మూడు పది వసంతాల ‘’అగరు ‘’(ర )పరిమళ కవితా’’ వసంత్’’(౦)’’కథ మరిచిన మనిషి’’

మూడు పది వసంతాల ‘’అగరు ‘’(ర )పరిమళ కవితా’’ వసంత్’’(౦)’’కథ మరిచిన మనిషి’’
హోసూరు తెలుగు వెలుగు, ఉద్యమాల వెన్నుదన్ను ,డా అగరం వసంత్ తాను ముప్పై ఏళ్లుగా సాగించిన కవిత్వ వ్యవసాయాన్ని ‘’కధ మరిచిపోయిన మనిషి ‘’గా ఈ మార్చి లో వెలువరిచి నాకు పంపగా 16న అంది నిన్ననే చదవటం కుదిరి స్పందిస్తున్నాను .
51 కవితల గుచ్ఛ౦ ఇది.వృత్తి డాక్టరీ అయినా వసంత్ మట్టి మనిషి .నేలతల్లి బిడ్డ .పల్లెటూరి సొగసులు అందాలు ఆప్యాయ ఆత్మీయతలు పూరా అనుభవించి అందరికి పంచె వాడు .అతని చేతిలో పడిన ప్రతిదీ బంగారమే అవుతుంది .అది అతని ‘’చేతి మహిమ’’ .క్రమం తప్పక ప్రతి ఏడూ ఉగాది కవితలు ప్రచురిస్తూనే ఉన్నాడు .అందర్నీ కలుపుకు పోతూనే ఉన్నాడు .ప్రజలమనిషి అతడు ‘’.బస్తీ’’ ప్రజకు తలలో నాలుక .కృష్ణగిరి కి కాపు .అతని విశాలభావ దర్పణమే ఈ కవితా సంపుటి .అందులోని నెరుసుల్ని వెతికి మీ ముందు ఉంచుతున్నాను .ఇందులో చాలాకవితలు వివిధ పత్రికలలో ప్రచురితమై,వేదికలపై చదువబడి ప్రసిద్దమై పేరు పొందినవే .
కవిత రాద్దామని కలం పట్టుకొంటే కలం మొరాయించి ,ఏదేదో రాయాలనుకొని ‘’అర్ధవంతంగా కాకున్నా అర్ధాంతరంగా ముగిస్తూ ‘’స్వదేశీ పాఠకులు ఈ భూమ్మీద ఉంటే –మన్నించమని ‘’కోరాడు .చేయని తప్పుకు ,ప్రత్యర్ధి పన్నాగానికి తప్పు చేయకున్నా కరెన్సీ ఖాకీ న్యాయం వెన్నుపోటు పొడిస్తే యావజ్జీవ శిక్ష ఖరారైంది .చట్టం కాగితాల్లో నిప్పును దాచద్దని ,తప్పులు కాచేవారంతా నేరస్తులే అని –ఇప్పుడు శిక్ష విధించేది జరిగిన న్యాయమే అనీ –నల్లకోటు ,న్యాయదేవతా ,త్రాసూ సాక్షులు మాత్రమె ‘’అన్నాడు .’’శ్రమకు కొలమానం శ్రమ జీవి –అతడు గడియారంలో సెకను ముల్లు’’.’’ చెమటోడ్చి సంపాదిస్తే నోట్లు –చెమటల్ని పూడ్చి పెట్టి సంపాదిస్తే ‘’కోట్లు ‘’అనిద్వంద్వార్ధంగా వాయించాడు .’’ఎన్నికల్లో కురిసిన నోట్ల వర్షానికి ప్రజాస్వామ్యం కొట్టుకు పోయిందని ,కోటి చీమల్ని నలిపిన పాదం –తన చెవిలో దూరి న’’చిన్న చీమ ‘’ఉక్కిరి బిక్కిరి చేస్తుదన్నాడు .’’ఆమె ‘’-రామ చంద్రుని నిప్పుల కణిక –హరిశ్చంద్రుని అంగడి సరుకు ,ధర్మరాజు జూదపు వస్తువు ‘’అయితే తనకు మాత్రం ‘’బంగారుకొండ ‘’అని జేజేలు పలికారు ఆరాధనాభావంగా .’’సు౦క౦తి’’పూలజాడ లేని ,గురకపూతలేని ,గోబిపూలు లేని సంక్రాంతి కృత్రిమ సంక్రాంతి అనిపించింది .అమ్మ అయ్యలు హారతి కర్పూరమైతే –కొడుకు పళ్ళెం లో పైసలకే కన్నేశాడు .డాక్టరు యాక్టరు ఒకరైతే –పేషెంట్ అవుతాడు పేటెంట్ ‘’అన్నాడు కోటబుల్ కోట్ అనిపించింది .
‘’అయిదు వేళ్ళతో ముద్దమింగితేనే ఆకలి మంటలు చల్లార్తాయి ‘’.రాష్ట్రం ఏదైనా, దేశం ఏదైనా రగడ ,సందేశం ఒక్కటే –స్వంత ఎజెండా స్వార్ధ ప్రయోజనం .హోసూరు ‘’పరస ‘’అందాలు –తెలుగు జనం తీర్ధాలు ‘’అని పొంగిపోయి పరవశంతో అన్నాడు .ప్రపంచమానవ స్వతంత్ర సమాజం ముందుకు రానీ ‘’మన్నాడు .తాము అంతా ఒక్కటే అన్న భావన యే దేవుడికీ,యే మనిషికీ లేదని –వీరంతా అభౌతిక జీవులు ‘’అని ఎద్దేవా చేశాడు .’’జీవిజీవిలో దేవుడున్నాడు ‘’అని ఎరుక చెప్పాడు .’’మతాల తలకాయ ఒక్కటే –తోకలే వేరు ‘’అనే కొత్త అర్ధం చెప్పాడు .’’నిర్జీవం నుంచి జీవం లేచి నిలబడింది –జీవనాటకం ముగిశాక –అంతా నిర్జీవం ,అనంత శూన్యం ‘’అని తాత్విక సత్యం చాటాడు .మానవాళి అభ్యుదయానికి కూడు,గుడ్డా అందించిన మహామహులు చరిత్రలో చిర౦జీవులు కాలేదే –వాడి చరిత్ర శిలలెక్కి కూర్చుంటే –నా చరిత్ర ఏమైంది ?అని ప్రశ్నించాడు .అనంతకాలపు ‘’అమ్మ ‘’తనానికి తలవంచి నమస్సులదించాడు .కదులుతూ మెదులుతూ –విశ్వం స్వయంభు ‘’అన్నాడు .చరిత్ర ,గతం మరిచిన మనిషి ని ‘’కథ మరిచిన మనిషి ‘’అని, దీనినే సంపుటికి శీర్షికను చేశాడు కవి వసంత్ ‘’.
పనిలో తేలుతూ –పనిలో పరవశించే వాడే రైతు ‘’అని కీర్తికిరీటం పెట్టాడు .తన చిన్ననాటి ఆటలు –‘’అమ్మకౌగిటి-అ ఆ ఆట ,నాన్న నేర్పిన ‘’అప్పుదడ ఆట ‘’,తాత నేర్పిన ‘’అవ్వలక బువ్వలక ‘’ఆట మొదలైన సకలమైన ఆటలూ జ్ఞాపకం చేసుకొని పరవశం చెందాడు .వాటిలో ఉన్న నీతి హాయి సౌభాగ్యాలకు పొంగిపోయాడు వసంత్ .పుట్టలని కట్టి పాముల్ని సాకటం కాదు –చీమల్ని చెట్టు ఎక్కించాలి ‘’అని హితవు చెప్పాడు .జీవితానికి అర్ధం –జీవించటమే ‘’అని సింపుల్ గా నిర్వచించాడు .నేను నేనే –త్రిశంకుని తమ్ముళ్ళారా –తన్నుకు చావండి –‘’అన్నాడు .కవి బుల్లి బైకుపై తెల్లపావురం చేసిన పని బాగుంది .జానపధం –జానపదం ‘’అన్నాడు కమ్మగా .అన్నీ కలిసి తనభారతం వర్ధిల్లాలని ఉవ్విళ్ళూ రాడుకవి .ఆధిక్యానికి అగ్రత్వానికి –అగ్గిపెట్టా ‘’అని చీదరించాడు .విశ్వ వీధిలో గిరగిర తిరిగే గ్రహాలధ్వని ఓంకారం ప్రణవనాదం అన్నాడు ‘’.’’ఇద్దరూ ఒకరే –ఇద్దరికీఒకరే –ఇది ధర్మం –పెండ్లి ప్రకృతి ధర్మం ‘’అన్నాడు . ‘’ప్రకృతి ప్రతిరూపం –ప్రతిఇంతా వెలిగే దీపం ‘’.అవనిభాషలలో వెన్న ఆంధ్రమే ‘’అన్న ‘’ఇదీ హోసూరు కవి తెలుగుభాషపై ఉన్న మక్కువ ,దాన్ని బ్రతికి౦చు కొనే తపన ,దాని పై ఆరాధనా .’’నీ మంచి మనసును –మించిన దైవం –మహిలో లేదు’’.దేశామేకాదు , దేహమూ అడవి అమ్మ యే ‘’అన్నాడు ప్రకృతి ని ఆరాధించకపోతే ప్రగతి లేదంటూ .
అగరు వాసనా ,మట్టి కమ్మదనం ఉన్న జీవద్వంతమైన కవితలుఇవన్నీ .వసంత చైతన్య స్పురణ కు అద్దం పట్టేవే .మరిన్ని కవితలల్తో శత వసంత సార్ధక కవితా ,సాహితీ జీవితం సాగించాలని డా .వసంత్ ను కోరుతున్నాను .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-24-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.