అవనిగడ్డ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం 16వ సమావేశం ,శ్రీ మండలి కృష్ణారావు గారి 27వ వర్ధతి –పుస్తక సిరి
కృష్ణా జిల్లా రచయితల 16వ సమావేశం శ్రీ మండలి కృష్ణా రావు గారి 27వ వర్ధంతి సందర్భంగా దివిసీమ అవని గడ్డలోఒక రోజు కార్యక్రమం గాసెప్టెంబర్ 29ఆదివారం జరిగింది .ఉ దయం కాఫీ టిఫిన్లు తర్వాత కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం విద్యార్దినులచే ఆహ్వాన నృత్యం ఆకర్షణీయంగా జరిగింది .అసలు కార్యక్రమం ఉద్యమ 11గంటలకు శ్రీ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన ప్రారంభమైంది .శ్రీ మండలి బుద్ధప్రసాద్ తండ్రి గారి పేరా నెలకొల్పిన స్మారక సాహితీ సేవా పురస్కారం శ్రీ అప్పాజోశ్యులసత్యనారాయణకు ,శ్రీయార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బైరాగి కవి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసినకవితా పురస్కారం శ్రీ బండ్ల మాధవరావు కు ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు నెలకొల్పిన సాహితీ సేవా పురస్కారం శ్రీ పెనుగొండ లక్ష్మీ నారాయణకు ,,శ్రీ గోళ్ళ నారాయణరావు శ్రీ పోలవరపు కోటేశ్వరరావు పేరిట ఇచ్చే కదా సాహిత్య పురస్కారం శ్రీ రావులపాటి సీతారాం ,శ్రీ మార్తి పౌరోహితం లకు ఆచార్య ప్రతిభ నూతక్కి నెలకొల్పిన శ్రీ ముక్కామల నాగభూషణం పాత్రికేయ పురస్కారం శ్రీమతి బాలబాట కె ఎన్ వి రమణమ్మ కు ,శ్రీ వేములపల్లి కేశవరావు నెలకొల్పిన విశాల అనువాద సాహిత్య పురస్కారంశ్రీమతి స్వాతి శ్రీపాదకు సభ్యుల హర్షధ్వానాల మధ్య ఒక్కొక్కరికి 10వేళ రూపాయలు జ్ఞాపిక వగైరాలతో ఘనం గా అంద జేశారు .పురస్కార గ్రహీతలు క్లుప్తంగా కృతజ్ఞతలు తెలియ జేశారు .ఒక జడ్జి గారు ,బెజవాడ కేబి ఎన్ కాలేజి ప్రిన్సిపాల్ మొదలైన వారు ప్రసంగించారు .ఇద్దరూ సమయాన్ని లెక్క చేయకుండా ఎవరి దారిన వారు వారిష్టమోచ్చినంత సేపు మాట్లాడి సభ్యుల సహనాన్ని తీవ్రంగా పరీక్షించారు .విన్నవారు తక్కువ విసుక్కొన్న వారు ఎక్కువ .ఉదయం 9గంటలకు ప్రారంభించాల్సిన సభ 11కు మొదలై మధ్యాహ్నం 1గంట వరకు సా——–గింది . తత్ఫలితంగా 12 గం లకు జరగాల్సిన మొదటి సభ భోజనానంతర సభగా మార్చాల్సి వచ్చింది .అధ్యక్షులు సుబ్బారావు ‘’హెల్ప్ లెస్’’అయినట్లు అనిపించింది .
భోజనాలు సభ భవనం దగ్గరలో ఉన్న బుద్ధ ప్రసాద్ గారింట్లో ఏర్పాటు చేశారు .పూర్ణం చక్రపొంగలి ,గారే ,పులిహోర ,పప్పు కూర గోంగూర చట్ని ,కారప్పొడి సాంబారు ,పెరుగు తో విందు కమనీయంగా ఉంది పదార్ధాలన్నీ శుచి రుచితో ఉవ్విల్లూరించాయి .పొందిన అలసట తీరింది వడ్డించేవారు చాలా ఆప్యాయంగా ,మర్యాదగా వడ్డించారు .విందు ఇచ్చింది బుద్ధ ప్రసాద్ గారే అయినా వంట చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించాలి .ప్రతి ఆటం బాగుంది మసాలా ,ఉల్లి వెల్లుల్లి లేవు .చాలాకాలానికి బయట భోజనం ఇవాళ ఆస్వాదించాను .బుద్ధ ప్రసాద్ గారికి ,వారి కి తోడ్పడిన వారికి ధన్యవాదాలు .అయితే దివి సీమ ప్రసిద్ధి అయిన అరటి పండు లేని లోపం కనిపించింది .
మధ్యాహ్నం 2గం లకు శ్రీ పూర్ణ చంద్ అధ్యక్షతన మొదటి సభ ‘’పర్యావరణ సదస్సు ‘’జరిగింది .శ్రీ అక్కినేని భవానీ ప్రసాద్ శ్రీమతి ఎస్ పిభారై ,శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ –కావ్యాలలో దివి ఉప్పెన ,శ్రీ చింతపల్లి వెంకట నారాయణ –కొల్లేరు ముంపు ,కావుల ప్రతి స్పందన ,శ్రీ అంగత వరప్రసాదరావు – జల విజ్ఞానం రచయితల పాత్ర ,శ్రీ సరికొండ నరసింహరాజు –జలవనరుల వినియోగం ,రచయితల స్పందన అనే అంశాలపై పత్రసమర్పణ గా మాట్లాడారు .కాల స్పృహ తో మాట్లాడినవారు తక్కువే .ఇక్కడా పూర్ణచంద్ కూడా హెల్ప్ లెస్ అయారు .
తర్వాత సాయంత్రం 4-30 కి జరిగిన సభలో డా గంధం సుబ్బారావు -50ఏళ్ల కాలం లో ప్రపంచ తెలుగు మహాసభ ల ప్రభావం ,డా రావి రంగారావు –వచన కవిత్వం లో ప్రక్రుతి వైపరీత్యాలు ,శ్రీ కల్లూరి శివ ప్రసాద్ –తెలుగు కధ –పర్యావరణ పరిజ్ఞానం ,శ్రీమతి తేళ్ళఅరుణ –ప్రకృతి పరిరక్షణ మహిళలపాత్ర ,శ్రీ సవరం వెంకటేశ్వరరావు –చరిత్ర పుటలలో వరదలు ముంపులు ,పై సాధికార ప్రసంగాలు చేశారు .ఈ సభలో ఆత్మీయ అతిధి అయిన నేను ‘’ఇంతటి ముఖ్య సభ జరిపిన త్రిమూర్తులుశ్రీ బుద్ధ ప్రసాద్ శ్రీసుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ లను మనసారా అభినందిస్తున్నాను .గత అయిదేళ్ళుగా ఆంధ్రప్రజలు అనుభవించిన భౌతిక మానసిక క్షోభ ఎన్నికల సునామీతో కోరుకొన్న ప్రభుత్వాన్ని తెచ్చింది .మళ్లీ శ్రీ కాకుళం లో శ్రే కృష్ణ దేవరాయ ఉత్సవాలు జరగాలి .శ్రీ బుద్ధప్రసాద్ కు తగిన గౌరవనీయ పదవి లభించాలి’’నా ప్రసంగం ముగించాను చెప్ప దలచుకున్నది క్రింద తెలియ జేస్తున్నాను .
.మన౦దరికి చక్కని సామాజిక స్పృహ బాధ్యత ఉండాలి .మహాభారతం లో పాండవులు ద్వైత వనం లో ఉన్నప్పుడు ధర్మరాజుకు ఒక కల వచ్చింది .అందులో అక్కడి మృగాలన్నీఆయనతో ‘’మీరు నిత్యం మమ్మల్ని వేటాడుతూ చంపేస్తున్నారు మాజాతులన్నీ నశించి పోయి బీజ మాత్రంగా ఉన్నాము .కనుక మీరు వేరే చోటుకు వెళ్ళిపోతే హాయిగా ఊపిరి పీల్చుకొంటాము ‘’ఆని విన్నవించాయి .అంతే మర్నాడు ఉదయం పాండవులు ద్వైతవనం ఖాళీచేసి వేరే చోటికి వెళ్ళిపోయారు .దీనికి భారత పద్యం –‘’ద్వైత వనంబున ధర్మరాజుం డొకనాడు నిద్రి౦పగా తద్వనీ చరంబు ‘’
.భాగవతం లో బాలకృష్ణుడు గోప గోపికలతో చెట్ల గొప్పతనాన్ని గురించి వివరిస్తూ –
‘’అపకారంబు చేయ వెవ్వరికి ,నేకాంతం బుల నుండు .నా తప శీతాదుల వర్ష వారణములై ,త్వద్గంధనిర్వాసభ స్మపలాశాగ్ర కుసుమ చ్ఛాయా ఫల శ్రేణి చే –నుపకారంబులు సేయు నర్ధులకు ,నీయుర్వీజముల్ గంటిరే ‘’ఆని గొప్ప పర్యావరణ స్పృహ కల్పించాడు పోతనామాత్యుడు .
‘’భూమి నాదన్న భూమి ఫక్కున నవ్వు ‘’అన్నాడు వేమన ..కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రి౦శిక లో ‘’చింతలేని మనుజుడు లేడు .చింతకు సరి గలదే లోక చింతా మణీ ‘’అన్నాడు .సవరం చిన నారాయణ నాయకుడు కువలయాశ్వ చరిత్ర లో ‘’పక్షులను మానవ చతుర్వర్ణ వ్యవస్థత తో పోల్చాడు .గోనయామాత్యుడు ‘’సస్యానందం ‘’కావ్యమె రాశాడు .
వేదాలలో ఆకాశం తండ్రి భూమి తల్లి అంతరిక్షం కుమారుడు ఆని చెప్పి మనం ఎంత బాధ్యతతో మెలగాలో చెప్పారు .వీటిని రక్షించకపోతే మన వ్యవస్థ నాశనమౌతుంది అనిభావం .ఇంగ్లీష్ లో Rancor prime అనే రచయిత’’ వేదిక్ ఈకాలజి ‘’పుస్తకం రాశాడు .సహజ శక్తులు భగవంతుని వ్యక్తీకరణాలు వాటిని గౌరవించాలి .భూమిపై ఉన్న అందమైన వాతావరణాన్ని మనిషి కలుషితం చెయ్య కూడదు .అలెక్జాండర్ Von Humb0dt ను’’ ఈకాలజి పిత’’ అంటారు .అందుకే మానవాళ్ళు ‘’ఈశా వాస్య మిదం సర్వం యత్ క౦ చన జగతిం జగత్ ‘’ఆని నొక్కి చెప్పారు .
ఇది గాంధీ క్షేత్రం కనుక మహాత్ముడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను –జాతీయత భౌతికసరిహద్దుగా కంటే సాంస్కృతిక జాతీయత –కల్చరల్ నేషనాలిటి రావాలి ,కావాలి .
సభలో సనిదపలు –
1-దివి ఉప్పెన పై ‘’కొయ్యగుర్రం ‘’దీర్ఘ కవిత రాసి అవార్డ్ పొందిన శ్రీ నగ్నముని వేదికపై ఉండటం ఆయన మాట్లాడటం ని౦డుదనంగా ఉంది
2-శ్రీఅక్కిరాజు సుందర రామ శర్మ అద్భుత పద్య గానం తన్మయులను చేసింది .
3-30ఏళ్ళు బొబ్బిల్లపాడు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ,నాటక నటుడుగా గొప్ప పేరు పొందిన శ్రీ బొబ్బిళ్ళ సాయిగారు వృద్ధాప్యం జయించి చక్కని పంచకట్టు తో సభకు రావటం సభా గౌరవాన్ని కల్గించింది .నిండుదనాన్ని చేకూర్చింది వారు వేదికపై లేకపోవటం నిరాశ కలిగించింది .4-కవి సమ్మేళనం నిర్వహించిన శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ శిఖామణి గార్లు సార్ధకత కల్పించగా ,కవి మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నందుకు అభినందనలు .
5–శ్రీ బుద్ధ ప్రసాద్ గారి సాహిత్య రాజకీయ వారసునిగా కుమారుడు ఛి వెంకట్ రాం పరిచయ వేదిక గా కూడా సభ భాసించింది ఆని పించింది .
6-వేదికపై ఆవిష్కరింపబడిన పుస్తకాలు ,అక్కడికి వచ్చిన కవులు అందించిన పుస్తకాలనే నేను శీర్షిక లో ‘’పుస్తక సిరి ‘’అన్నాను రేపు వీటి గురించి తెలియజేస్తా .
7–సభా ప్రాంగణం లో టాయిలెట్స్ పై శ్రద్ధ వహించకపోవటం నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం, ఉన్న టాప్ లోంచి నీరు ధారాళంగా రాకుండా కొద్ది కొద్దిగా రావటం చాలా మందికి ఇబ్బంది కలిగించింది .వీటిని చెప్పుకోలేరు కదా .అయినా నేను అక్కడ ఉన్న పెన్నులు పుస్తకాల ఇంచార్జికి కంప్లెయింట్ చేయించా .
.మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-24-ఉయ్యూరు

