శ్రీ కృష్ణాష్టమి -2(చివరి భాగం )
వైశాఖానికిరాధా మాసం అనే పేరు కూడా ఉంది .కృష్ణుడు రాత్రి వేళ రాధతో గడిపే కాలం .రాధ జీవాత్మ కన్నయ్య పరమాత్మ.వీరి ప్రణయం జీవాత్మ పరమాత్మల సంయోగం .వైశాఖానికి ఆరు నెలల తర్వాత కార్తీకం .కార్తీకం లో విష్ణు నక్షత్రాలు ఉదయి౦చ టానికి ముందు విశాఖ నక్షత్రం ఉదయిస్తుంది .సూర్యోదయవేళకు విష్ణువు రాధా నక్షత్రంతో కూడి ఉంటాడుకనుక భక్తులు రాధా సమేత కార్తీక దామోదరుని ధ్యానించి అర్ఘ్యపాద్యాలిచ్చి ,పూజించి బ్రాహ్మణుడికి ‘’కార్తీక దామోదర స్వరూప బ్రాహ్మణా అమృత మస్తు ‘’ ‘’ఆని ఆపోసన పోస్తారు .
‘’అయం క్షీరోదాంభోధేః-పతిరితి గవాం పాలకయితి ‘’
‘’చాపల్య సీమ చపలానుభావైక సీమ –చాతుర్యసీమ ,చతురానన శిల్ప సీమ – సౌరభ్య సీమ సకలాద్భుత కేళి సీమ –సౌభాగ్య సీమ తదిదం వ్రజభాగ్యసీమ ‘’
‘’అ౦గ నామంగనా మంతరేమాధవో-మాధవం మాధవం చాన్త రే ణా౦గనా –ఇత్ధమాకల్పితే మండలే మధ్యగః –సంజగౌ వేణునా దేవకీ నందనః ‘’
‘’గోప జనము లందు గోపికలందును –సకల జంతు లందు సంచరించు –నా మహాత్మునకు పరంగన లెవ్వరు ? –సర్వమయుడు లీల సలిపే గాక’’
‘’బాలిశలైన గోపికలు బంధులు పాళేముగొల్లపల్లె ము-త్యాల సరాలు దామేనలు తారలు గోపిక లంగరాగముల్ –శైల విటంకధాతువులు చారు విభూషలు పించ ధామముల్ –పోలిన నైన విష్ణుడను బుద్ధి నెరు౦గుదురేల్ల పెద్దలున్’’ఇవన్నీ మనస్సులో చదువుకొంటూ పై దృష్టితో చూస్తె పరమానందం కలుగుతుంది .
‘’స్పష్టమైన శుద్ధ సత్యాన్ని అచేతన సృష్టి సౌందర్యంతో శ్రుంగారించి ,కళా శిల్ప ప్రౌడిమ మెరిసేట్లు ప్రదర్శిస్తే అదే వైజ్ఞానిక మతం అవుతుంది ‘’అన్నాడు సైంటిఫిక్ దీరీ ‘’లో డాక్టర్ డింగిల్.ఇదే మన వేద పురాణ వాజ్మయం అన్నారు గొబ్బూరి .’’Hindu religion is a relentless pursuit after Truth ‘’.
తూర్పున గోకుల సూచకం అయిన ధనిష్ట నక్షత్రం శ్రావణ బహుళ అష్టమి నాడు ఉదయిస్తుంది కనుక ఆరోజే శ్రీ కృష్ణ జన్మాష్టమి
ఋగ్వేదం లో ‘’యత్ర గావో భూరి శృంగా అయాసః ‘’అనేక కొమ్ములుకలిగి చురుకైన గో బృందం యే దేవుని పరమపద సమీపంలో ఉందొ ఆ దేవుడు విష్ణువే ‘’ఆని దీర్ఘ తమ మహర్షి వివరించాడు అదే గోకులం అయింది .
‘’నాలుగు మోములన్ నిగమ నాదము లుప్పతిలన్ ప్రచండ వా –తూలహతిం జనించు ‘’రొద తోడ ‘’గుహాలి నొప్పు మేరువు ‘’అన్నాడు అల్లసాని పెద్దన. ఈ రోదనే కాస్మిక్ హిస్ అన్నారు .
సూర్యుడు గ్రహ నక్షత్రాదులతో సెకనుకు 12మైళ్ళు అంటే 18కిలో మీటర్ల వేగంతో పరమపదమైన అభిజిత్ నక్షత్రాన్ని చేరుకోనటానికి పోతూ ఉం టాడు .పాశ్చాత్యులు దీనినే VEGA అన్నారు
ఆధారం –శ్రీ గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి –జ్యోతిర్వేదం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-24-ఉయ్యూరు .

