అక్షరం లోక రక్షకం
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి 182 వ కార్యక్రమం గా ఉగాది(ఏప్రిల్ 9) కి రెండు రోజులు ముందు 7-4-20 24 ఆదివారం సాయంత్రం 4 గం .లకు ఉయ్యూరు సెంటర్ కు దగ్గరలో ,పశువుల ఆస్పత్రి ప్రక్కన ఉన్న శాఖా గ్రంథాలయం (A.C.లైబ్రరి) లో నిర్వహింపబడుతుంది .ప్రముఖులకు శ్రీ క్రోధి నామసంవత్సర ఉగాది పురస్కారాలు అందజేయబడతాయి .ప్రసిద్ధ కవులచే ‘’ కొత్త ఆశల ఆశయాల ఉగాది ‘’ ‘’ శీర్షిక న కవి సమ్మేళనం జరుగుతుంది . కవిమిత్రులకు ,సంగీత , సాహిత్యాభిమానులకూ ఉగాది శుభా కాంక్షలతో ఇదే ఆహ్వానం . పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన.
ముఖ్య అతిధి –శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి మాజీ సభ్యులు
ఆత్మీయ అతిధులు
1-శ్రీ చలపాక ప్రకాష్ – ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్య భారతి త్రైమాసిక పత్రిక సంపాదకులు
2–డా.మైలవరపు లలితకుమారి –రిటైర్ద్ లెక్చరర్ ,సాహితీ వేత్త, విమర్శకురాలు ,గ్రంథ కర్త –గుంటూరు
3-డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య –బహుముఖీన పండితులు, కవి ,విమర్శకులు –నెల్లూరు
కార్యక్రమం
సాయంత్రం -3-30 గం. కు అల్పాహారం
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యులశ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్యదర్శి .
సాయంత్రం – 4గం నుంచి -5-30 వరకు -‘’క్రొత్త ఆశలు ఆశయాల ఉగాది ‘’అనే అంశం పై కవి సమ్మేళనం
5-30 గం -6 గం .వరకు –పురస్కార గ్రహీతలైన హరికథా భాగవతారిణుల చే –కథా గానం
సాయంత్రం -6గంనుంచి -7 గం .వరకు –ఉగాది పురస్కార ప్రదానం
. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాలు అందుకొనే ప్రముఖులు
విద్వాన్ స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మ గార్ల స్మారక ఉగాది పురస్కార ప్రదానం
1- శ్రీమతి పురాణ పండ వైజయంతి –-హైదరాబాద్ -ఉషశ్రీ గారి కుమార్తె ,వైజయంతి చానల్ ద్వారా ఎందరెందరో ప్రముఖ సాహితీ వేత్తలను, ,వారి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ ,అరుదైన సాహితీ సంపదను అందిస్తున్న సాహితీ వేత్త ,వాజ్మయ వైజయంతి .
2- శ్రీమతి కవురు శారదా భాగవతారిణి-తాడేపల్లి గూడెం –ఆలిండియా రేడియో గ్రేడ్ వన్ ఆర్టిస్ట్ ,దూరదర్శన్ లోనూ , వివిధ పట్టణాలలో నూ హరికధలు చెప్పి సమ్మోహ పరచి,న సీతాకల్యాణం ,పార్వతీ పరిణయం కథా ఫేం ,’’కథాగాన మోహనవంశి’’బిరుదాంకితురాలు ,’’ సువర్ణ హస్త ఘంటా’’సన్మానితురాలు ..
3- శ్రీమతి –వేపూరు శ్రీవాణీ భాగవతారిణి-విజయవాడ -చిన్నతనాన హరికథా గానం లో ప్రవేశించి ,చెన్నై బళ్ళారి ,గోవా ల తో సహా అనేకపట్టణాలలో హరికథా గానం చేసి మెప్పించి ‘’గానకోకిల’’ ,’’మధురగాయని’’ ,’’హరికథారాణి’’బిరుదులు పొందిన భాగవతారిణి .
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి గార్ల ఉగాది పురస్కార ప్రదానం
డా.జడా సుబ్బా రావు –తెలుగు అధ్యాపకులు,ప్రసిద్ధ కథకులు –ఎ.పి.ఐ. ఐ. టి. –నూజివీడు –అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన కథలపోటీలో ‘’దాహం ‘కథకు ప్రథమ బహుమతి పొందినవారు ,ఈ నాడు వారపత్రిక ప్రతిష్టాత్మకంగా2019,2020లలో నిర్వహించిన’’ కథా విజయం ‘’పోటీలలో వీరి ఆకుపచ్చని కన్నీళ్లు ,తూర్పారబోత ,వెలి ,కథలు ముందు నిలిచాయి.అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో ఎన్నో సాహిత్య వ్యాసాలు రచించారు .గడియారం బతుకులు ,కవితా సంపుటి ,వ్యాస లోహిత ,విజయవిలాస౦ సమీక్షా గ్రంథాలు రచించిన వారు .
రాత్రి 7 గం .లకు –విందు .
కవి సమ్మేళనం లో పాల్గొనే కవి మిత్రుల పేర్లతో ,మార్పులు చేర్పులతో కార్యక్రమం ‘’మార్చి నెల చివర ‘’అందజేస్తాము .
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వేంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
సరసభారతి గౌరవాధ్యక్షులు సరసభారతి కార్యదర్శి సరసభారతి కోశాధికారి సరసభారతిఅధ్యక్షులు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
22-3-24-ఉయ్యూరు.

