అందరికి ధన్యవాదాలు

అందరికి ధన్యవాదాలు

 ,,మా శ్రీ సువర్చలా౦జనేయ  స్వామి దేవాలయం పునః ప్రతిష్ట జరిగి ,36సంవత్సరాలు పూర్తి , మా దంపతుల  వివాహ షష్టి పూర్తి అయిన సందర్భంగా మా ఆహ్వానాన్ని అందుకొని 21-2-24 బుధ వారం నాడు ఉదయం స్వామి వారి ఆలయ ప్రాంగణం లో జరిగిన జపాలకు, హోమాలకు హాజరైన భక్తులకు ,నిర్వహించిన జ్యోతిష  శాస్త్రవేత్త శ్రీ వంగవేటి ఆ౦జనేయ శాస్త్రి సోదర బృందానికి  , మా కోరికపై దంపతి పూజకు అంగీకరించి వచ్చిన ప్రియశిష్యుడు ,మాకుటుంబ ఆత్మ బంధు చి. చిలుకూరి నరసింహం శ్రీమతి అమ్మాజీ దంపతులకు,కుమారుడు లకు    , హైదరాబాద్ నుంచి వచ్చిన మా బావమరది,అలనాటి మా దంపతుల తైల చిత్రాన్ని గీసి అందించిన  ప్రముఖ చిత్రకారుడు , స్టేట్ బ్యాంక్ రిటైర్ద్ ఆఫీసర్   చి .ఆనంద్, రుక్మిణి దంపతులు, బందరు నుంచి విచ్చేసి ఆనందంగా పాల్గొన్న విద్యావేత్త శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి దంపతులకు ,మా అమ్మాయి చిననాటి స్నేహితురాలు శ్రీమతి సాయిలీల దంపతులకు ,పాలిటెక్నిక్ కాలేజి సహ విద్యార్ధిని అమర్తలూరు నుంచి వచ్చిన శ్రీమతి సుహాసిని  దంపతులకు ,మా బుల్లిమామ్మ మనవడి భార్య బెజవాడనుంచి వచ్చిన శ్రీమతి లీలకు ,పూజారి శ్రీ  వేదాంతం  మురళి కి ,స్థానిక అభిమానుకు ధన్యవాదాలు .

  సాయంత్రం కాపుల వీధి రామాలయం వద్ద ఉన్న కళ్యాణ మండపం లో ‘’అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ‘’నాడు మా కుటుంబం నిర్వహించిన  మా వివాహ షష్టి పూర్తి వేడుకలో ఉత్సాహం గా పాల్గొని అభినందనలు ,శుభా కాంక్షలు అందజేసిన ప్రముఖ సాహితీ  వేత్త,ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ  ఉప సభాపతి , ఆత్మీయులు మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ , కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు సహృదయులు మచిలీ బందరు నుంచి విచ్చేసిన  శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,శతాధిక గ్రంథ రచయిత కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి  విజయ వాడ నుంచి విచ్చేసిన  డా .జివి .పూర్ణ చంద్ ,మా శిష్యుడు ,సరసభారతి ఆత్మీయుడు ,శాసనమండలి మాజీ సభ్యుడు శ్రీ  వై విబి రాజేంద్ర ప్రసాద్ ,ఉయ్యూరు మునిసిపాలిటి అధ్యక్షుడు, మా శిష్యుడు శ్రీ  .చిన్ని, మచికీ పట్నం నుంచి వచ్చిన ప్రముఖ సంగీతః విద్వాంసురాలు శ్రీమతి కాళీ పట్నం ఉమ దంపతులు ,విజయవాడ వాసి ,ప్రస్తుతం అమెరికాలోని ‘’మౌంట్ సోమా ‘’దేవాలయ ప్రధాన అర్చకులు ,మా అల్లుడు శ్రీ అవధాని గారికి వేద గురువులయిన శ్రీ గారపాటి ప్రసాద్  దంపతులు ,శిష్యులు , యలమర్రు వాసి ,ప్రస్తుతం పూరీ లోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం  తర్క వ్యాకరణ మీమాంసా శాస్త్ర ప్రొఫెసర్  శ్రీ గబ్బిట జయమాణిక్య శాస్త్రి దంపతులు,మా అంతరింగికులు ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి ,పెదముత్తేవి ఓరియెంటల్ హై స్కూల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కోసూరు నుంచి విచ్చేసిన  శ్రీ కోసూరు ఆదినారాయణ రావు దంపతులు ,  కృష్ణాజిల్లా రిటైర్ద్ గెజిటెడ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విజయవాడ నుండి వచ్చిన మిత్రులు మార్గదర్శి ,ఆదర్శ మూర్తి  శ్రీ వై.వి. రాజు దంపతులు ,బెజవాడ నుంచి వచ్చిన ప్రముఖ సాహితీ వేత్త శ్రీ పొన్నాడ సత్య ప్రకాశరావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,సరసభారతి ఆస్థానకవులు విజయవాడ నుంచి విచ్చేసిన  శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు , ప్రముఖ హాస్యకవి శేఖరులు శ్రీ దండి భోట్ల దత్తాత్రేయ శర్మ , మా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు ,సాహితీ వేత్త   రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు  శ్రీమతి వి .కస్తూరి ,  శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ,శ్రీమతి సింహాద్రి వాణి.  ,ఆత్మీయులు రిటైర్ద్ తాసిల్దార్ శ్రీ తుమ్మల చలమయ్య గారు ,సరసభారతి కి ఆత్మీయురాలు  సాంఘిక సేవాకర్త  బందరునుంచి వచ్చిన శ్రీమతి కరెడ్ల సుశీల ,ప్రియాతిప్రియ శిష్యుడు  మోపిదేవి హైస్కూల్ శిష్యుడు ,మా దంపతుల వివాహాన్ని1964 ఫిబ్రవరి 21న వేల్పు చర్ల లో  దగ్గరుండి జరిపించిన  కుటుంబ మిత్రుడు కప్తాను పాలెం నుంచి వచ్చిన రియిర్డ్ హెడ్ మాస్టర్  చి. అడవి శ్రీరామ మూర్తి ,చి కృత్తివెంటి లీలా కృష్ణమూర్తి , అవని గడ్డ నుంచి వచ్చిన ప్రముఖ సాహితీ వేత్త శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ , కూడేరు నుంచి వచ్చిన మాకుటుంబ మిత్రులు ,రిటైర్ హెడ్ మాస్టర్  శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు కు,మారుడు చి సుబ్రహ్మణ్య౦  దంపతులు ,గూడూరు నుంచి వచ్చిన సాహితీ ప్రియుడు శ్రీ కాట్రగడ్డ వెంకటరావు , మద్రాస్ నుంచి వచ్చిన మా మేనల్లుడు శ్రీనివాస్ ,ఉయ్యూరు ప్రముఖ వైద్యులు మా ఇంటి డాక్టర్లు  ఆసాంతం పరవశించి చూసి మురిసిపోయిన  శ్రీ డా.కడియాల విశ్వేశ్వరరావు ,కుమార్తె ప్రసిద్ధ కంటి డాక్టర్  డా.జయశ్రీ గార్లు ,జాగృతి సంస్థ డైరెక్టర్ , శ్రీమతి రాజీవి ,సభ్యులకు ,శిష్యులు  తినాధ శర్మ ,దంపతులు సదాశివరావు దంపతులు ,హనుమంతరావు  బాపిరాజు దంపతులు ,మా కుటుంబ మిత్రులు శ్రీ చంద్ర శేఖరరావు దంపతులు ,శ్రీ బలరం గారు ,చి దావూద్ దంపతులు ,తల్లిగారు ,సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి శ్యామలాదేవి దంపతులు ,ఆకునూరు కవి శ్రీమైనేపల్లి సుబ్రహ్మణ్యం గారు ,  శ్రీనవులూరి రమేష్ ,సంగీత విద్వాన్ శ్రీమతి జి.మాధవి దంపతులు   మరెందరో పాల్గొన్న  అశేష సాహితీ అభిమానులు , విలేకరుల బృంద౦ ,మాకు సన్మానం చేసి కానుకలర్పించి ,శుభా కాంక్షలు అందించిన వారందరికి  ,పేరుపేరునా  మా దంపతులు ధన్యవాదాలతో కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం .

  ఈ వేడుకల తన అద్భుత సృజనతో క్రియా శీలకంగా కన్నుల పండుగ గా మా  కుమారులు చి శర్మ ,రమణ ,కోడళ్ళు శ్రీమతులు సమత ,ఇందిర,రాణి ,మహేశ్వరి ,ఈ ప్రత్యేక కార్యక్రమానికి అమెరికా నుంచి వచ్చి ఆన౦దంగా పాల్గొని ,మాకు టు౦బానికి గొప్ప సహకారం అందించిన మా అమ్మాయి శ్రీమతి కోమలి విజయ లక్ష్మి ,  మ అన్నగారి అబ్బయి చి రామనాధబాబు కుమారుడు కళ్యాణ్, చి గోసుకొండ వాసు ,మనుమళ్ళు చి .చరణ్ ,చి.హర్ష  మనుమరాళ్ళు కుమారి హర్షితా౦జని కుమారి రమ్య ల చే తులాభారంతో సహా ఒక’’ ట్రెండ్ సెట్టింగ్’’ గా నిర్వహి౦ప జేసిన సరసభారతి అత్యంత ఆప్తుడు  జర్నలిస్ట్  శ్రీ ప్రకాష్ కు ప్రత్యేక అభినందనలు .  ఫోన్ ద్వారా  మెసేజ్ ల ద్వారా అభినందనలు తెలియజేసిన సాహితీ బంధువులకు ధన్యవాదాలు .

 ఇంటి వద్ద ,కళ్యాణ మండపం వద్ద మా ఆతిధ్యాన్ని,కానుకలను  స్వీకరించి ,మమ్మల్ని ఆన౦దింప జేసిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలతో ,కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ ప్రభావతి దంపతులు .-22-2-24-ఉయ్యూరు . 

https://photos.google.com/share/AF1QipNiE2q39wRG0Wvi-HUgDfqy64kiGVY4Sv4P5NeHdhh_9MBLcMebjxLldS-4mjQVEg?key=QVVSbVZ3c21GRnZLNV85ZHNXTGlhQUdmUkh6QXJn

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.