ఆత్మకూరు సంస్థాన విద్వత్ కవిశేఖరులు , అవధాని –శ్రీ కార్య (రేం )పూడి రాజమన్నారు కవి
‘’ప్రకాశం జిల్లా పేరాల గ్రామం లో శ్రీ కార్యం పూడి రాజమన్నారు కవి1846లోజన్మించారు .మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు సంస్థానం లో స్థిర పడ్డారు .చిన్నతనం లోనే ప్రసిద్ధ అవధాని శ్రీ మాడభూషి వే౦కటా చార్యుల వారి వద్ద అవధాన పద్ధతులన్నీ అవపోశన పట్టారు .
తెలుగు దేశం లో వివిధ ప్రాంతాలలో 78 అవధానాలు చేసి విస్తృత కేర్తి సంపాదించారు .బ,హు సన్మానాలు అందుకొన్నారు .ఆత్మకూరు వనపర్తి ,పిఠాపురం మొదలైన సంస్థానాలు దర్శించి జమీందారు ప్రభువులచే ఘన సన్మానాలు అందుకొన్నారు .’’వీపూరి పాలెపు వివిధావధానం ‘’,’’భగవన్నామ భాగవతం ‘’,కారంచేడు మాధవ స్వామి శతకం ‘’,’’మకర కుండల విజయం’’,మహేశ శతకం ,’’’’రాజవంశ రత్నావళి ‘’,’’శృంగార జావళీలు ‘’,’’శ్రీ కృష్ణ లీలలు ‘’,’’సమస్యా శతకం ‘’,’’హరిశ్చంద్ర శతకం ‘’,’’హేలాపురీ (ఏలూరు )కన్యకా పరమేశ్వరీ దండకం ‘’మొదలైన రచనలు చేశారు .ఆత్మకూరు సంస్థానం లో శ్రీ రాజా ముక్కండ సీతారామ భూపాలుదు ఈ అవధాన కవిని బాగా ఆదరించి గౌరవించారు.వీరు 72వ ఏట 1917లో స్వర్గస్తులయ్యారు ‘’ఆని గుంటూరుజిల్లా చిలుమూరు రూరల్ కళాశాల లెక్చరర్ శ్రీ కొలసాని శ్రీరాములు రాయకపోతే ఈ విద్వత్ కవి ,అవధాని గురించి ఎవరికీ తెలిసేదికాదు .గూగుల్ ,వికి పీడియాలో కూడా వీరి గురించి ఒక్క ముక్క కూడా లేక పోవటం విడ్డూరం. ఫోటో కూడా అలభ్యం .బహుశ అవధాన చరిత్రలో వీరి గురించి ఉందేమో ?
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-24-ఉయ్యూరు .

