శృంగార నైషధం లో శ్రీనాధ కవి సార్వ భౌముని చంద్రోదయ వర్ణనం -11
‘’ దేవి యితడు హర్యక్షీ -భావము భజియించి యుండ బ్రకృతి విరోధంబే –వెంట గలిగే నొక్కో –కావలమున కకట సింహికా సూనునకున్ ‘’
ఈ చంద్రుడ్డు విష్ణువు నేత్ర ధర్మాన్ని అంతే సింహ భావాన్ని పొంది ఉండగా ,అ సింహిక కొడుకైన తాహువు కు ప్రకృతి విరోధం ఏర్పడింది .అంటే చంద్రుడు హరికి కన్ను అయ్యాడు కనుక హర్యక్షి అయ్యాడు .ఇతడు మగ సింహం అయితే ,,సింహిక కొడుక్కి తండ్రి అవుతున్నాడు కనుక ఈ సింహిక కొడుకు తండ్రి అయిన సింహం మీద పితృ భక్తీ కనబరచాలి కానీ ఇలా సహజ వైరం పాటించటం ఏనాటి పాపమో కదా తండ్రికి కొడుక్కి విరోధం ఉంది .అంటే చంద్రుని రాహువు గ్రహణకాలం లో మింగుతాడు అని భావం .
‘’అలరుం బోడి !సహస్ర పత్ర ,తులనాహంకార లీలా విశ్రుం –ఖల సౌభాగ్య కళా కలాపమగు నీ కా౦త్యాస్య ముం బోలగా –వలదా యీ శశికిం గలంకికి మృగ వ్యాధోత్తమా౦గ స్థలీ-వలదాకాశధునీ తటావనీ వానీర కోయష్టికిన్ ‘’
వెయ్యి రేకుల పద్మాన్ని తిరస్కరించే అహంకార గర్వం యొక్క విలాసం తో నిరాటంక సౌందర్య కళయే భూషణ౦ గా ఉన్న నీ ముఖం కళంకం కల వాడు,మృగాన్ని వేటాడే వాడు –అంటే దక్షుడి’’ యజ్ఞం’’ భయంతో మృగరూపం పొంది పరి గెత్తి౦దని ,దాన్నిశివుడు వేటాడాడు అని పురాణ వచన౦ . అలాంటి ఈశ్వరుని శిరస్సుపై ప్రవహించే గంగానది తీర ప్రదేశం లో ఉన్న చిన్న అడవిలో ,నీటి ప్రబ్బలి చెట్ల మధ్య ఉన్న గుడ్డి కొంగ అయినవాడైన ఈ చంద్రుడు నీ ముఖ సౌందర్యానికి తగునా దమయంతీ ‘’
‘’నానా దావళ్య సంతానములకు నిదాన౦బు నా నొప్పు నీ-రాకా నక్షత్రేశు,మేనం గలదే యొక కలంకంబు నం గాక తాళీ-య౦ బై త్రోవ రాగా హరి హయనగరీ హస్తి రాడ్గండపిండ-స్థానా పాదాన ద్రవ వన వలము ల్దాకెగాభ్ర వీదిన్ ‘’
తెల్లని కా౦తులకు ఈ చంద్రుడు నివాసభూమి .అలాంటి వాడికి మచ్చ ఏమిటి ?నిజానికి అది చంద్రుడికి లేదు.ఆకాశమార్గంలో అమరావతికి వస్తుంటే ఐరావతం మదజలాలు చంద్రునిపై పడి మచ్చగా కనిపిస్తోంది అంతే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-3-24 –ఉయ్యూరు .

