యయాతి – 37
దేవయాని
బయటంతా వసంత ఋతువు. చక్కటి సువాసనతో మంద్రంగా గాలి వీస్తున్నా శయ్య మీద పడుకున్న నాకు చెమట పోస్తోంది. పూర్ణిమ చంద్రుడు వికసించిన తామర పువ్వులా ఉన్నాడు. కోయిల ఏవేవో తీయటి రాగాలతో కూస్తున్నది. విరిగిన కొమ్మ చేస్తున్న చప్పుడు మాత్రమే నేను వినగలుగుతున్నాను. వాడిపోయిన పారిజాత పుష్పంలా నా మనసు చెదిరి ఉంది.
మనసుని ఎంతకూ వదలకుండా పీడిస్తున్నది కలలో కూడా వస్తుందనేది నిజమేనా? బహుశ … బహుశ కాదు.
ఎంత భయంకరమైన కల! భయంతో లేచి కూర్చుంటే వొళ్ళంతా వణుకు పుట్టింది.
బహుశ కచుడి మీద నేను కోపంతో ఉన్నాను. సందేహం ఎందుకు? కోపంతోనే ఉన్నాను. నా ప్రేమను తిరస్కరించి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు శపించాను: “నువ్వు సంపాదించిన శక్తిని ఎప్పటికీ ఉపయోగించలేవు,” అని. కానీ నా కలలో వచ్చిన దానికి కారణం —
కచుడు వెళ్ళిన చాలా రోజుల వరకు నేను తీవ్రమైన వ్యధతో ఉండి, తరచుగా ఏడుస్తూ, భోజనం కూడా మానేసి గడిపాను. నాన్నగారికి అనేక పర్యాయాలు విన్నవించాను. “సంజీవని శక్తి ఇప్పుడు మరెవరికో కూడా లభిస్తే ఏమీ కాదు. మరోసారి మీరు తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆశీర్వాదం పొందండి. హృదయం లేని కపటాత్ముడు, కృతజ్ఞత లేనివాడు అయిన కచుడిని నాకు తీసుకురండి!”
జీవితాంతం గుర్తుండిపోయేలా కచుడిని శిక్షించాలని నా ఆశ. ఈరోజుకి కూడా నా సంకల్పం అదే! నా ప్రేమను నిర్లక్ష్యం చేసి నా హృదయాన్ని ముక్కలు చేసి దూరంగా వెళ్ళిపోయాడు. పైగా ఏ బ్రాహ్మణ కుమారుడు కూడా నా చెయ్యి పట్టుకొని వివాహం చేసుకోడని శాపం పెట్టాడు!
నాకొచ్చిన కలని ఎంత బాగా గుర్తుంచుకున్నాను:
దర్బారులో సంకెళ్ళతో బంధించిన కచుడు ఉన్నాడు. అతని కళ్ళు మెరుపుల్లా వెలుగుతున్నాయి. దానవుల రాజైన వృషపర్వుడు నాతో ఇలా అన్నాడు: “ప్రభువైన గురువు శుక్ర మహర్షి, మీ తండ్రిగారు, మనందరి అభివృద్ధి కోసం తపస్సులో మునిగి ఉన్నారు. తపస్సులోకి వెళ్ళేముందు సదా నిన్ను సంతోషంగా ఉంచమని నన్ను ఆజ్ఞాపించారు. కచుడు నిన్ను చాలా బాధ పెట్టినట్టు మాకు విశదం. అందుచేతనే మేము అతన్ని స్వర్గలోకం నుంచి తీసుకువచ్చాము. అతనిప్పుడు నీకు బందీ. అతనికి ఏ శిక్ష విధించాలో నీవే చెప్పు, మేము తక్షణమే అమలుపరుస్తాం.”
తనని ఎంతగా మోసం చేసినా ఆ ప్రేమికుడికి ప్రియురాలు ఏవిధమైన శిక్ష విధించగలదు? మహా అయితే జీవితమంతా తన బాహువుల్లో బంధించడం మినహా. దానికి కూడా నేను అనుజ్ఞ ఇవ్వలేదు. ఆ హృదయం లేనివాడిని, “ఒక్కసారి నన్ను చుంబించు … ఒకే ఒక్కసారి! నన్ను ముద్దు పెట్టుకుంటే నీకు ఈ శిక్షనుంచి విముక్తి కలుగుతుంది,” అంటూ వేడుకున్నాను.
మరణం సమీపంలోనే ఉన్నా అతను ఇంకా అహంభావంతోనే ఉండి ఇలా అన్నాడు. “దేవయానీ, వాళ్ళు నన్ను చంపి కాల్చేసి ఆ చితాభస్మాన్ని శుక్ర మహర్షి తాగే మధువులో కలిపారు. అది తాగినందుకు ఆయన హృదయానికి చేరువయ్యాను. అక్కడ ఉన్నప్పుడే వేరెవరికీ తెలియని సంజీవని మంత్రం నేర్చుకున్నాను. ఇంకా, అందువల్లనే నేను ఇప్పుడు నీకు సోదరుడిని. నువ్వు, నేను ఒకే రక్తం, ఒకే మాంసం.”
నాకు చాలా కోపం వచ్చి అన్నాను, “దేవయాని ఒక మూర్ఖురాలని నువ్వు అనుకుంటున్నావు. బిడ్డలు తమ తల్లి రక్తమాంసాలని పంచుకుని ఎదుగుతారని తెలుసుకోడానికి ఎంతో తెలివి అక్కర్లేదు. నేను నీకు సోదరిని కాను, నువ్వు నాకు సోదరుడివి కావు. నేను నీ ప్రేయసిని. నీ నుంచి నేను మరేమీ ఆశించను. ఒక్కసారి నన్ను చుంబించు, నిన్ను వదిలేయమని ఆజ్ఞాపిస్తాను.”
వృషపర్వరాజు, “దేవయానీ, ఇంతకీ శిక్ష ఏమిటి?” అని అడిగాడు.
వీక్షకులు
- 1,107,569 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

