శృంగార నైషధం లొ శ్రీనాథ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -8
‘’కంతుండు నీ విధుండు నొక్క౦త వారు-సఖ్యమీ యిద్దరకు నొప్పు సద్రుశులగుట –ముదిత !యోక్కండు హరుని నెన్నుదుటి కంట –నొకడు కంసారి కుడికంటనోహటిలిరి ‘’
ఈ చంద్రుడు ,మన్మధుడు దుష్ప్రవర్తనలో సమానులు కనుక జిగినీ దోస్తులయ్యారు .శంకరుని కాంతిచే మరుడు ,విష్ణువు కుడికన్ను అయినసూర్యునిచే చంద్రుడు లయించారు .
‘’బాలిక ! ఈ సుదాకరుడు పంకజ నాభుని వామభాగదృ-గ్గోళకమైన వాడు ,నవకోమల బాల తమాల కందలీ –కాలిమ గేలి సేయు నాడు క౦ దిది,తన్ననయాన్తరంమునన్ –నీల కనీనికా మఘవ నీల మణిత్వము నొందకు౦డునే ‘’
ఈ చంద్రుడు పంకజనాభుడైన విష్ణువు యొక్క ఎడమకన్ను గుడ్డు .కొత్తగాపుట్టిన మృదువైన లేత తమాలపల్లవాల నల్లదనాన్ని పరిహాసం చేయగలిగిన చంద్రునిలోని మచ్చ ,ఆ విష్ణువు నేత్ర మధ్యమం లో ఉన్ననల్లని ఇంద్రనీలం వంటి నల్లగుడ్డు పోలికను పొందదా.
‘’కమల విపిన దాహ కంఠోక్తి పటు తీవ్ర –శక్తి యగు హిమాగ్ని సంగమమున – గందబోలుశిశిర కరు డెంద మీ భంగి –నాతి యొండు కారణంబు లేదు ‘’
పద్మాలను దహించే మంచు లో అగ్ని ఉంది .అందువలన చంద్రుని హృదయం నల్లగా మాడటానికి కారణమేమో .
‘’హరిత చ్ఛాయా చ్లలమున -భర ఖేదము వాయు నమృత పానీయ సరో-వర మగు నీ శశియ౦దు౦ –దరుణీయోలలాడుచున్న ధరణిం గంటె’’
నల్లని కాంతులు అనే భ్రమ చే ,భూతకోటి బరువు అనే ఆయాసం పోయేట్లుగా ,అమృతం అనే నీటితో నిండిన గొప్ప సరస్సు అయిన ఈ చంద్రునిలో ఒలకా లాడుతున్న భూమిని చూశావా ?భారంచేత ఖిన్నులైనవారు తటాకాదులలో స్నానం చేసి ఉపశమనం పొందుతారు .చంద్రునిలోని మచ్చ భూమి చాయగా వర్ణించాడు కవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-24-ఉయ్యూరు

