ఈ నాడు ‘’మాత్రమేకాదు ఏనాడైనా అక్షర యోధుడు , భాషా సంస్కృతులకు ‘’తెలుగు వెలుగు ‘’,పొదుపు మదుపులకు ‘’మార్గదర్శి’’,తెలుగు పచ్చళ్ళ రుచికి ‘’ప్రియ ‘’తముడు , చానెళ్ల హంవీరుడు, నిర్భీతికి ,ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం , చలన చిత్ర’’ ప్రగతి సిటీ రామోజీ’’ అసామాన్య పద్మ  విభూషణుడు -2(చివరిభాగం )

ఈ నాడు ‘’మాత్రమేకాదు ఏనాడైనా అక్షర యోధుడు , భాషా సంస్కృతులకు ‘’తెలుగు వెలుగు ‘’,పొదుపు మదుపులకు ‘’మార్గదర్శి’’,తెలుగు పచ్చళ్ళ రుచికి ‘’ప్రియ ‘’తముడు , చానెళ్ల హంవీరుడు, నిర్భీతికి ,ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం , చలన చిత్ర’’ ప్రగతి సిటీ రామోజీ’’ అసామాన్య పద్మ  విభూషణుడు -2(చివరిభాగం )

  విదేశాల ఎగుమతి అవుతున్న ప్రియా పచ్చళ్ళు .

 నాణ్యత కు రుచికి శుచికి .ప్రసిద్ధి చెందినవి ప్రియా పచ్చళ్ళు .ఆవకాయ మాగాయ గోంగూర చింతకాయ వగైరాలు పరిశుభ్రంగా తయారు చేయించి  టిన్స్, సీసాలలో అందించే ఏర్పాటు ఉంది .విదేశాలలో వీటి గిరాకీ ఎక్కువ .ఉయ్యూరునుంచి బస్ లో  బెజ వాడ వెడుతుంటే ప్రియ పచ్చళ్ళ తయారీ ఫాక్టరి కనిపిస్తుంది .పచ్చళ్ళ వాసన కిలో మీటరు  దూరం నుంచే ఆకర్షిస్తాయి . మొదట్లో వీటిని ప్రారంభించినప్పుడు ,రెడియోలోభలేగా  యాడ్స్ వచ్చేవి .ఆదివిష్ణు చక్కని రచనలు చేసేవాడు .పచ్చళ్ళు అంత రుచిగా ప్రకటనలు ఉండేవి మహా ఘాటుగా హాటుగా స్వీటుగా .ఆ రోజుల్లో అవి వినటం ఒక గొప్ప హాబీ ప్రతి బేబీ నుంచి బాబీ వరకు. నా మటుకు నేను వాటి కి గొప్ప ఫాన్ నె .పచ్చళ్ల  కు అంతర్జాతీయ మార్కెట్ సాధించిన వాడు రామోజీ రావు .

  మార్గదర్శి

సుమారు  1964లో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థను స్థాపించి ,సామాన్య జనులకు అందుబాటులో ఉండేట్లు చిట్ లు నిర్వహిస్తూ ,ఎక్కడా దిఫాల్టర్లు లేకుండా రెగ్యులర్ గా వాయిదాలు కట్టేట్లు చేస్తూ పొదుపరుల మదుపరుల విశ్వాసాన్ని 60ఏళ్లుగా చూరగోనటం అల్లాటప్పా కాదు .సాధారణంగా చిట్ ఫండ్స్ కొద్ది కాలమే బాగానడిచి బోర్డ్లు తిరగబడతాయి .అమాంతం అర్ధరాత్రి పూట జంప్ జిలానీలౌతారు .కట్టిన డబ్బు రాక లబో దిబో .అలాంటిది సక్సెస్ ఫుల్ గా ఇంతకాలం ఇంతమందికి  నమ్మకం కలిగించటం ఎయిత్ వండర్ .ఇక్కడ నమ్మకమే ముఖ్యం .ఇన్నేళ్ళుగా ఎవరూ కంప్లైంట్ చేయలేదు .అలాంటి దాన్ని ఎలాగైనా మూసేయించాలని ‘’అంగుష్ఠ మాత్రులు ‘’ప్రయత్నించి భంగపడ్డారు .ఈ తిలాపాపం లో ఉండవల్లిదీ పిడికెడు పాపం ఉంది .లేనిపోని కేసులుపెట్టి తాబెదార్లతో భయపెట్టినా మేరు నగదీరుడుగా నిలబడ్డాడు రామోజీ రావ్ .

 చానెళ్ళు

ఈ టివి తో ఈటివి -2,మరో ఎనిమిది భాషలలో చానెళ్ళు నిర్మించి సమర్ధవంతంగా నిర్వహించాడు రామోజీ .విలువైన సీరియల్స్ ,అపరాధ పరిశోధన ,ఆడవాళ్ళకు ఆకర్షణగా వంటా వార్పూ ,ప్రముఖుల జీవితాలను ప్రతిభావంతంగా ఆవిష్కరించటం ,పౌరాణిక సీరియల్స్ ముఖ్యంగా భాగవతం మహా గొప్పగా నిర్వహించారు .ఆయనకొడుకు సుమన్  ఈచానల్ విస్తరణకు విశేష కృషి చేశాడు .అకస్మాత్తుగా చనిపోయి మనో వ్యధ కలిగించాడు .అయినా వెనకడుగు వేయలేదు .ముందుకే మును ముందుకే  అడుగు వేశాడు రామోజీ .అన్నిటికంటే జెమిని వాళ్ళు మొదలుపెట్టిన ‘’పాడుతా తీయగా ‘’ప్రోగ్రాం కోసం బాలును ఎంకరేజ్ చేసి ఘన విజయం సాధించేట్లు చేశాడు .యువ గాయక గాయనీ మను లెందరో దేశ విదేశాలలో ఉన్నవారు వెలుగులోకి వచ్చారు .ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మెప్పు పొందారు .

ఈ ఎఫ్ ఎం

  రేడియోలో ఇవాళ ట్రెండ్ ఎఫ్ ఎం రెడియోదే .మిర్చి అందులో అగ్రస్థానం లో ఉంది .తర్వాత రెడ్ ఎఫ్ ఎం ,వగైరాలోచ్చాయి రామోజీ ఇందులోనూ ప్రవేశించి ఈ ఎఫ్ ఎం  స్థాపించి ఇడది ‘’మీ ఎఫ్ ఎం ‘’అంటూ మంచి కార్యక్రమాలే జరిపిస్తున్నాడు. తెల్లవారు జామున ఐదింటికే భక్తీ సంగీతం ఆతర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఆతర్వాత సినీ భావ లహరి .బాగానే ఉన్నాయి .

సినీ నిర్మాత

చలన చిత్ర రంగం లో  ప్రవేశించి కధకు కళకు ప్రాధాన్యమిచ్చి మొట్టమొదటిసారిగా ‘’శ్రీవారికి ప్రేమ  లేఖలు’’ జంధ్యాల  దర్శకత్వం లో నిర్మించి హాస్యానికి పట్టం కట్టించాడు . అంతకు ముందు సినీ ప్రేక్షకులకోసం ‘’సితార ‘’వారపత్రిక నడిపి ,ప్రతిభ ఉన్న కళాకారులకు సితారా అవార్డులు అందించేవారు .అఆవార్డు ఒక గొప్ప గౌరవంగా భావించేవారు అందుకున్నవారు .మూడేళ్లపాటు ఇలా అవార్డులకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశాడు .తర్వాత మిత్రుల ప్రేరణతో ‘’ఉషా కిరణ్ ‘’సినీ  నిర్మాత అయ్యారు .పంపిణీ చేయటానికి ‘’మయూరి ‘’సంస్థ స్థాపించారు ఆడియో రంగం లోనూ రాణించారు .తమిళ దేశం లో నాట్యతార సుధా చంద్రన్ ‘’జీవితాన్ని తెలుగులో ‘’మయూరి ‘’గానిర్మించి,ఆమెతోనే ఆపాత్ర పోషింప జేశారు . ఘన వియం పొందారు .జూనియర్ ఎన్ టి ఆర్ తో ‘’నిన్ను చూడాలని ‘’,కళ్యాణ్ రాం తో ‘’’’తోలి చూపు లోనే ‘’,దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ తో ‘’నీతో ‘’సినిమాలు తీశారు శ్రీకాంత్ తరుణ్,వినోద్ కుమార్ లను హీరోలు గా తన సినిమాలలో ప్రవేశపెట్టారు .ప్రతిఘటన సినిమాలో విజిగి శాంతి ,కోట నటవిశ్వ రూపం చూస్తాం .ఒరిస్సా అడవి అమ్మాయి నిజజీవితాన్ని ‘’మౌనపోరాటంగా ‘’అశ్విని నాచప్ప జీవితాన్ని అశ్విని గా ఆమెతోనే నటిప జేయించారు197లో యు విశ్వేశ్వర రావు తీసిన ‘’మార్పు ‘’సినిమాలో  రామోజీ రావు చిన్న పాత్ర పోషించారు .ఈవివి కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు మొత్తం మీద 87 సినిమాలు తీసిన నిర్మాత రామోజీ తాత .

  రామోజు ఫిలిం సిటి

తన పేరుతొ మొదటి సారిగా ‘’రామోజీ ఫిలిం సిటి ‘’ని వందలాది ఎకరాలలో స్థాపించి ఆసియాలోనే పెద్ద స్టూడియోగా తీర్చి దిద్దిన విజనరీ రామోజీ ..ఇక్కడికి షూటింగ్ కు వస్తే ప్రింట్ తీసుకొని వెళ్ళటమే .అన్ని సౌకర్యాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఎయిర్ పోర్ట్ దేవాలయాలు,గార్డెన్స్ ,  ఉన్న సంపూర్ణమైన స్టుడియో .ఆయన విజనరికి ఇది నిలువెత్తు ఉదాహరణ .ఈ ఫిలిం సిటిలో వరుడు సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో తీస్తున్నప్పుడు మా మనవడు హర్ష చిన్నతనం లో అల్లు అర్జున్ పాత్రకు ఎంపిక అయితే ,మేము వారం రోజులు షూటింగ్ లో పాల్గొన్నాం .మా అందరికి రాయల్ ట్రీట్ మెంట్ .ఇంటినుంచి కారులో తీసుకొని వెళ్ళి షూటింగ్ అవగానే మళ్లీ కారు లో దిమ్పెవారు ఉదయం కాఫీ రెండు మూడు రకాల టిఫిన్స్ కాఫీ .మధ్యాహం షడ్రసోపేత భోజనం .సాయంత్రం స్నాక్స్ టే.అందరికి సిల్కు పంచెలు చొక్కాలు .

 తెలుగుభాషా సంస్కృతీ పోషణలో ‘’తెలుగు వెలుగు ‘’

 రామోజీ తెలుగు వెలుగు మాస పత్రిక స్థాపించి అచ్చమైన తెలుపు గ్లేజింగ్ పేపర్ పై రంగులతో ముద్రించి అతి తక్కువ ధర 20రూపాయలకే అందించే వారు .ప్రముఖ రచయితల కళాకారుల పరిచయాలు విమర్శనాత్మక విశ్లేషణాత్మక వ్యాసాలతో భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది పత్రిక .హాస్యబ్రహ్మ శంకర నారాయణ ఎడిటోరియల్ బోర్డ్ లో ఉండేవారు .నేను  వాల్మీకి రామాయణం ఆధారంగా రాసిన ‘’భరద్వాజ విందు ‘’వ్యాసం తెలుగు వెలుగు లో ప్రచురితమైంది .మా సరసభారతి పుస్తకాలపై చక్కని వివరణాత్మక విమర్శలు వచ్చేవి .దాదాపు  రెండేళ్ళనుంచి పత్రిక ఆగిపోయినట్లు అనిపించింది .మనవ్యాసాలు ఆన్లైన్ లో పంపిస్తే చాలు అందిందని వెంటనే సామాధానం వచ్చేది .పరిశీలనలో ఉందని త్వరలో ప్రచురిస్తామనివచ్చేది .ప్రాంప్ట్ రిప్లికి కేరాఫ్ అడ్రస్ గా తెలుగు వెలుగు ‘’ఉండేది .ఈటివి -2లో కూడా ఆదివారం ఉదయం మంచి సాహిత్య కార్యక్రమాలను మృణాళిని మొదలైన విద్యా వేత్తలు నిర్వహించేవారు .

  రామోజీరావును చూడటం

 కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన  ప్రపంచ తెలుగు రచయితల సభ విజయవాడ కళా క్షేత్రం లో జరిగినప్పుడు  రామోజీ రావు మాలతీ చందూర్ మొదలైన వారు వచ్చారు .రామోజీ ప్రసంగం తెలుగు భాషాభిమానులకు కవులకు రచయితలకు గొప్ప ప్రేరణ గా ఉన్నది .

ఇన్ని రకాల ఘన విజయాలు సాధించిన రామోజీ రావు ఒక వ్యక్తి కాదు ఒక దివ్య శక్తి .ఒక సమున్నత  సంస్థ .ప్రేరకుడు ,మార్గదర్శి .ఉషా కిరణాలతో తిమిర సంహారం చేయించిన కళాప్రియుడు . మహా మనీషి .సంస్కారి .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-24-ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.