మనం మర్చి పోయిన అలనాటి మద్రాస్ రెసిడెన్సి తెలుగు మహానుభావుల సాంఘిక,మత సంస్కరణ కృషి -2(చివరి భాగం )
2-శ్రీ చదలు వాడ అనంత రామ శాస్త్రి (1835-1872)
నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీ చదలు వాడ అనంత రామ శాస్త్రి పుదూరు ద్రావిడ బ్రాహ్మణుడు .అన్న సీతారామ శాస్త్రి మద్రాస్ ప్రేసిడేన్సి కళాశాల తెలుగు పండితులు .వీరిద్దరూ వ్హిన్నాయన శాస్త్రి ,పెదనాయన శాస్త్రి గా పిలువబడే వారు అనంతరామ శాస్త్రి ‘’సకల కళా కోవిద ‘’అల్లాడి రామ బ్రహ్మ శాస్త్రి గారి వద్ద శాస్త్రాలు అభ్యసించాడు .పండిత గోష్టులలో ,చర్చలలో పాల్గొని కీర్తి ప్రతిష్టలుసాధించారు .వేంకటగిరి ఆస్థానం లో ఆస్థాన పండితుడు తర్కభూషణం వెంకటాచార్యులను ఓడించి ,సంస్థానాధిపతి సర్వజ్ఞ కుమారునికి అద్వైతం బోధించినట్లు ప్రచారం లో ఉంది.’’పరమ హంస ,చిదానంద యోగి ,గతాగత వేది ,,సాహిత్య చక్రవర్తి , సాంగో పాధ్యాయ ‘’అంటూ హిందూ బాంధవి పత్రిక ,శాస్త్రి గారు మరణించిన 80ఏళ్ల తర్వాత ప్రస్తుతించింది .శ్స్స్త్రి గారు చివరి దశలో సన్యాసం స్వీకరించారని ,శాస్త్రాలను లెక్క చేయకుండా అస్పృశ్యుల ఇళ్లలో భోజనం చేసే వారు ఆని అంటారు .అనంతరామ శాస్త్రి గారు 32వ ఏట 1872 ప్రాంతాలలో అనంతలోకాలకు చేరినట్లు ఒంగోలు వెంకట రంగయ్య గారు చెప్పారు .
వివాహ కన్యా స్వరూప నిరూపణం -1928 లో ‘’దేశీయ సంస్కరణ సభ ‘’వారి అభ్యర్ధనతో ఒంగోలు వెంకటరంగయ్య గారు ఈ పుస్తకాన్ని తెలుగులోకి సంగ్రహం గా అనువాదం చేశారు .1860,శిక్షాస్మృతి సెక్షన్ 375ప్రకారం పదేళ్ళ ఆడపిల్లలకు పెళ్ళి చేయవచ్చు .దీన్ని కేశవ చంద్ర సేన్ వ్యతిరేకించాడు .కేశవ చంద్ర సేన్ ప్రచారం మద్రాస ప్రేసిదేన్సిలో కూడా వ్యాపించి ఉండాలి .ఆని పుస్తక నేపధ్యాన్ని వెంకటరంగయ్య చెప్పాడు .సుందర లింగం కూడా ఇదే అభిప్రాయాన్ని బలపరచాడు . వివాహ కన్యా స్వరూప నిరూపణం 1866లో శ్రీ రామా దర్పణ ముద్రాక్షర శాలలో అచ్చయినట్లు రంగయ్య చెప్పాడు .కానీ 1865ఆగస్ట్ 3 నాటికే ఈపుస్తకం ప్రచారం లో ఉండి ఉండాలి .అనంతరామ శాస్త్రి మనుస్మ్రుతిని ప్రమాణం గా చేసుకొని రజస్వలానంతర వివాహాలు సమర్ధించారు .మనుస్మ్రుతికి విరుద్ధంగా ఉన్న పరాశర స్మృతి ,వైద్యనాధ స్మృతులను,ఇతర శాస్త్ర గ్రంధాలను ప్రమాణంగా తీసుకోనక్కర లేదని శాస్త్రి తీర్మానించారు .నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది ,ఇందులో స్త్రీలకూ ఎంతో ప్రాధాన్యం ఉండి .కనుక వివాహానికి యోగ్యమైన స్త్రీ లక్షణాలు తెలుసుకోవాలి .స్త్రీ రూపం లో అప్పుడు అరుగుతున్న బాల్యవివాహాలకు మనుసృతి ఇతర శాస్త్రాల అనుమతి లేదు.కనుక బాలికాలు ‘’ఈడేరిన ‘’తర్వాతే వివాహం చేయాలని శాస్త్రి గారు గట్టిగా చెప్పారు .లౌకిక దృష్టిలో చూసినా ,బాల్యవివాహాలు అన్యాయం అన్నారు ఆయన .’’చంటి పాపాల వయసులో జరుగుతున్నా ఈ వివాహాలు ఈలోకం నుంచి తొలగిపోవాలి ‘’ఆని ఆకాక్షించారు శాస్త్రి .శాస్త్రిగారు ఈ పుస్తకాన్ని కంచి కామకోటి పీఠం అధిపతి శ్రీ శ్రీమన్మహాదేవేంద్ర శ్రీ సరస్వతీ పాదులకు ‘’అభి ప్రాయం రాయమని కోరుతూ పంపినట్లు శాస్త్రి గారు పీఠిక లో పేర్కొన్నారు .
3-శ్రీ గుర్రం వెంకన్న శాస్త్రి (1825-1880)-
కంచి పీఠాధిపతి అనంతరామ శాస్త్రి పుస్తకాన్ని తిరస్కరిస్తూ ,బాల్యవివాహాలను సమర్ధిస్తూ ఖండన గ్రంధాలు రాయమని పండితులను కవులను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది .విరించి నగర వాస్తవ్యులు అనారట ధర్మశాస్త్ర పాఠకులు , సముత్తెజితప్రజ్ఞులు శ్రీరామ శాస్త్రి అనంతరామ శాస్త్రి పుస్తకాన్ని ఖండిస్తూ ఒక పుస్తకం రాసి పీఠాదిపతులకు పంపారు .శ్రీ గుర్రం వెంకన్న శాస్త్రి ‘’సిద్ధాంత సిద్దా౦జనమ్ ‘’పుస్తకం రాసి దానికే ‘’వాద ప్రహసనం ‘’అనే పేరు తగిలించి వెలువరించారు .వెంకన్నశాస్త్రి నెల్లూరు వాసి .రామ శాస్త్రి కుమారుడు .వెంకన్న అన్న మద్రాస్ హై కోర్ట్ లో ‘’హిందూ లా ‘’పండితుడు .హిందూ ధర్మశాస్త్రంలో అధారిటి గా పేరు పొందాడు .వెంకన్న తన ప్రతిభా,పాండిత్య సామర్ధ్యాన్ని వాదప్రహసనం లో విపులంగా రాసుకొన్నాడు .ఈయన మంచి హాస్యప్రియుడని ,హాస్యం ఉట్టిపడే శ్లోకాలు అలవోకగా చెప్పేవాడని ‘’వికటకవి ‘’గా ప్రఖ్యాతుడని ఆయన వంశం వారు చెప్పారు .’’చతుషష్టి కళాత్మక ‘’ఆలంకారిక సార్వ భౌమ ‘’అనే బిరుదులున్నాయి .మన నరసయ్య వెంకన్న శాస్త్రిని ‘’మై డియర్ బ్రదర్ ఇన్ లా ‘’ఆని చెప్పేవాడు .అయితే ఆ బంధుత్వం ఏమిటో తెలియదు .అన౦తరామ శాస్త్రి ,వెంకన్న శాస్త్రిల పుస్తకాలపై కంచి పీఠంలో పీఠాధిపతి సమక్షంలో వాద ప్రతివాదాలు కొంతకాలం జరిగి ఎటూ తేలకుండా ముగిశాయి .
4-దంపూరు నరసయ్య
17ఏళ్ల వయసున్న మన దంపూరు నరసయ్య మద్రాస్ పచ్చయప్ప కాలేజిలో అసిస్టెంట్ టీచర్ ఉద్యోగం చేస్తూ ‘’లెటర్స్ ఆన్ హిందూ మారేజేస్ ‘’అనే పుస్తకం రాసి ప్రచురించాడు .దీన్ని తెలుగులో బాగా ప్రచారం లోకి తెచ్చినవాడు బంగోరె అనే బండిగోపాలరెడ్డి .నరసయ్య ఆరు లేఖలు ఆనాటి ప్రభుత్వానికి రాశాడు అందులో బాల్యవివాహాలు శాస్త్ర సమ్మతం కాదు ఆని తన అభిప్రాయాన్ని నిర్మోహ మాటంగా తెలిపాడు .రంగనాధ శాస్త్రి వెంకన్న శాస్త్రిల వాడ ప్రతివాదాలపై సమీక్ష రాశాడు .అర్హుడైన వరుడిని ఎంచుకోవతమేకాడు వివాహ యోగ్యమైన వయసునూ ఎంచుకోవాలనిస్త్రీలకు విజ్ఞప్తి చేశాడు .వితంతు పునర్వివాహాన్ని రద్దు చేయటం వలన వ్యభిచారం పెరిగింది అన్నాడు .
అలా ‘’ఆ నలుగురు ‘’హిందూ మత సాంఘిక సంస్కరణలకోసం మద్రాస్ రెసిడెన్సి లో తీవ్ర కృషి చేశారు .నరసయ్య రాయకపోతే మనకుఈవిషయాలు తెలిసేవికావు .శ్రీ కాళిదాసు పురుషోత్తం దంపూరు నరసయ్యపై పుస్తకం రాయక పోయి ఉంటే అసలు ఇవి బయట పడేవే కావు .
ఆధారం –డా .కాళిదాసు పురుషోత్తం గారి’’ఇంగ్లిష్ జర్నలిజం లో తొలి వెలుగు దంపూరు నరసయ్య ‘’పుస్తకం.
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-25-ఉయ్యూరు .

