(అజాత శత్రువు ,సమర్ధ ఉత్తమ ఉన్నత ప్రభుత్వాధికారి ,అనుపమ సాహితీ కల్పవల్లి- శ్రీ సోమేపల్లి

(అజాత శత్రువు ,సమర్ధ ఉత్తమ ఉన్నత ప్రభుత్వాధికారి ,అనుపమ సాహితీ కల్పవల్లి- శ్రీ సోమేపల్లి

‘’ఆతడజాతశత్రుడు ,అన్నిట ఆరియు తేరిన యోద్ధ ‘’అని ఆ నాటి ధర్మరాజును కవి వర్ణించాడు .ఈనాడు సమకాలీన సాహిత్య౦ లో అంతటి అజాత శత్రువు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు .ఎంతటి భారీ పర్సనాలిటీయో, అంతటి విశాల హృదయులు .నవ్వుముఖం తప్ప ,చిరుకోపం కూడా ప్రదర్శించని సాత్వికమూర్తి .తాను ఒకజిల్లాకే ముఖ్య అధికారి అయినా ,ఆదర్పం డాబు చూపని వినయ సంపన్నులు .అన్నీ తెలిసిన వివేక మూర్తి .తాను సాహిత్యజీవి కావటమే కాక, సాహిత్య పోషకులు కూడా .ఎక్కడ ప్రతిభ ఉన్నా కనిపెట్టి ప్రోత్సహించే సహృదయులు .సాహిత్యం లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామిగా ఉండాలన్న నిరంతర తపన ఆయనది .అందుకే గుంటూరు జిల్లా రచయితలసంఘం స్థాపించి ప్రోత్సహించి ,ఆతర్వాత రాష్ట్ర సంఘం ఉంటేనే ,రచయితలకు గుర్తింపు ,ప్రోత్సాహం ఉంటుందని అందరికంటే ముందే ఆలోచి౦చి,స్థాపించి, తీర్చి దిద్దిన మహనీయులు .సోమయ్య గారికి అన్ని విదాలాసహాయసహకారాలు అందించినవారు ఆసంస్థ ప్రధానకార్య దర్శి శ్రీచాలపాక ప్రకాష్ .ఒక రకంగా వీరిద్దరూ కృష్ణార్జునులై ఎన్నెన్నో విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ,ఆంధ్రప్రదేశ్ రచయితలసంఘాన్ని నడిపించారు ,ఆదర్శ వంతం చేశారు .

ఇంతటి తపన ఉన్న సోమే పల్లి వారిలో ఉన్న కవి ఎలా ఉన్నాడో దర్శిద్దాం .

లోకమంతా కోడై’’ప్రపంచం కుగ్రామం ‘’అంటుంటే కవికి ఆయన పల్లె మాత్రం ‘’విశాల ప్రపంచం ‘’గా దర్శన మిచ్చింది .ఇది కవిగారి విశాల దృక్పధానికి తార్కాణ .జీవన గమనం లో తత్త్వం ‘’రైలు ముందుకు చెట్లు వెనక్కు పరి గెత్తినట్లు ఉండటం నిజం . కర్షక కవికనుక ఆయన ప్రయాణం ఎప్పుడూ గణగణ లాడే గంటలతో ఉన్న జోడేద్దులతోకనుక ఒంటరి తనం అసలే అనిపించదు .వరద ఆగినా ‘’కన్నీరు వెల్లువగా ప్రవహిస్తూనే ఉంది. ఆకలి డొక్కముద్దకరువే కాని విలాసాల విస్తరికి దుబారా మోత లోక సహజంమర్రి చెట్టు ఇప్పటికీ’’ ఉమ్మడి కుటుంబమే ‘’ అది స్పూర్తి కూడా . పొలం పనిలో శ్రమ సౌందర్యం సూర్య చంద్రులు శ్రామికులకు చలువ పందిళ్ళుఎన్నికల వర్షానికి సంకేతం కాలుష్య మేఘం.చెప్పులజోడు లా మనుషులు ఎందుకు కలిసి ఉండరు అని థౌజండ్ డాలర్ క్వశ్చిన్ .చెమట చుక్కకు చేతులు జోడిస్తే మట్టి మరింత పరిమళ భరితంఅన్నదాతకు అజీర్తే –అధికంగా పెడుతోంది నీటి బువ్వ ‘’అనటం చూస్తె కవిలో మంచి భిషగ్వరుడు న్నాడనిపిస్తుంది. గాలికి ఊగేచెట్ల కొమ్మలు సమైక్యరాగానికి చిహ్నాలు . ముసలితనం లో చెట్టుకొమ్మ ఊత అయి,అయిన వారికంటే ఆప్తురాలౌతుంది .పూర్వం పది మంది ఒకే ఇంట్లో –ఇప్పుడు పది గూళ్ళల్లో ఒక్కొక్కరు ‘’అంటూ సైబర్ ఉద్యోగాలపై అపార్ట్మెంట్ కల్చర్ పై చెణికారు.భూమిలోని నెర్రెలు –పుడమి తల్లి కడుపు ఎండటానికి గుర్తు. కవితలలో పదాల పోహళింపు అబ్బురపరుస్తుంది . శ్రీ గోపి అన్నట్లు ‘’నిబ్బరమైన వ్యక్తిత్వం ,నిరంతర కవిత చింతనం ,మానవీయ వైఖరి శ్రీ సోమేపల్లి వారి సంపద’’ .

అంతే కాదు , సోమేపల్లి వారిది అసంబద్ధ అంతర్ముఖం ,సందర్భ బహిర్ముఖం అనిత్య వేదనం నిత్య సంఘర్షణ౦ .ఇప్పటికి మట్టి ముద్ద.కాలం జరిగాక తవ్వి చూస్తె –శిలగా మిగులుతానో –శిల్పమై ఎదురొస్తానో ,శిలాజంగా దొరుకుతా’తూటాలకు అంటిన మరకల్లో –నాదంటూ ఓ నెత్తుటి చుక్క ఉంటుంది –పారే ఉప్పునదులలో నాదీ ఒక పాయ ఉంటుంది –నవ్వే పెదవులలో నాదంటూ ఒక కారణముంటుంది ‘’అని మమైకమై ,చెట్టుకు పూసిన ఎండు మొలకల్లాంటి పిట్ట గూట్లో –ఫ్రీ కానుకలు పెట్టక్కర్లేదు –కొమ్మను కొట్టకుండా ఉంటె చాలు ‘’అని నేటి సామాజిక స్థితిని ఎన్నికల వాగ్దానాల్ని ఎండకట్టారు.మనువు వేర్లను కూడా తగల పెట్టేద్దాం అన్నారు .’’గుండె తొలవటం అమ్మతనం ‘’అని, మనల్ని మనం వెతుక్కోవాలంటే –మనల్ని మనం కోల్పోతూ౦డాలి ‘’.వెళ్ళే దారిని అడుగులకు చెప్పద్దు అన్నాడు ఎందుకుష ?తప్పించుకోలేని దృశ్యాల్ని తొక్కు తాయి కనుక –‘’. ‘’ఆటుపోట్లకు అదరను –బెదరను ‘’అని నిర్భయంగా చెబుతుంది ‘’అన్నదాత వెన్ను విరిగింది ‘’కానీ .’’ధరలదీ దళారులదీ-పంట పండింది ‘’అన్నారు .సాగులో సవ్య అప్పుడు ,ఎప్పుడూ- ఆకలికి ప్రత్యక్ష దీపం –అన్నదాతే’’అంటారు చేనుకు నీటి జవజీవాలనిచ్చే పిల్ల కాలువ ‘’నిత్యం పలకరిస్తూ ,పరవశిస్తుందట ‘’. రైతు జీవితం ఒక మహా భారతం కొంచెం ఘాటుగా చెప్పాలంటే ‘’మహా భరాటం’’.కనుక అతని ‘’కస్టాలు రాయాలంటే 18కాదు ఎన్ని పర్వాలైనా పడతాయంటారు .బోరుబావి’నీళ్ళలోనూ –ఊసర వెల్లి ఉందా ?-కొత్తనీరుకలిస్తే –రంగు మారుతోంది ? వర్షం రైతన్నకు హర్షం .అది ‘’దూరపు బంధువు –అందుకే –ఎప్పుడో కాని రాదు ‘’అని కవితాత్మకంగా దిగులు చెందామా ఊరే –మాకు గొడుగు –పిల్లా జెల్లల్ని –నడిపించేది పెద్దలే ‘.కాలుష్యపు కాలువ ‘’నీళ్ళతోపాటు నిప్పుల్నీ మోసుకొస్తుంది ‘’అని సామాజిక స్పృహతో చెప్పారు .నల్లడబ్బును కొండ చిలువతో పోలుస్తూ ‘’ఒళ్ళు విరుచుకొంటే –ఓట్లను కూడా మింగుతుంది ‘’అనే నేటి వోటు -నోటు కు దర్పణంగా చెప్పారు ..చివరి నానీ –‘’పల్లె మెడలో –పచ్చని మణిహారం –బారులు తీరిన – చెట్లదే సోయగం .‘

ఇలా ’’నానీలను రాసి లోయలో మనిషి, చల్లకవ్వం, తదేకగీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, తదేక గీతం మట్టి పొరల్లోంచి.చేను చెక్కిన శిల్పాలు వంటి రచనలతో అగ్రస్థానంలో ఉన్నారు . స్వీట్ చీట్, తర్వాత రంగుల ప్రపంచంలో అమ్మ,ఆశకు ఆవలివైపు, కథాకేళి, ఇంతే సంగతులు మొదలైన కథలు రాశారు సోమేపల్లి వెంకట సుబ్బయ్య రాసిన తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నల నానీల సంపుటాలలోని కొన్ని నానీలను ఎంపికచేసి “”శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య నానీలు” అని తలతోటి పృథ్విరాజ్ తను వ్యాఖ్యాతగా ఆడియో/వీడియో సీడీలుగా రూపొందించారు.

,ఇంతటి కవి భావుకుడు ఇతరకవులను ,రచయితలను ప్రోత్సహించటానికి కంకణం కట్టుకొన్నారు .చెప్పి చేయించటం కాదు తానే చేసి, చూపించి ,చేతల మనిషిగా ,ఆదర్శ మూర్తి అయ్యారు . తమ తలిదండ్రుల స్మృత్యర్ధం ‘’సోమేపల్లి సాహితీ పురస్కారం ‘’ఏర్పరచి ట్రస్ట్ ద్వారా జాతీయ స్థాయిలో చిన్న కధల పోటీ పెట్టి మంచికధలనునిష్పక్షపాతంగా ఎంపిక చేసి విజేతలకు’’ సోమేపల్లి పురస్కారం ‘’అంది౦చి సాహిత్యోప జీవి అయ్యారు . సోమేపల్లి వారి బహుమతి అంటే నిర్దుష్ట మైనదని, ఎక్కడా ఏవిధమైన అడ్డు దారులు ఉండవని సాహిత్యలోకం లో గొప్ప నమ్మకం కలిగించారు .ఆ బహుమతులు అకాడెమీ బహుమతులకంటేవిలువైనవని సాహిత్యకారులలో గొప్ప నమ్మకం కలిగించారు .ఈ పోటీకథలను ఎప్పటికప్పుడు పుస్తక రూపంగా తీసుకురావటం మరో అరుదైన అద్భుత విషయం .

వెంకట సుబ్బయ్యగారి జనన విద్యాభ్యాసాలు – వెంకట సుబ్బయ్యగారు 1958వ సంవత్సరం మే 1వ తేదిన హనుమంతరావు, నాగరత్నం దంపతులకు జన్మించారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని గన్నవరం గ్రామం ఆయన జన్మస్తలం. యద్దనపూడి మండలం పూనూరులో పాఠశాల, చిలకలూరిపేటలోని చుండి రంగనాయకులు కళాశాలలో ఉన్నత విద్యనూ అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ప్రైవేటుగా ఎం.కాం డిగ్రీ పొందారు.

సోమేపల్లి వృత్తి సోపానం దర్శిద్దాం – ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభి౦చి , 1989 గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులై ఎం.ఆర్.ఓగా నియమితులై . పశ్చిమ గోదావరిజిల్లాలోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకులలో విధులను నిర్వర్తించి . 2003లో పులిచింతల పధకానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి ,. 2006 గుంటూరు, నర్సాపురం ఆర్.డీ.ఒగా తర్వాత గుడివాడ ఆర్.డీ.ఓ గా[3], గుంటూరు జిల్లాకు జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి (సి.ఇ.ఓ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

పొందిన పురస్కారాలు -సోమేపల్లి వారి ప్రజా సేవ సాహితీ సేవలకు మంచి ప్రోత్సాహం లభించి పురస్కారాలు అందుకొన్నారు .. వీరి అత్యుత్తమ ప్రజాసేవకు గుర్తింపు ఇచ్చింది రెడ్ క్రాస్ పురస్కారం, ఈ పురస్కారాన్ని నాలుగు సార్లు గవర్నర్ చేతులు మీదుగా అందుకున్నారు. ఎంఆర్వో, ఆర్డీవోలుగా అనేక సార్లు ఉత్తమ అధికారిగా ఎన్నిక అయ్యారు.సోమేపల్లి మాతృభాషాభిమాని. పరిపాలన భాషగా తెలుగును అమలు పరచటంలో వీరి విధానాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరం నవంబరు 1న తెలుగు భాషా విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది. సోమిరెడ్డి జమున స్మారక పురస్కారం-2008,నెల్లూరుసోమేపల్లి మాతృభాషాభిమాని. పరిపాలన భాషగా తెలుగును అమలు పరచటంలో వీరి విధానాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరం నవంబరు 1న తెలుగు భాషా విశిష్ట పురస్కారం ప్రదానం చేసింది ఆంధ్ర సారస్వతి సమితి, మచిలీపట్టణం గిడుగు పురస్కారం- 2016 (తెలుగు భాషా వికాస),గుడివాడ సహజ సాహితి, చీరాల వారి సాహిత్య పురస్కారం -2017. గుఱ్ఱం జాషువా కళాపీఠం, దుగ్గిరాల వారి సాహిత్య పురస్కారం – 2018. మట్టి పొరల్లోంచి…” పుస్తకానికి రావి రంగారావు కళాపీఠంచే జనరంజక కవి ప్రతిభా పురస్కారం- 2020 అందుకొన్నారు .

· సరస భారతికి ఆత్మీయులై సుమారు పదికార్యక్రమాలలో పాల్గొన్న సాహితీ ప్రియులు వారు . ఆం .ప్ర .ర. సంఘం సంస్థ ఏర్పరచిన ‘’జ్ఞానజ్యోతి పురస్కారం’’ మొదటి సారిగా నాకు అందించటం లో వారి సంస్కారం నా సాహిత్య జ్ఞానం కన్నామిన్న అయినది. గత రెండేళ్లుగా ఆరోగ్యం సహకరిచటం లేక ప్రయాణాలు చేయటం లేదు.అయినా నేను వారికి ఫోన్ చేసి ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికీ ఆహ్వానిస్తూనే ఉన్నాను .నవ్వుతూ ;;సారీ ప్రసాద్ గారు !ప్రయాణం చేయటం లేదు. రాలేను అన్యధా భావించకండి ‘’అనేవారు నేనుకూడా ‘’మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో సార్లు వచ్చారు .మీ ఇబ్బంది అర్ధమౌతోంది ఫరావాలేదు. మీ ఆరోగ్యం ముఖ్యం అనే వాడిని .చివరిసారిగా నవంబర్ 20న సరసభారతి 178వ కార్యక్రమంగా జరిపిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’పుస్తక ఆవిష్కరణకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించాను .నవ్వుతూ రాలేనని చెప్పారు. అదే ఆఖరి సారిగా మాట్లాడటం అవుతుందని అనుకోలేదు .

· ఇంతటి పెద్దమనిషి సాహిత్యోపజీవి ప్రజాపాలనా దక్షులు శ్రీ సోమేపల్లి వేంకట సుబ్బయ్య గారు ఈ నెల 14వ తేదీ గురువారం 62 ఏళ్లకే మరణించారు .వారి నేత్రాలను దానం చేసి పార్ధివ దేహాన్ని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కు అప్పగించి మార్గదర్శిఅయ్యారు .వారి ఆత్మకు శాంతికలగాలని ,వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

· గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-23-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.