఉపయోగించి ప్రజోపయోగ కార్యక్రమాలు లెక్కలేనన్ని చేశారు .ప్రజాభిమానమే ఆయన ను తణుకు తాలూకా బోర్డ్ అధ్యక్షులుగా తొమ్మిదేళ్ళు పని చేయటానికి తోడ్పడింది .ఆ తాలూకా అభి వృద్ధి అంతా తిమ్మరాజు గారి వల్లనే సాధ్యమయిందని ప్రజలు ఘనంగా చెప్పుకొనేవారు .గ్రామాలలో పాఠశాలలు,వైద్యాలయాలు నెలకొలి విద్యా వైద్య సదుపాయాలూ కల్పించి ఎంతో పురోగతిని సాధించారు .
తణుకు పంచాయితీ బోర్డ్ అధ్యక్షులై ,మురుగు కాల్వలను త్రవ్వించి మురుగునీరు పారుదలకు ఏర్పాట్లు చేసి ప్రజారోగ్యం కాపాడారు .స్త్రీలకు ప్రసూతి చికిత్సాలయాలు స్థాపించి స్త్రీ, శిశు సంక్షేమానికి గొప్ప కృషి చేశారు .తమ వద్ద ఉన్న అపార గ్రంథ సముదాయ భాండాగారాన్ని తాలూకా బోర్డ్ వశం చేసిన వదాన్యులు .సంచార గ్రంధాలయాలను ఏర్పాటు చేసి గ్రామీణస్త్రీలకు వృద్ధులకు చదువుకొనే గొప్ప అవకాశం కల్పించారు .తణుకులో వివేకానంద పుస్తక భాండాగారం ,వార్తాపఠన మందిరం నెలకొల్పి యువతకు గ్రంథ పఠనాభి వృద్ధికి ,జ్ఞాన,వినోద , విజ్ఞానాభి వృద్ధికి దోహదం చేశారు .గ్రంథాలయ ఉద్యమాన్ని మనసా వాచా కర్మణా ముందుకు తీసుకు వెళ్లారు రాజుగారు పూనికతో అంతులేని ఉత్సాహంతో అంకిత భావంతో .
ఉండ్రాజవరం సంస్థానం తణుకు సమీపంలోని కాల్దరి గ్రామానికి చెందిన పెద్ద “జమీందారీ కుంటుంబం” నుంచి వచ్చిన ముళ్ళపూడి తిమ్మరాజు తండ్రి, ఉండ్రాజవరం సంస్థానాధీశులు,తణుకు జమీందారులు, రైతు రాయడు “శ్రీ ముళ్ళపూడి వెంకట్రాయుడు” గారు. “ఆంధ్రభోజ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు గారు” తణుకు పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త. సాహిత్యాభిలాషి. సాహితీ పోషకుడు.దేశసేవకుడు.విద్యాపోషకుడు.ముళ్ళపూడి తిమ్మరాజు సాహితీప్రియులు, కళాపోషకులు, జాతీయోద్యమం పట్ల అభిమానం కలిగిన ఆయన తాలూకా బోర్డు అధ్యక్షునిగా పని చేశారు. ఇతడు 1901 అక్టోబరు 10వ తేదీన ముళ్ళపూడి వేంకటరాయుడు, అక్కమాంబ దంపతులకు జన్మించారు. మరణించిన కుమారుడి పేరిట “శ్రీ నరేంద్రసాహిత్యమండలి”, “రాయల ప్రెస్” స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా పెన్మెచ్చ సత్యనారాయణరాజు గారి రాజానందము, వేదుల సత్యనారాయణశర్మ గారి బుద్ధగీత, ఆర్యచాణక్యుడు, కాకతి ప్రోలరాజు, తెన్నేటి కోదండరామయ్యగారి మాబడి, గోకులపాటి కూర్మనాథ కవి రచించిన సింహాద్రి నారసింహ శతకము, భద్రభూపాలుడి నీతిముక్తావళి, చల్లా పిచ్చయ్య వ్రాసిన ఉద్యానము ఇంకా గోస్తనీ మాహాత్మ్యము, శివయోగసారము, ముసునూరి కాపయ, సోమదేవరాజీయము మొదలైన గ్రంథాలను ప్రకటించారు. ఇతనికి “ఆంధ్ర భోజ, సాహితీవల్లభ, కళాప్రపూర్ణ” అనే బిరుదు ఉంది.[1]. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇతని కుమారుడు. ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు, జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్, ప్రాథమిక విద్యాసంఘము మొదలైన సంస్థలెన్నింటితోనో సంబంధం కలిగి తన అధికారాన్ని, పలుకుబడిని ప్రజాక్షేమానికే వినియోగించారు. వరుసగా తొమ్మిదేండ్లు తణుకు తాలూకా బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడురు. తన స్వంత గ్రంథాలయాన్ని “కళాప్రపూర్ణ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయం, సాంస్కృతిక కేంద్రము” తాలూకా బోర్డుకు అప్పగించి గ్రంథాలయోద్యమంలో పాలుపంచుకున్నారు[2].
రచనలు
· ఈడ్పుగండి రాఘవేంద్రరావుగారి సంగ్రహచరిత్ర
· ముళ్లపూడి తిమ్మరాజుగారి ఐతిహాసిక యాత్రలు
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-23—ఉయ్యూరు

