చతురధిక శత(104) వసంత కృష్ణా జిల్లాపరిషత్ ఆదర్శ విశ్రామ ప్రధానోపాధ్యాయులు ,బాడ్మింటన్ ‘’సవ్యసాచి ‘’,ఎందరెందరకో మార్గ దర్శి,సుజన శీలురు –మాన్య శ్రీ సి.వి.సన్యాసి రాజు గురు మహోదయకులు నిన్న 18-7-24 గురు వారం ఉదయం సునాయాసంగా మరణించినట్లు వారి కుమారుడు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేశారు .వారి ఆత్మకు శాంతి కలగాలని తెలియ జేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాము .
నిరుడు ఉపాధ్యాయ దినోత్సవం నాదు -5-9-2024 న శ్రీ సన్యాసి రాజుగారికి ఆత్మీయ సాత్కారం చేయాలని భావించి వృద్దాప్యం కారణంగా వారు ఉయ్యూరు రాలేనందు వలన ఉదయం 8గం .లకు పటమట న్యు పోస్టల్ కాలని లోని వారి స్వగృహం లో వారిని ప్రత్యేకంగా సరస భారతి 176 వ కార్యక్రమంగా సరసభారతి, అమరవాణి సంస్థలు చంద్రునికో నూలుపోగుగా సన్మానము చేశాము .వారు అత్యన్త ఆనందం వెలిబుచ్చి మాతో చక్కగా మాట్లాడారు .మాకు స్పూర్తిని కలిగించి విద్యార్ధులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు .ఈ కార్యక్రమం లో వారి శిష్యులు ,మా సరసభారతి ఆత్మీయులు ఉయ్యూరు హై స్కూల్ లో మా సహచర ఉపాధ్యాయులు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రిగారు హైదరాబాద్ నుంచి వచ్చి తమ గురువు గారిని సత్కరించి గురుభక్తి చాటుకొన్నారు .
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో కూడా శ్రీ సన్యాసి రాజు గారు వృద్ధాప్యాన్ని లెక్క చేయక వెళ్ళి స్వయం గా వోటు హక్కు వినియోగించుకొని ,వార్తా పత్రికల వారి అభిమానం పొందారు .
ఆదర్శ,నిబద్ధతా మూర్తి ,మార్గదర్శి శిష్య వాత్సల్యంతో అనేక తరాల ఉపాధ్యాయ విద్యార్ధులను తీర్చి దిద్దిన మాన్యశ్రీ సన్యాసి రాజు సద్గురువులకు మరొక్క మారు నివాళి సమర్పిస్తున్నాము .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-24-ఉయ్యూరు .
