కొందరు ప్రముఖ ఆంధ్ర నట దిగ్గజాలు -1
1- ఆజన్మ నటుడు,,విశ్వనాధ ‘’తెరచి రాజు ‘’నవలకు నాయకుడు ,హిరణ్యకశిప ,శ్రీ కృష్ణ ఫేం –శ్రీ ముంజు లూరి కృష్ణారావు
ముంజులూరి కృష్ణారావు ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. నాటకరంగానికి తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి. బందరు రాయల్ థియేటర్ లో చేరి ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు, వేణీ సంహారంలో అశ్వత్థామ, రసపుత్రవిజయంలో దుర్గాదాసు, పండవొద్యోగం, గయోపాఖ్యానం లలో శ్రీకృష్ణుడు, ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు, పిచ్చివాడు, మృఛ్ఛకటికంలో శర్విలకుడుగా నటించారు. 1925లో ఏలూరు మోతే నారాయణరావు కంపెనీలో చిన్న చిన్న పాత్రలు ధరించి, వృద్ధాప్యం వల్ల పాత్రపోషణ చేయలేక, బందా వారి నాట్య పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఒంటరి జీవితం గడిపి అస్తమించారు.
కృష్ణారావు జీవితచరిత్ర ఆధారంగా విశ్వనాథ సత్యనారాయణ ‘తెఱచిరాజు’ నవల వ్రాశాడు.[1]
కళా తృష్ణతో మాత్రమె ,కళారాధనతో జీవితాన్ని పండించుకొన్న సార్ధక జీవి .దరిద్రాన్నికూడా ఆనందంగా కౌగిలించుకొన్న ధన్యజీవి .మధ్యతరగతి నియోగ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించి ఏలోటూ లేకుండా జీవించారు మెట్రిక్ మాత్రమే చదివారు .బందరులో ఈవెన వారి నటనకుఆకర్షితులై ,యే ఉద్యోగం ఆశించకుండా రాయల్ కంపెనిలో ,నాటకరంగంలో చేరారు.ప్రహ్లాదలో హిరణ్య కశిప ,వేణీ సంహారంలో అశ్వత్ధామ ,రసపుత్ర విజయం లో దుర్గాదాసు ,గయోపాఖ్యాన ,పాండవ నాటకాలలో శ్రీ కృష్ణుడు ,రసపుత్ర,ప్రతాప రుద్రీయ౦ లో యుగంధరుడు ,,పిచ్చివాడు మృచ్చకటిక లో శర్విలకుడు గాఅద్భుతంగా నటించారు .నాటకాన్ని పాత్రను పూర్తిగా అర్ధం చేసుకొని ,రచయిత భావాన్ని ఆకలింపు చేసుకొని పాత్ర శీలం చెడకుండా నటించేవారు .ఒకరకంగా బళ్ళారి రాఘవ స్థాయి నటన ముంజులూరు వారిది .రసానుగుణ౦ గా,సహజంగా గంభీరంగా సంభాషణలు చెప్పేవారు.గద్య పద్యాలను ఉదాత్తమంగా నడిపేవారు .భావప్రకటన కె ఎక్కువ ప్రాదాన్యమిచ్చేవారు .నటనలో సహజత్వం ఉట్టి పడేది .’’ ఢిల్లీ సుల్తాన్ పట్టుకు పోతాన్’’అంటూ రంగ ప్రవేశం చేస్తే అడిరిపోయేది .ప్రతాపరుద్రీయ నాటక కర్త వేదం వెంకటరాయ శాస్త్రి గారే ‘’నా నాటకానికి ,పిచ్చి వాడి పాత్రకు గొప్ప సార్ధకత తెచ్చారు ము౦జులూరి ‘’ఆని మురిసిపోయారు .కృష్ణ పాత్రలో గాంభీర్యం కొట్టవచ్చినట్లుండేది .పాత్రను కళా ఖండంగా తీర్చిదిద్దేవారు .తాను నటిస్తూ మిగిలిన పాత్రలకు ప్రాం టింగ్ కూడా చేయటం ఆయన మరో ప్రత్యేకత .
నాట్యాచార్యులు గా కూడా ఆయన వర్దిల్లారు .సమాజంలో ఇతరనటులకు శిక్షణ ఇచ్చేవారు .అన్ని పాత్రల సంభాషణలు ఆయనకు కంఠొ పాఠం .నాటక రసోదయమే ఆయన ధ్యేయం .రాయల్ ధియేటర్ కు ము౦జు లూరి జీవం ,ఆత్మ.పెద్దగా చదువులేదు నట శిక్షణా లేదు.నిత్య కళారాధనే ఆయన్ను నట తపస్విని చేసింది అంటారు కళాప్రపూర్ణ మిక్కిలినేని .మితభాషి అహంకార రహితుడు ఆయన .1925ఏలూరు మోతే వారి కంపెనిలో 60ఏట చేరి చిన్నచిన్న పాత్రలూ వేశారు .అప్పటికే నాటకరంగంలో అలసి సొలసి పోయారు .శక్తి ఉత్సాహం అడుగంటాయి .కళలో రారాజు నిత్యజీవితం లో పేదరికం .చివరికి నా అనే ఆదరణ లేక మరణించారు .
2-స్త్రీ పాత్రధారి ,చంద్రమతి ,రత్నాగి ఫేం –కళాప్రపూర్ణ ముప్పిడి జగ్గరాజు ముప్పిడి జగ్గరాజు :(1885 – 1938) స్త్రీ పాత్రపోషణలో అందెవేసినచేయి.[1] కాకినాడ సంగీతం అబ్బాయి కంపెనీలో మల్లమ్మ, యశోధర, లీలావతి, చంద్రమతి పాత్రలను పోషించారు. 1902లో రాజమండ్రి లో హిందూ థియేటర్ కంపెనీలో వేణీసంహారం, గయోపాఖ్యానం నాటకాల్లో స్త్రీ పాత్రల్ని ధరించారు. 1906లో స్థాపించిన మానేపల్లి కంపెనీలో అంబడిపూడి కోటయ్య ప్రక్కన సారంగధర లో రత్నాంగి, చిత్రనళీయం లో దమయంతి పాత్రలు, కృత్తివెంటి నాగేశ్వర్ రావు, సత్యవోలు గున్నేశ్వర రావుల నాటకసమాజం లో ప్రముఖ స్త్రీ పాత్రలు ధరించారు. 1913 నుండి 1921 వరకు రాజమండ్రి చింతా వారి థియేటర్ లో నిడసనమెట్టు కొండలరావు, బ్రహ్మజోశ్యుల సుబ్బారావుల సరసన చంద్రమతి, రత్నాగి, కౌసల్య, దమయంతి, లీలావతి, మైనావతి, సీత పాత్రలను ధరించారు. 1922లో బ్రహ్మజోశ్యుల సుబ్బారావు, వెల్లంకి వెంకటేశ్వర్లు, నిడసనమెట్టు కొండలరావు గార్లతో కలిసి వేణుగోపాల విలాస నాటక సభను స్థాపించారు.
రాజమండ్రికి చెందిన జగ్గరాజు స్త్రీపాత్రలలో మూర్తీభవించి నాటకరంగానికే గౌరవం తెచ్చారు .స్ఫురద్రూపి బంగారు ఛాయ .సుకుమార అంగ సౌష్టవం ,భావ విశిష్టత ఉన్నవారు .కరుణ ,దైన్యాలను ఒకే సారి అభినయించటం ఆయన గొప్ప .రంగస్థలం పై కాలుపెట్టగా ‘’వచ్చిందయ్యా వయ్యారి ‘’ఆని పించేవారు .లవణ్యం,పతివ్రతా లక్షణం మూర్తీభవించేవి .భావానికి తగినరాగం ఎంతమోతాదులో పాడాలో ఆయనకు బాగా తెలుసు .ముఖారి శహన ,నీలాంబరి ,శ్యామల రాగాలు ఆయనకు మహా ఇష్టం.వాటిలో దిట్ట .
1898లో ధార్వాడ కంపెని పిఠాపురం లో నాటకాలు ప్రదర్శించినప్పుడు బాబూరావు అనే యువకుడు స్త్రీ పాత్రను అద్భుతంగా పోషించగా జగ్గరాజు ఆకర్షితులై తానూ అలా నటించాలి ఆని నిశ్చయించుకొన్నారు .అప్పుడు రాజమండ్రిలో ఉత్సాహవంతులైన యువక బృందం ఒక నాటక కంపెని పెట్టగా ,జగ్గరాజు అందులో స్త్రీ వేషాలు వేసి బాగా ప్రాచుర్యం పొందారు .అప్పటినుంచి దాదాపు 30నాటకాలలో స్త్రీ పాత్రలకే అంకితమయ్యారు .తర్వాత కాకినాడ సింగితం అబ్బాయి కంపెనిలో మల్లమ్మ యశోధర పాత్రలు ధరించారు .1902లో రాజమండ్రి హిందు ధియేట్రి కల్ కంపెని వారి వేణీ సంహారం గయోపాఖ్యానం లలో నాయకి పాత్ర ధరించారు .1906లోధరణిప్రగడ సూరయ్యగారి మానేపల్లి కంపెని లో సారంగధరలో రత్నాంగి ,చిత్ర నళీయం లో దమయంతి వేశారు .గున్నేశ్వరరావు కంపెనీలోనూ ఆడారు .1913నుంచి 1921వరకు చింతా వారి ధియేటర్ లో అనేక స్త్రీ పాత్రలు ధరించారు .1922లో బ్రహ్మాజోశ్యుల సుబ్బారావు కంపెని’’వేణుగోపాల విలాస సభ ‘’లో కూడానాటకాలు ప్రదర్శించారు .జయంతి గంగన్నపంతుల ‘’అమెచ్యూర్ కళాభి లాషిణి ‘’లో చంద్రగుప్త ,రాణా ప్రతాప్ నాటకాలలో జగ్గరాజు స్త్రీ పాత్రలు ధరించారు .
1916లో బందరు లో జరిగిన చిత్ర నళీయం నాటక పోటీలలో జగ్గరాజు దమయంతి పాత్రకు మొదటి బహుమతి పొందారు .1935లో మద్రాస్ లో బలిజే పల్లి అధ్యక్షతన ఘన సన్మానం అందుకొన్నారు .ఖర్గపూర్ ఆంధ్రసభ 1930లో సన్మానించింది .1885లో పిఠాపురం లో జన్మించిన జగ్గరాజు 30సంవత్సరాలు నటజీవితంలో మహిళా పాత్రలు పోషించి అశేష జన నీరాజనాలు అందుకొన్నారు .1938లో భగవరాధానలో జీవితాన్ని ధన్య౦ చేసుకొంటూ తనువు’’ చాలించింది’’ సారీ చాలించారు
3-బందరు జాతీయ కళాశాల స్థాపకుడు –శ్రీ కోపల్లె హనుమంతరావు ,
కోపల్లె హనుమంతరావు (ఏప్రిల్ 12, 1880 – ఫిబ్రవరి 2, 1922) మచిలీపట్నం లో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించారు. జాతీయ విద్యకై కృషి చేసిన తెలుగువాడిగా ప్రసిద్ధుడు.
జననం
హనుమంతరావు 1879, ఏప్రిల్ 12 న మచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వీరు చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాది. ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు.
హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఆ తరువాత ఎం.ఏ, లా డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వోద్యోగం చేసి, దానికి స్వస్తి పలికాడు. బిపిన్ చంద్ర పాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించాడు.
1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు అందుకొని ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల కూడా నదుస్తున్నాయి. వీరు ఈ కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగకుండా ప్రయత్నించి ఐదారు లక్షల ధనం, ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను కళాశాలగా అవసరమైన సాధన సామగ్రి సమకూర్చి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ సంస్థ 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది.
మరణం
.
జాతీయ విద్యకై విశేష కృషి చేసిన హనుమంతరావు 1922, ఫిబ్రవరి 2 న మచిలీపట్నం లో మరణించారు.
హరి ప్రసాదరావు హరిశ్చంద్రుడుగా ,కోపల్లె చంద్రమతిగా గుంటూరు ఫస్ట్ కంపెనిలో నటించారు .దమయంతి గా కూడా నటించారు .హరి ,కోపల్లె కాంబినేషన్ హిట్ పెయిర్.ఆయన స్త్రీపాత్రదారణం అసామాన్యం .హరిశ్చంద్ర కాటి సీను లో ప్రసాదరావు కొడుకు శవాన్ని చూసి ‘’తత హంస తూలికా తల్పమును చేర్చు మృదుల దేహమా ఇది కుమారా ‘’అంటూ హృదయ విదారకంగా దుఃఖిస్తుంటే ,చంద్రమతి పాత్రలో కోపల్లె లోలోపల కుమిలి పోతూ దుఖాన్ని గుండెల్లో దాచుకొని ఉదాత్త గంభీర భావాలను సాత్వికంగా నిగ్రహంగా చూపుతూ ప్రేక్షకుల హృదయాలను ద్రవింప జేసేవారు .కోపల్లె క౦ఠం ముమ్మూర్తులా స్త్రీ స్వరమే .కుదిమట్టమైన ఆకారం ,గుండ్రని ముఖం మహా చూడ ముచ్చటగా ఉండేది .చీరకట్టి జాకెట్ తొడిగి ,ఆరవిక కిందపక్క అంచుకూ ,పై చీర అంచుకూ ,చీరే నడి కట్టు పైకీ కనిపించే మిసమిసలాడే కడుపు మడతల అందం ఉన్నత వంశ మహిళల నాజూకు తనాన్నీ హుందాను ప్రతిబింబించేది ఆని మిక్కిలినేని ఉవాచ .వాచిక భావ ప్రకటన ఆంగికాభినయం పరాకాష్ట లో ఉండేది .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-24-ఉయ్యూరు

