గానంతో నృసి౦హస్వామిని ప్రత్యక్ష పరచిన శ్రీ మైసూర్ సదాశివరావు
శ్రీ వాలాజా బాద్ వెంకటరామయ్య శిష్యుడైన శ్రీ మైసూర్ సదాశివరావు సంగీతంలో సర్వతోముఖ పాండిత్యం సంపాదించి కృతులు తిల్లానాలు స్వరజతులు తాళవర్ణాలు పద వర్ణాలు రాశారు .సల్లక్షణ శోభితుడు .మధుర గాత్రుడు .నారసింహ ఉపాసకుడు .మైసూర్ రాజా మూడవ కృష్ణరాయలు సదాశివరావు ను ఆస్థాన విద్వా౦సుడిని చేశాడు .
ఒక రోజు సాయంత్రం మన వాగ్గేయకారుడు కమలా మనోహరి రాగం లో తాను రచించిన ‘’నరసి౦హుడుదయి౦చెనే ‘’అనే కృతిపాడమని స్నేహితులు బాగా బలవంతం చేశారు .చాలా శుచిగా పవిత్రంగా ఈ కృతిని ఆయన ఉదయం పూటనే పాడే అలవాటు ఉన్నవాడు .అందుకని ఒప్పుకోలేదు .కానీ మిత్రుల బలవంతాన్ని తప్పించుకోలేక పాడటం మొదలు పెయ్యాడు .చరణం లోని ‘’సరసిజానందము పగుల ‘’అనే వాక్యం ముగించగానే గోడకు తగిలించి ఉన్న నరసింహస్వామి పటానికి ఉన్న గ్లాస్ అకస్మాత్తుగా పగిలి నేలపై పడి అందరికి ఆశ్చర్యం కలిగింది .వెంటనే దీపాలు ఆరిపోయాయి .గాయకుడు సదాశివరావు పాట ఆపేసి స్వామికి హారతిచ్చాడు .
ఆయన అనేక పుణ్య తీర్ధాలు సందర్శించి అక్కడి దేవుళ్ళపై కీర్తనలు భైరవి ,తొడి ,మోహన ,హరికాంభోజి ,,బలహంస,అఠాణా రాగాలలో వ్రాశారు .గజానన ,ఆంజనేయ ,త్యాగరాజస్వామి లపై కూడా కృతులు రాశారు.తనప్రభువు పై పదవర్ణనలు ,తిల్లానాలు రాశారు .ఇవన్నీ ఆయన స్వర ,తాళజ్ఞానాల ను ఆవిష్కరిస్తాయి .భావ,రాగ అర్ధపుష్టితో అవి అలరారుతాయి.
ఆధారం –శ్రీ మంగిపూడి రామలింగశాస్త్రి గారి వ్యాసం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-24-ఉయ్యూరు .

