గీతా జయంతి సందర్భంగా ‘’గీతా దర్శనం ‘’ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం
సాహితీ బంధువులకు గీతాజయంతి ,ముక్కోటి ఏకాదశి ,శ్రీ హనుమద్వ్రతం ,2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు –
1-ప్రస్తుతం ఉదయం పూట ప్రసారం చేస్తున్న భట్ట బాణ మహాకవి రాసిన74 శ్లోకాల ‘’చండీ శతక౦’’ ఎల్లుండి బుధవారంతో పూర్తవుతుంది .23శనివారం గీతాజయంతి,ముక్కోటి పర్వదిన సందర్భంగా బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ సోమయాజులు గారు రచించిన’’ గీతా దర్శనం’’ 19-12-23 మంగళ వారం నుండి ఉదయం ప్రత్యక్ష ప్రసారం జరుపుతున్నాం .’’ప్రస్థాన త్రయం ‘’అనబడే వ్యాసప్రోక్త బ్రహ్మ సూత్రాలు ,దశోపనిషత్తులు , భగవద్గీత లకు శ్రీ శంకర భగవత్పాదులు సంస్కృతం లో వ్యాఖ్యానాలు రాస్తే ,శ్రీ నోరి సోమయాజులుగారు వాటికి తెలుగులో అత్యద్భుత వ్యాఖ్యానాలు రచించారు .మనం బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులను నోరి వారి వ్యాఖ్యానం తో ప్రత్యక్ష ప్రసారం చేసుకొన్నాం .ఇప్పుడు భగవద్గీత పై నోరి వారి వ్యాఖ్యానం ప్రారంభిస్తున్నాం .అంటే దీనితో మనం కూడా ప్రస్థాన త్రయానికి శంకర భాష్యం, సోమయాజులు గారి వ్యాఖ్యానం తో పూర్తి చేస్తున్న అదృష్ట వ౦తులం అవుతున్నామన్నమాట .
2-ప్రస్తుతం సంస్కృత శ్రీ హర్ష నైషధం బ్రహ్మశ్రీ ఉడాలి సుబ్బరామ శాస్త్రి గారి తెలుగు వ్యాఖ్యానం తో ఉదయం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం .బహుశా ఒక వారం లో పూర్తి అవుతుంది .అవగానే శ్రీనాథ కవి సార్వ భౌముడు రచించిన ‘’శృంగార నైషధం ‘’మొదలుపెట్టి ఒక వారం లో పూర్తి చేసి ,ఆమహనీయునికి కవిత్వాన్ని ఆస్వాదిద్దాం .
3-శ్రీనాథుని శృంగార నైషధం పూర్తి అవగానే సంస్కృతంలో భట్ట బాణ మహాకవి వచనం లో రచించిన భారతీయ తొలి నవల ‘’కాదంబరి ‘’ని సంస్కృతం మరియు విద్వాన్ విశ్వం గారి తేట తెనుగు అనువాదం తో ప్రారంభిస్తున్నాం అని తెలియ జేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-17-12-23-ఉయ్యూరు

