సరస భారతి 179 వ కార్యక్రమంగా శ్రీ త్యాగరాజస్వామి వారి 176 వ ఆరాధనోత్సవం
సరసభారతి 179 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 176 వ ఆరాధనోత్సవం పుష్య బహుళ పంచమి 30-1-2024 మంగళ వారం సాయంత్రం 6–30 గం .లకు శ్రీ త్యాగరాజస్వామి వారికి అష్టోత్తర పూజ ,నైవేద్యం హారతి, శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలొ జరుగుతుంది . సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి ,సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి గార్ల ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలగానం జరుగుతుంది.ఇది సరసభారతి నిర్వహిస్తున్న 15 వ త్యాగరాజ ఆరాధనోత్సవం .
15మంది పెద్దతరం ,చిన్నతరం కు చెందిన,ఔత్సాహిక సంగీత గాయనీ గాయకులచే సంగీత విభావరి నిర్వహింపబడుతుంది .సంగీత సాహిత్యాభిమాను లందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన . .-గబ్బిట దుర్గాప్రసాద్ – సరసభారతి అధ్యక్షులు –ఉయ్యూరు -23-1-24-ఉయ్యూరు .

