ముకురం -2
2-ఇదే౦ రోత ?
‘’మొగ బుక్కు’’ ,ముఖ పుస్తకం అనే ఫేస్ బుక్ ఇవాళ ఎంతో ప్రాచుర్యం పొందింది .మన అభిప్రాయాలు రాసుకోవటానికి ఇతరులకు తెలియ జేయటానికి మనకు తెలియనివి నేర్చుకోవటానికి గొప్ప సాధనమయింది .అరుదైన’’ పొట్టి గ్రాఫు’’లు అదేఫోటోలు చూడటానికి చూపించటానికి ,చారిత్రిక సామాజిక పౌరాణిక విశేషాలెన్నో కలబోసుకోవటానికి ,పద్యకవిత్వానికి వచన మినీ హైకూ లకు ,కార్టూన్ లకు ,సినీ నాటక రంగ విశేషాలకు అవధానాలకు బాలసాహిత్యానికి వాహికగా నిలిచింది . ఒక రకంగా విశ్వాన్ని మన ముందు నిలబెట్టు తోంది .చిన్నపిల్లలకు హైస్కూల్ కాలేజి విద్యార్ధినీ విద్యార్ధులకు వేదిక గా నిలిచింది .ఇదంతా చాలా పాజిటివ్ గా ,విలువలు ఆధారితంగా వెలుగు నిచ్చే పార్శ్వం లాకనిపిస్తోంది .
దీనికి మరో చీకటి కోణం, పార్శ్వం కూడా అప్పుడప్పుడు కనిపించి ఒళ్ళు జలదరింపు కల్గిస్తోంది .ఫేస్ బుక్ ఓపెన్ చేయటం ఆలస్యం ముడ్డిమీద గుడ్డ లేని అమ్మాయి ఫోటో ,బాన చళ్ళ మీద నూలు పోగు కూడా లేని స్త్రీల ఫోటోలు ,ఆడ మగ అంగాంగ ప్రదర్శన ,వికృత వీర విహార రతి చేష్టలు,అంగాలు చీక్కోటం నాక్కోటం వంటి ఫోటోలతో జుగుప్స హేయం వెకిలి అసహ్యం కలిగిస్తున్నాయి .ఎవరు పెడతారో ఎందుకుపోస్ట్ చేస్తారో తెలీదు . వాళ్ళ పైశాచికానందాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు .ఫేస్ బుక్ లో ఫ్రెండ్షిప్ కోరి ,దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పెడతారేమో ?ఇది రాక్షస చర్య .ఇలాంటి పోస్ట్ లపై నియంత్రణ ఉండదా ?నిరోధించే అధికారం ఉన్న అధికారులు లేరా ?చిన్నపిల్లలు ,విద్యార్ధినులు చూస్తూ ఉండే ఫేస్ బుక్ లో ఈ చొరబాటేమిటి దౌర్జన్యంగా ?మగవాళ్ళం మనకే రోత పుడుతుంటే ఆడవాళ్ళు చూసి ఎలా తట్టు కోగలుగు తారో అర్ధం కావటం లేదు .దీనిపై ఎవరూ పెదవి విప్పినట్లు కనిపించదు .మౌనంగా భరిస్తున్నారా ?మనం చూడలేక కట్ చేసినా ,మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తూనే ఉన్నారు .ఇది సభ్య సమాజం లో తలవంపు కాదా ?సినిమాలలో చూపించటం లేదా అంటారేమో ?దానికీ దీనికీ చాలా తేడా ఉంది .ఇది ట్రేస్ పాస్సింగ్ . చొరబడటం .నేరం కాదా ?దీన్ని తిరస్కరిద్దాం .జుగుప్స నీచం హేయం వెకిలి రోత లకి ఫుల్ స్టాప్ పెట్టిద్దాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-24-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,560 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

