జె౦ద్ అవస్తా పండితుడు , మహా వ్యాకరణ విధ్వంసుడు, బహుభాషా వేత్త , న్యాయవాది – శ్రీ వేదం వేంకటాచలం గారు
ద్రావిడ బ్రాహ్మణులు వెంకటరమణ శాస్త్రి లక్ష్మమ్మ దంపతులకు తృతీయ పుత్రుడుగా గోదావరి జిల్లా కోడూరు గ్రామంలో 18 64 లో జన్మించారు విద్వత్ కవి సుప్రసిద్ధ విద్వత్ కవి కళా ప్రపూర్ణ వెంకటరాయ శాస్త్రి సోదరు తండ్రి విశాఖపట్నంలో నార్మల్ స్కూల్లో ఆంధ్ర పండితులుగా ఉండేవారు. మూడు నాలుగు తరగతి హై స్కూల్ లోనే చదివి , తర్వాత అక్కడ హిందూ హైస్కూల్ లో కొంతకాలం చదివి కళా ప్రపూర్ణ వద్ద విద్యాభ్యాసం చేశారు తర్వాత 1878 బిఏ పరీక్షలో సంస్కృతంలో రాజభాని జిల్లాలోనే ప్రధములుగా వచ్చారు . విజయనగరం మహారాజా 550 బహుమతి550రూపాయలు పొందారు . 1886లో టౌన్ ఇన్నీస్ పేట హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు పరీక్షలు రెండవ గ్రేడ్ ప్లీడర్ పరీక్షలు ఉత్తీర్ణుడై కావలికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లయ్య పాలెం లో తన తండ్రి వందన అక్కడికి దగ్గర్లో ఉండాలని కావలికి వచ్చి రెండేళ్లు వచ్చి రెండేళ్లు న్యాయవాద వృత్తి ప్రారంభించి జీవితాంతం అక్కడే గడిపారు .
వెంకటా చలం గారి ధారణాశక్తి అత్యద్భుత౦. ఏ భాషలో అయినా ఒక సత్కావ్యాన్ని ఒక్కసారి చదివితే అది కంఠస్థంపోయేది .స్వయంకృషి చేత గ్రీకు లాటిన్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ పర్షియన్,ఇటాలియన్ జర్మన్ ,అరెబిక్ జంద్,ఈజిప్షియన్ ,అస్సీరియన్ పాశ్చాత్య భాషలనునేర్చి తొమిది నేర్చి భారతీయ భాషలైన సంస్కృత తెలుగు అరవం కన్నడ మలయాళం మహారాష్ట్ర హిందీ ఉర్దూ గుజరాతీయ భాషలు చదివి సమగ్రమైన పాండిత్యం సాధించారు .పారశీక ముఖ్య గ్రంథమైన ‘’జంద్ అవెస్తా ‘’ను వీరు వేదంలాగా స్వయంగా స్వరయుక్తంగా గానం చేయగలరు
ప్రాచీన భూగోళం శాస్త్రం ప్రాచీన చరిత్ర లో శ్రద్ధాసక్తులు ఎక్కువ . తన విరామ సమయాలలో పై విషయాలు పై పరిశోధన చేస్తూకాలం గడిపారు . వీరి రచనలు ముద్రితాలు, అముద్రితాలు ఉన్నాయి .ముద్రిత రచనలతో మైథాలజికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ది ఆర్యన్ హైపాధిసిస్ ,’’ అడ్వెంచర్స్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ మధుర , భరత వర్ష,ఆర్యావర్త, ది తమిల్స్ త్రీ తౌసండ్ యియర్స్ ఎగో,పోస్ట్ మోడరన్ లైఫ్ ఇన్యేన్శేంట్ ఇనీజిప్శియన్ బిలీఫ్ , సనాతన ది సనాతన ధర్మ ఆఫ్ హిందూ మ్యారేజ్, ది సెవెన్ ద్వీపాస్ ఆఫ్ ది పురాణాస్ ,ఇయర్ మెజర్మెంట్ ఇన్ ఏన్సెంట్ టైమ్స్, నోట్స్ ఆన్ ది ప్రిలిమినరీ చాప్టర్స్ ఆఫ్ మహాభారత , బీయింగ్ యాన్ అట్టెంప్ట్ టు సెపరేట్ ది జెన్యూన్ ఫ్రం ది స్పూరియస్ .
వెంకటాచలం గారి ఆంధ్ర రచనలలో’’కతిపయ శబ్దార్ధ స్వరూప విచారం’’ అనే శీర్షికపై వ్యాసాలు .అముద్రిత రచనలు – రచనలు రామాయణ విమర్శ లలితా సహస్రనామ భాష్యం ,అమర కోశ వ్యాఖ్య మొదలైనవి.
గంభీర రూపంలో ఉండే వీరు సచ్ఛీలురు, సత్య సంధులు , మొహమాటం లేనివారు . న్యాయవాద వృత్తిలో నీతికి నిజాయితీకి వెంకటాచలం గారికి వెంకటాచలం గారే సాటి . సత్యదూరమైన కేసు ఎన్నడు చేపట్టలేదు . కఠినంగా పాటించ కాలనియమాన్ని పాటించారు . 1931లో 67వ ఏట ఈ పుంభావ సరస్వతి మరణించారు.
ఆధారం – ఆచార్య గుర్తి వెంకటరావు గారి వ్యాసం .వీరి గురించి వికీ పీడియాలో లేకపోవటం దురదృష్టం .ఫోటో కూడా దొరకలేదు .
మనవి –ఈ వ్యాసం ఇవాళే మొదటి సారిగా ‘’స్పీచ్ టైపింగ్ ‘’లో రాశాను .ఈ విధానం నాకు నేర్పిన మ అబ్బాయి శర్మకు ,కంప్యూటర్ ఘనాపాటి శ్రీ రహ్మనుద్దీన్ షేక్ గారికి ,ఇందులో మెళకువలు నేర్పిన మా మనవరాలు రమ్యకు అభినందనలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-24-ఉయ్యూరు

