అభ్యుదయకవి రచయిత,పండితుడు -వట్టికోట రంగయ్య
వట్టికోట రంగయ్య 1914లో జన్మించి 19 98లో మరణించారు ఆయన పాండిత్యం నివురు కప్పిన నిప్పు .అంత పాండిట్యాం ఉండీ తెరమరుగైన పండితులు ఆంధ్ర సాహిత్య లోకంలో ఎవ్వరు లేరు నిర్దిష్టమైన భాష శైలి అభ్యుదయ భావాలు ఆయన సాహితీ పరికరాలు . ఆ పాండిత్యం ఆయన మృతితో తెరమరుగైపోయింది ఆంధ్రదేశంలో అభ్యుదయ సాహిత్య ఉద్యమం ప్రారంభకులలో ఈయన ఒకరు . 19 43 ఫిబ్రవరిలో తెనాలిలో ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘం తొలి కార్యవర్గంలో వీరు , వీరి సతీమణి విశాలాక్షి సభ్యులుగా ఉన్నారు ఈ తొలి కార్యవర్గంలో తాపీ ధర్మారావు అధ్యక్షులు. చదలవాడ పిచ్చయ్య కార్యదర్శి చాగంటి సోమయాజులు అశ్విని కుమార్ దత్తు మహీధర జగన్మోహన్రావు ప్రయాగ కోదండ రామ శాస్త్రి రాటకొండ నరసింహారెడ్డి ఎం సర్వేశ్వరరావు పత్తికొండ రంగయ్య విశాలాక్షి తాపి మోహన్రావు శెట్టి ఈశ్వరరావు ఉన్నారు
ఈ చారితరాత్మక ఉద్యమ ప్రారంభంలో ఆ కార్యవర్గం వర్గంలో దంపతులిద్దరూ ఉండటం వీధి ఘనతకు తార్కాణ ఆ రోజుల్లో వీరు ‘’ రంగ కవి ‘’ అనే పేరుతో చాలా పద్యాలు అభ్యుదయ భావ గేయాలు రాశారు. వాటిలో మధు దయం అరుణోదయం అభ్యుదయ కవి ,విప్లవ జ్వాల అభ్యుదయ గీతాలు ముఖ్యమైనవి విశాలాక్షి గారు మంచి నవలలు కథలు రాసేవారు .ఆమె నవలలు భారత నారి యుగధర్మం ఖైదీ స్వప్న భంగం నిష్కామయోగి ఆత్మబలి ప్రసిద్ధమైనది తర్వాత ఇద్దరు రాయటం మానేశారు. అలా మానకుండా ఉండి ఉంటే ఎంతో ఉత్తమ సాహిత్యం వారి ద్వారా లోకానికి అందేది .దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నివురు కప్పి ఉన్న రంగయ్య గారి పాండిత్యాన్ని చేరా , బిఎస్ఆర్ కృష్ణ కొద్దిగా బయటపెట్టారు.
రంగయ్యలోని హిందీ పాండిత్యాన్ని గురించి ఇంకా లోకానికి పెద్దగా తెలియలేదు పండితలోకల్లో వారికి రావాల్సిన గుర్తింపు లభించలేదు రెండేళ్లపాటు చెన్నైలో అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పత్రిక ‘’ కాంగ్రెస్’’ కు సంపాదకులుగా ఉండి ఆ తరువాత 1954లో గుంటూరు వెళ్లి కొన్నాళ్లపాటు ‘’ ప్రజావాణి’’ వార పత్రిక నడిపి , దానిని మూసేసి పూర్తిగా సాహిత్య రంగాన్ని వదిలి వ్యాపార రంగంలో ప్రవేశించి బాగా రాణించారు . సరదాగా ఆయనతో ‘’ మీరు సరస్వతి కి విడాకులు ఇచ్చి లక్ష్మిని చేపట్టారు’’ అని అంటే ముసి ముసి నవ్వులు మాత్రం విసిరేవారు . రంగయ్య గారు 84 వ ఏట 3-6- 1998 గుంటూరులో మరణించారు .ఈ విషయాలన్ని బి ఎస్ ఆర్ కృష్ణ తెలియచేశారు.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్- 15 10 -24- ఉయ్యూరు

