ఆర్ద్రమైన ,సౌహార్ద్ర మైన శ్రీ సోమేపల్లి వారి స్మారక సంచిక –హరిత సంతకం .
శ్రీ తోటకూర వెంకట నారాయణ గౌరవ సంపాదకులుగా ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ సోమేపల్లి వశిష్ట సంపాదకులుగా ,సోమేపల్లి లిటరరీ ఫౌండేషన్ వారు ఈ డిసెంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు స్వర్గీయ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి స్మారక సంచిక వెలువరించారు . సర్వాంగ సుందరంగా ఉంది.సోమేపల్లి వారి జేవితంలోని సకల పార్శ్వాలను వివిధ రచయితలు ఆవిష్కరించి ఘన నివాళి అర్పించారు .సమగ్రమైన ,సంతృప్తికర సంచికగా చరిత్రలో మిగిలిపోయే సంచిక .ఇది అర్ధవంతమైన ముఖ చిత్రం ,హరిత నేపధ్యంలో వెంకటసుబ్బయ్య గారి సాదాగీతల చిత్రం ఆకర్షణీయంగా ఉంది .నాకు ఈ పుస్తకాన్ని నిన్న బెజవాడ తెలుగు సభలలో శ్రీ ప్రకాష్ ,వశిష్ట లు అందజేశారు .వారికీ కృతజ్ఞతలు .
సోమేపల్లి వారి మరచిపోలేని కవితలు మధ్యమధ్య ఉండటం ప్రత్యెక ఆకర్షణ .’’మట్టిలో కలిసిపోయే దాకా నాకు విశ్రాంతి లేదు .అప్పుడప్పుడు –కాస్తంత విరామం చాలు ‘’అన్న జీవిత తాత్వికుడు నిజంగానే శాశ్వతంగా దూరమయ్యారు .నూటపదహారు మంది అభిమానులు వారికి కైమోడ్పు ఘటించి వారి సహృదయతను మనసారా వెల్లడించి కృతజ్ఞత చూపారు .334 పేజీలతో ,స్కాలిత్యం లేని ముద్రణతో , ,ఒక విధంగా ఈ సంచిక ఒక’’ మినీ సోమేపల్లి సర్వస్వం.’’ఇంతటి కృషి చేసి లోకానికి అందజేసిన వారందరికి అభి నందనలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-12-24-ఉయ్యూరు .

