సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సరస భారతి 185 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం ,మరియు ఉయ్యూరు దగ్గర కనకవల్లి గ్రామం లో జన్మించి ,విశాఖ పట్నం కార్యస్థానంగా బహు సాహిత్య సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన సంఘ సంస్కర్త బహు గ్రంథ కర్త ‘’కవిగారు’’గా ప్రసిద్ధి చెందిన బ్రహ్మశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి (1874-1951)గారిని వారి 74వ వర్ధంతి సందర్భంగా ఈ తరానికి పరిచయం చేసే కార్యక్రమం .
సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు
సరస భారతి 185వ కార్యక్రమంగా, శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-24 గురువారం మా గురు వరేణ్యులు శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం నిర్వహిస్తున్నాము .
.. 2024 మార్చి లో లో పదవతరగతి పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-24 గురువారం మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC ,ఒక BC ,ఒక STవిద్యార్ధికి /విదార్ధిని కి అంద జేయబడుతుంది .
కనకవల్లి గ్రామం లో ఉంటూ ఈ సంవత్సరం మార్చి పదవతరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభ గల విద్యార్ధి విద్యార్ధిని లకు ‘’కవిగారు ‘’పేరిట స్మారక నగదు పురస్కారం ,మరియు కనకవల్లి లో ఉంటూ వేదం చదువుకొన్నవారికి ,సాహిత్య సంగీతాలలో అనుభవమున్న పెద్దలకు ‘’కవిగారు’’పేరిట స్మారక పురస్కారం సరసభారతి అంద జేస్తుంది .
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం జరుగుతుంది .
సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
వేదిక ,సమయం ,నగదు పురస్కార గ్రహీతవిద్యార్ధుల, సన్మానితుల పేర్లు , ,పూర్తి వివరాలు ఒక వారం లో అంద జేస్తాము
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు -9-8-24-ఉయ్యూరు .

