ఈ నెల 17న.సరసభారతి 182వ కార్యక్రమ౦ గా శ్రీ క్రోధి ఉగాది వేడుకలు .
సాహితీ బంధువులకు -సరసభారతి 182వ కార్యక్రమం గా 7-4-24 ఆదివారం నిర్వహించాలనుకొన్నశ్రీక్రోధి ఉగాది వేడుకలు కార్యక్రమం అనివార్యకారణాల వలన వాయిదా వేసిన సంగతి మీకు తెలుసు .
ఆ కార్యక్రమాన్ని 17-4-24 బుధవారం శ్రీరామనవమి రోజు సాయంత్రం 5-30 గం .లనుంచి ఉయ్యూరు రావి చెట్టు బజారు చివరలో ఉన్న శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లోఒకే ఒక్కమార్పుతో అంటే శ్రీమతి పురాణపండ వైజయంతి గారిని వేరొక ప్రత్యెక సందర్భంలో ఆహ్వానించి సత్కరించాలని నిర్ణయించి, మిగిలినఇద్దరు శ్రీమతి శ్రీవాణీ ,శ్రీమతి శారదా ,భాగవతారిణు లకు ,డా జడా సుబ్బారావు గారికి ఉగాది పురస్కారాలు అందించి ,ఇదివరకే ఆహ్వానించిన కవులచేత కవిసమ్మేళనం డా .కొమాండూరి కృష్ణా గారిచే జరుపుతున్నాం. ముఖ్య అతిధిశ్రీ వైవిబి రాజేంద్రప్రసాద్ . ఆత్మీయ ఆతిధులు శ్రీ చలపాక ప్రకాష్ ,డా మైలవరపు లలితకుమారి ,డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య గార్లు . ఆహ్వానితులు, అతిధులు ,కవిమిత్రులు,సంగీత , సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయమని, ఉగాది శ్రీరామనవమి శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .
శ్రీమతి జోశ్యుల శ్యామలాదీవి ,,మాదిరాజు శివలక్ష్మి ,గబ్బిట వేంకట రమణ ,గబ్బిట దుర్గాప్రసాద్ -5-4-24-ఉయ్యూరు
జాగృతి పొదుపు సహకార సంస్థ ,మరియు అమరవాణి హైస్కూల్ సౌజన్యం తో .

