శ ర్మగారి ధర్మ శతకం

శ ర్మగారి ధర్మ శతకం
శ్రీ చెన్నాప్రగడ శర్మగారు ‘’శర్మ శతకం ‘’రాసి ఇవాళ వాట్సాప్ లో పంపి ముందు మాట రాయమని కోరారు .ఇప్పుడే  చదివి రాస్తున్నాను .’’శర్మపదమెప్పుడూ ధర్మ పథము మిత్రమా ‘’అనే మకుటంతో శర్మగారి వంద పద్యాలు రమ్యంగా ఉన్నాయి .
మొదటిపద్యంలో దసరా శోభతో కళకళ లాడుతున్న కనకదుర్గమ్మ అమ్మవారిని కరుణించి కాపాడమని వేడుకొన్నారు .పండుటాకుల వంటి ముసలి వారు పిల్లల వెలుగు రేఖలన్నారు .పెళ్ళిళ్ళ హోరులో ధనం కన్నా గుణం మిన్న ఆని గుర్తించమని కోరారు .రతన్ టాటా భారతీయ విపణి వీధి రత్నం చేతికి ఎముకలేని వదాన్యుడు అన్నారు .చిత్రసీమ విచిత్రసీమ అయి నిత్య వివాదాస్పదమౌతున్నందుకు బాధ పడ్డారు .రోడ్డు పక్క తిళ్ళు కడుపుబ్బరం తప్ప ఆరోగ్య౦ నిల్.’’సెల్ కు బాని’’సేల్’’ అయితే బతుకు బస్టా౦డే . కాలుష్యనగరం దేశరాజధాని నిత్యనరకకూపం .విమానాల బాంబు బెదిరింపులు ఆకతాయి చేష్టలు వ్యవస్థకు తీరని తిప్పలు .వృధా అరికట్టితే వ్యధ తీరుతుంది అన్నిటా .
  క్రికెట్ ఆటగాళ్ల వేలం పూర్వం బానిసల వేలాన్ని గుర్తుకు తెస్తూ వెర్రి వెర్రి తలలు వేస్తున్నందుకు వ్యధ చెందారు శర్మాజీ .వేటపాలెం గ్రంథాలయ ‘’ప్రతి పొత్తమూ దోచును చిత్తము ‘ఆని శారదా దేవికి వందనాలు ఆచరించారు  .అంతర్జాలం మంచిని పెంచే మరాళ౦ అయి పాలు నీరు వేరుచేయాలి .కాకినాడ కోటయ్య కాజాలకు నీరాజనాలు పల్కారు .ప్రయోగాల దిట్ట ఘట్టమనేని కృష్ణ ,.క్షమాపణలతోనే బంధం బలీయం అనే సూక్తి .ఓటీటీ లతో సినిమాలు ఘొల్లు .తెలుగు వారి పాటల పాఠశాల –గాన గ౦ధర్వ ఘంటసాల’’ఆని కైమోడ్పు ఘటించారు .పార్టీలు వేరైనా ‘’దండుకోటం లో అందరూ ఉద్దండ పిండాలే ‘’ఆని  చెమ్కీ దెబ్బ కొట్టారు .
‘’ మన్యం లో డోలీ మోతలు ఇంకానా ఇకపై చెల్లదు’’ఆని గిరిజనులకు బాసటగా నిలిచారు .’’ఫ్రీ వెడ్డింగ్ షూట్ ల పర్వం-మెటర్నిటి స్థాయికి ‘’దిగజారటం హేయం నీచం ఆని తలబాదుకొన్నారు రగిలిన హృదయంతో కవి .’’ఆ నలుగురినైనా సంపాదించు ‘’జీవితం లో ‘’ఆని  హెచ్చరించారు . జీవిత గాలి పటం చిరిగితే అంతా ఛిద్రమె ‘’ఆని జాగ్రత్త పడమని జీవిత సత్యం చెప్పారు .అడుగు తడబడితే నడక నరక యాతనమే .108వ చివరి పద్యంలో –‘’పది మందికి మనం చేసే సేవ –అందరికీ కావాలి అది తోవ –మంచిని పెంచుతూ స్పూర్తిని   నింపుతూ- శర్మపద మెప్పుడూ ధర్మపథం మిత్రమా ‘’  చెప్పిన మాటలన్నీ ఈ శతకం లోని సూక్తి ముక్తావళి .ధర్మ పధాన్ని శర్మ గారు ఘంటా పధంగా  మన ముందుంచి మార్గ నిర్దేశం చేశారు . ప్రతి పద్య మనోహరం శతకం .అభినదనీయులు శర్మాజీ .
గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-24-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.