సాహితీ బంధువులకు శ్రీక్రోధి నామ సంవత్సర శుభా కాంక్షలు .
ఆకాశవాణి లో పలు పదవులు అలంకరించిన రచయిత సామాజిక విశ్లేషకులు ,గాంధీ పరిశోధకులు డా.నాగసూరి వేణుగోపాల్ ఈ మార్చిలో ప్రచురించిన ‘’గాంధీయే మార్గం ‘’అనే విలువైన పుస్తకం లో కొత్త విశ్లేషణలు ,పాత కెరటాలు అనే శీర్షికలతో 30మంది రచయితల అమూల్య రచనలున్నాయి .పాతకెరటాలలో సర్వశ్రీ నార్ల ,బాలాంత్రపు ,నాగయ్య ,బిఎన్ రెడ్ది, ఘంటసాల వంటి మహామహుల రచనలున్నాయి .వారి మాటలన్నీ మహాత్ముని ప్రభావాన్ని చాటినవే .కొత్త విశ్లేషణ లలో సర్వశ్రీ కె.రామ చంద్రమూర్తి ,నాగసూరి ,రోహిణి హత్త౦ గిడి,మండలి బుద్ధప్రసాద్ ,కొట్టు శేఖర్ ,జంధ్యాల జయకృష్ణ బాపూజీ ,శ్రీమతి జంధ్యాల కనకదుర్గ మున్నగు వారి రచనలున్నాయి .ఇందులో నా రచనలు రెండు -1-ఆధునిక వినోబా –డా.కొరళ్ళ రాజారావు ,అభినవ ప్రహ్లాద –కాశీ భట్ట జగన్నాథం చోటు చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను .దీనికి వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు .తరాలుమారినా మహాత్ముని సిద్ధాంతాలే అన్ని సంక్షోభసమయాలలో మార్గదర్శకాలుఅనే విషయాన్ని అత్యంత నిర్దుష్టంగా చెప్పిన వ్యాసాలు ఇవన్నీ . ఇంతటి విలువైన మంచి పుస్తకం ప్రచురించి నందుకు నాగసూరిని మనసారా అభినందిస్తున్నాను .
దీనితోపాటు నాగసూరి ఆకాశవాణి బాణీ అయిన –సిగ్నేచర్ ట్యూన్ ,వేణుగోపాల్ రాసిన పొట్టి శ్రీరాముల జీవిత జీవిత కథ-అమరజీవి పుస్తకాలు కూడా అందాయి .అన్నీ అన్నే.వీటిని అన్నిటినీ ‘’పురికొస ‘’తో బంధించి పంపటం గాంధీ మార్గానికి నిదర్శనమేమో ?
ఇప్పటికే శ్రీ పన్నాల భట్టు గారి ‘’ప్రసార తరంగిణి ‘’లైవ్ చేస్తున్నా ను .నాగసూరి అంగీకరిస్తే, సిగ్నేచర్ ట్యూన్ కూడా లైవ్ చేయాలని ఉంది .
ఉగాది శుభ కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-4-24-ఉయ్యూరు .

