· , అలనాటి ఆంధ్ర మహాను భావులు-9
· 9-కవి పండిత పోషక ,దాన కర్ణ ,సంస్కర్త ,విద్యా వినయ ఔదార్యశీలి జమీందారు గాంధి , ,కళాప్రపూర్ణ -పిఠాపురం మహా రాజా శ్రీ రావు వేంకట మహీమతి సూర్యారావు బహద్దర్
· ధోవతిపై మోచేతులు దాటని చొక్కా తొ సాధారణంగా కనిపించే పిఠాపురం మహా రాజా శ్రీ రావు వేంకట మహీమతి సూర్యారావు బహాద్దర్
· ఆంధ్ర దేశంలో సేవావిధానానికి అంతటికీ కర్తా ,కర్మ క్రియ .ఉత్తమోత్తమ సంస్కారి .సంస్కారం మాటలతోకాదు చేతల్లో చూపాలని, చేసి చూపినవారు .కానీ ఆకాలం లో సంఘ సంస్కరణ పేరు చెప్పినా ,బాల్య వివాహాలు వద్దన్నా ,వితంతు వివాహాలు చేయాలన్నా ,అస్పృశ్యత వద్దు అన్నా పూర్వా చార పరాయణులు కస్సుమని ఒంటికాలిపై లేచి సంఘం నుంచి వెలి వేసేవారు .బిపిన్ చంద్ర పాల్ తొ కలిసి టీ తాగినా వెలి ,సముద్రయానం చేసి వచ్చినా ,ఆవచ్చిన వారింట భోజనం చేసినా వెలి ,ఆడపిల్లల్ని బడికి పంపితే వెలి .అలాంటి గడ్డుకాలం లో పిఠాపురం రాజా అందరికి అండగా నిలబడి సంస్కరణలు జరగటానికి పెద్ద ఎత్తున సాయం చేశారు .యువకుడు విద్యావంతుడు సేవానిరతుడు సంస్కరనాభి లాషి అవటంతో సంస్కరతలకు వెన్ను దన్నుగా నిలబడ్డారు కొండంత బలం వచ్చింది సంస్కరణ వాదులకు ఆర్ధికంగా హార్దికంగా వారిని ప్రోత్సహించారు. ఆయన చేతికి ఎముక లేని దీనజన బాంధవులు .శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి అమోఘ ప్రభావం పడి ,ప్రజాభిమానం ,పరోపకార పారీణత ,దేశ సేవా దురంధరులుగా మారారు .మొక్కపాటి సుబ్బారాయుడు అనే సుగుణ సంపన్నుడు రాజావారికి దివాన్ గా ఉంటూ మరింత కార్య శూరుల్ని చేశారు .ప్రాచీన విద్యలకు ఆదరణ ,దీన జనోద్ధరణ ,జ్ఞానవ్యాప్తి దాదాపు ముప్పై ఏళ్ళు నిరాటంకంగా కొనసాగించిన మహాను భావులు ఆయన .
· మహారాజా వారికాలం లో పిఠాపురం మహా గొప్ప పుణ్య క్షేత్రమైంది కవి పండితులకు నిలయమైంది , సకల కళోద్ధరణ జరిగింది.అభినవ భోజ ,అభినవ కృష్ణరాయలు అని ఆయన్ను అందరూ కీర్తించారు .పిఠాపురం ళో , రాజమండ్రిలో ఉన్నత పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తి చేశారు .కాకినాడలోని తమకాలేజీని సెకండ్ గ్రేడ్ నుంచి ఫస్ట్ గ్రేడ్ గా మార్చారు .ఉన్నత విద్యాభ్యాసలకోసం విదేశాలకు వెళ్ళే విద్యార్ధులకు ప్రోత్సాహంకల్పించి ఆర్ధిక సాయం చేశారు .రవీంద్రుని ఆహ్వానించి సన్మానించి పుష్పవర్షంతోపాటు కనక వర్షాన్నికురిపించి శాంతినికేతన అభి వృద్ధికి తోడ్పడ్డారు .
· అప్పటికి ఇంకా గాంధీకి అస్పృశ్యతా నివారణపై దృష్టికలగలేదు ఆయన కంటే ముందే ఆలోచించి రాజాగారు ,నిమ్నజాటి ఉద్ధరణకు పూనుకొని మహోపకారం చేశారు .హరిజన విద్యార్ధులకు సవర్నులతోపాటు సమాన స్థాయి కల్పించారు .హరిజన విద్యార్ధులకోసం కాకినాడలో ,పిఠాపురంలో హాస్టళ్ళు నిర్మించి భోజన వసతులు కల్పించి హరిజనోద్ధరణ నిండు మనసుతో చేశారు .రాత్రి పాఠశాలలు స్థాపించి వయోజన విద్యకు ప్రోత్సాహం కల్పించారు .గాంధీ హరిజనోద్ధారణం ప్రారంభించగా తనవంతు పూర్తి సహకారం అందించి హరిజన బాంధవుడు అని పించుకొన్నారు .డాక్టర్ బార్నాడో లాగా రాజావారు అనాధ శరణాలయాలు నెలకొల్పి అధోజగత్ సహోదరులకు కూడు నీడ విద్య అందించి ప్రగతి పధంలో నడిపించారు .దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్లు ఆ దేవుడే తామే అయ్యారు .స్త్రీసంక్షేమం ఆయన ఆదర్శం .రాజమండ్రిలో వీరేశలింగం గారు స్థాపించి అనాధ శరణాలయం ఒక్కటే ఉంది .పంతులుగారు చనిపోయాక తామేదాన్ని స్వీకరించి .ఖర్చు అంతా భరిస్తూ ,స్త్రీలకూ వితంతువులకు విద్యా విద్యలను ఉచితంగా అందించిన దేశోద్ధారకులాయన .పిఠాపురం లో బెత్సడా విద్యాలయానికి అనుబంధంగా స్త్రీలకూ శిశువులకు ఒక ప్రత్యెక వార్డు నిర్మించారు .అక్కడికి చికిత్స కోసం వచ్చే వారికి భోజన వసతి కలిగించటానికి ఒక ధర్మ సత్రం కట్టించి చక్కగా నడిపించారు .సంఘం లో కులటలుగా పిలువబడే వేశ్యలకు వివాహాలు చేయించి వారికి జీవన స్రవంతిలోకి మళ్ళించి సానులను సంసారినులను చేసిన మహోన్నత వ్యక్తి రాజావారు .ఇలాస్త్రీల క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడిన మానవోత్తములాయన . ఒక్కపూట అయినా తిండికి దిక్కులేక మాడిన డొక్కలతో కళేబరాల్లాగా ఉన్న దీనజనులకు సకల సదుపాయాలతో గృహాలు నిర్మించి ,పర్వదినాలతో పిండి వంటలతో సహా భోజనాలు పెట్టించిన దరిద్రజన రక్షకులు .బీదలకు మహిళలకు ఆరోజులూ ఈ మహారాజు చేసిన సేవ వేరెవరూ చెయలేదు.ఐరోపా యుద్ధ సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ధన సాయం చేసి ,పేదలకు ఉచితంగా బియ్యం ఇప్పించారు .భారతీయ యుద్ధ నిధికి ,చెన్నపురియుద్ధనిదికి భూరి విరాళాలు అందించారు .దక్షిణాఫ్రికా భారతీయ సహాయ నిధి ,క్వెట్టా భూకంప నిధి ,ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి సహాయ నిధి ,జార్జి చక్రవర్తి జూబిలీ నిధి,జ్ఞాపక నిధి ,క్షయ నివారణ నిధి మొదలైన వాటికి పుష్కలంగా ధన సహాయం చేసిన సుగుణ నిధి రాజావారు .
· పిఠాపురం రాజా వారి భాషాసేవ అమూల్య మైనది .మహాభాష్యానికి ఆంధ్రీకరణ చేయించారు .సీతా నాద తత్వ భూషణ్ గారి అమూల్య గ్రంధాలను ముద్రి౦పించారు . తెలుగు నిఘంటువును పునరుద్ధరించారు .పరిశుద్ధాస్తిక ధర్మ ప్రచారానికి చాలాపెద్ద మొత్తం లో మూల నిధి ఏర్పాటు చేశారు .బ్రహ్మ సమాజ ఉపాసకులకు కాకినాడలో దివ్య మందిరం కట్టించారు .పండిత శివనాద శాస్త్రి, హేమ చంద్ర సర్కార్ వంటి వారిని ఆహ్వానించి సత్కరించారు .విసుగు పుట్టే పరిస్తితుల్లోనూ నవ్వుతూ దానాలు చేశారు ,,పుచ్చుకొని పుచ్చుకొని విసుగు చెందేవరకు, ,సంస్కర్తలు తీసుకొని తీసుకొని సిగ్గుపడే దాకా పిఠాపురం మహారాజా ఇస్తూనే ఉన్నారు ఆ అభినవ దాన కర్ణులు. రాజాగారి మూర్తి మత్వాన్ని ఆవిష్కరించే పద్యరాజాలు –
· 1-‘’సీ-‘’వేదముల్ లాభము లేదంచు వదలిన- బ్రాహ్మణుల్ మరల జేబట్టినారు – శాస్త్రంబు లెల్ల నిష్ఫలములే యనుకొన్న –భూసురుల్ బఠియింప బూనినారు -కావ్య౦బు లింకకొరగావంచు విడిచిన –విప్రసత్తములు సేవి౦చినారు- కవిత ముమ్మాటి కక్కరకురాదనుకొన్న –ద్విజ వరుల్ దాని నర్ధించినారు
· తే- గానము వృధా యటంచు మాను కొన్న –పుడమి వేల్పులు నేర్వంగ గడగినారు –నీ కటాక్షంబు కలిమిని నేడు మరల –సూరిజన రక్షణోపాయ సూర్యరాయ ‘’.
· 2-సీ-‘’స్థాపించు చున్నావు శరణాలయము ల నాథ – జనంబులకు నెల్ల దయ దలిర్ప –నెలకొల్పు చున్నావు నిశి పాఠశాలల నిరుపేదలకు నెల్ల నెనరు మిగుల –బాలించు చున్నావు బ్రసవ శాలల స్త్రీల – కష్టముల్ గట్టెక్క కరుణ దనర -గట్టించు చున్నావు ఘన వైద్య శాలల –నోరు లేనట్టి జంతువులకెల్ల
· తే-నిలుపు చున్నావు సత్రముల్ నిండు వేడ్క –నార్తులకు నెల్ల నిత్యంబు నన్న మిడగ-నీ యుదారత వర్ణన సేయ దరమె-యారయ జనగేయ శ్రీరావు సూర్యరాయ .’’
· 3-సీ—‘’హూణ విద్యా పరితోషకుండవనంగ –నీ కళాశాలలే నిత్య సాక్షి –సరస గీర్వాణ భాషాభిమాని వనంగ –శాస్త్ర విద్యాపరిషత్తు సాక్షి –ఆంధ్రకవిత్వా హ్లాదుడవనంగ-నవ్య ప్రబందావనంబె సాక్షి -మానినీ విద్యాభిమాన మాన్యుడ వన-బాలబాలికాజన పాఠశాల సాక్షి-
· టీ- నిర్మలాస్తిక్య పదవుడవు నీ వనంగ –బ్రహ్మమతతత్పరంబె ప్రబల సాక్షి –నీకు సరి సేయ దగు నట్టినృపతులెవరు-సూరిజన గేయ శ్రీ రావు సూర్య రాయ ‘’
· 4-‘’ఇనుడ !నీ సాయమ్మపేక్షింప కుండ నే –పాఠశాలయు గట్ట బడుట లేడు –అనఘ !నీ తోడ్పాటు నంద కుండంగ నే –భోజనాలయము నిల్వ బడుటలేదు –ధర్మజ్ఞ!నీ దాన ధనము లేకుండ నే పఠన మందిరము నేర్పడుట లేడు – జనమిత్ర!నీదు బాసట లేకయుండనే –పరిషత్తు స్థాపింప బడుట లేదు
· తే-భూప రత్నమ ! యేప్రతిష్టాపనమును –సాగుటయె లేదుప్రేక్ష్యంబు లేక –చినుకులను ,జుక్కలను లెక్క చేయ వచ్చు –నీదు ధర్మంబుల గణియి౦ప రాదు సుమ్ము .’’
· 5- తే-‘’గాయకు౦ డైన బుధుడైన గవియు నైన –వాయువును బీల్చకుండిన వాడు ,నీదు –సాయ మొ౦దనివాడు భూస్థలిని లేడు – బళిర! శ్రీ సూర్యరాయ !విద్వద్విధేయ ‘’
· ఇప్పుడు రాజావారి జననాదులు తెలుసుకొందాం .
· రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివారు.

