తెలుగు హాస్యతె రచనలు చేసిన సంస్కృతాంధ్ర ,హిందీ పండితుడు,అధ్యాపకులు -శ్రీ ముట్నూరి సంగమేశం గారు- 1
25-4-1919 న శ్రీకాకుళం జిల్లా ‘’వంతారం ‘’లొ శ్రీ ముట్నూరి సంగమేశం గారు జన్మించారు .చీపురుపల్లి దగ్గర ‘’గులి వింద ‘’అగ్రహారం లొ స్థిరపడ్డారు .తెలుగులో హాస్యరచనపై ప్రత్యెక కృషి చేశారు .వివిధ పత్రికలలో అనేక హాస్య రచనలు చేశారు .1953లొ సంగమేశం గారి హాస్యరచనకు ‘’తెలుగు భాషాసమితి ‘’పురస్కారం పొందారు .జన సామాన్యం లోని జానపద కళారూపాలపై ఎంతో గొప్ప కృషి చేశారు .అభిమన్యుడు -పద్మ వ్యూహం అనే రచన శ్రీ కొండి రామం గారితో కలిసి చేశారు.శ్రీసాలా కృష్ణ మూర్తి గారితో కలిసి మరికొన్ని రచనలు చేశారు .వివిధ పత్రికలకు అనేక వ్యాసాలూ రాశారు .ఆని శ్రీ కొర్రపాటి శ్రీరామ మూర్తిగారు రాశారు .
శ్రీ ముట్నూరి సంగమేశం గారి కుమారుడు శ్రీ ముట్నూరి అన్నాజీ రావు -‘’మా నాన్న గారి జీవిత విశేషాలు ‘’అనే పుస్తం రాశారు .ఇందులోని విశేషాలు –
‘’అష్ట భాషా విశారదు డద్భుతా-వ్యయామృత రస ఝరీ ,నృత్యహావ భావ -విన్యాసన నైపుణీవచో విభవ శోభి -తుండు, సంగమేశ్వర శర్మ నిండు సభల ‘’ఆని మహావిద్వాన్ శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ అన్నారు .హిందీ గ్రంథ రచన పోటీలలో ముట్నూరి వారికి రాష్ట్రపతి ప్రధమ బహుమతి వచ్చిన సందర్భం లొ జరిగిన సన్మాన సభలో డా.మన్నవ భాస్కరనాయుడు ‘’శర్మగారు సర్వతోముఖ ప్రతిభ సంపన్నులు .సాహిత్య విమర్శలో వీరిది స్వతంత్ర విధానం .తిరుపతిలో శర్మగారు లేని సాహిత్య గోష్టి లేనే లేదు .ఆరితేరిన అష్టావధాన శతావదానులకు వీరు పృచ్చకులుగా ఉన్నారు .మరో సభలో ‘’సంగమేశం గారు సూర్ ,తులసీ దాస్ సాహిత్యాలను ఆపోసన పట్టిన సాహితీ సుధా పరిపూర్ణులు . .రసహృదయులు ,సహృదయులు .శ్రీ ఎ హనుమచ్చాస్త్రి గారి ద్వారా నాకు పరిచయమయ్యారు’’అన్నారు . నృసింహ జయంతి పర్వదినం నాడు25-4-1919 వైశాఖ శుద్ధ చతుర్దశి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకొండాపురం అగ్రహారం వంతరాం గ్రామం లొ జన్మించారు .శ్రీ అన్నప్ప వజ్ఝులు తండ్రి .శ్రీమతి సూరమ్మ గారు తల్లి .ఇంటిపేరు ముట్నూరు .ఆయను తమ్ములు ముగ్గురు ,ముగ్గురు చెల్లెళ్ళు .ఆయన తాతగారు ఉపాధ్యాయ వృత్తి చేస్తూ పౌరాణికులుగా ప్రసిద్ధి చెందారు .ఈవిషయం ఆయన తమ్ముడు ఒక పద్యంలో చెప్పాడు -‘’చీపురుపల్లె మా కాపురస్తలమాంధ్ర సంసృత భాషా విశారడుండు -పౌరాణికుండును,భరత శాస్త్రజ్నుండు న ధ్యాపకుడు నగు -నన్న పార్యు- పుత్రుడ ,నా పిత్రువ్యులు మేటి భరత -శాస్త్రజ్నులైదుగురు ధర్మ శాస్త్ర -నిధియు మృదంగ వాద్య ధురీణుడగు సంగ – నార్యుని పౌత్రు౦డనద్వితీయ ప్రతిభాశాలి ,భవ్య బుద్ధి -యైన సంగమేశ్వరుని యవరజుండ-సంసృతాన్ధ్రము లొక్కింత చదివినాడ -నవని సూర్యనారాయణుడండ్రు నన్ను ‘’ .
సంగమేశం గారి విద్యాభ్యాసం
చీపురుపల్లిలో ప్రాధమిక విద్య అయ్యాక ,విజయనగరం మహారాజా కాలేజి హైస్కూల్ లొ ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదివి ,భీముని పట్నం లొ ప్రభుత్వ టీచర్ ట్రెయినింగ్ స్కూల్ శిక్షణ పూర్తి చేసి ,అధ్యాపక వృత్తీ చేబట్టారు .అది స్వాతంత్రోద్యమాలం కాలం కనుక రాజభాష హిందీ తానూ నేర్చి ,భాషా ప్రచారం చేయాలనే తలంపుతో మద్రాస్ లోని దక్షిణ హిందీ ప్రచార సభ వారి ప్రాధమిక మధ్యమ ,రాష్ట్రభాష ,ప్రవేశిక ,విశారద పూర్వ,ఉత్తరార్ధ పరిక్షలు రాసి పాసై ,అలహాబాద్ వారి ‘’సాహిత్యరత్న ‘’ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు .ఆయన ఉన్నత విద్యాభ్యాసం అంతా స్వయంగానే కొనసాగటం విశేషం .
ఆంధ్రా యూనివర్సిటి ఇంటర్ డిగ్రీ ,బెనారస్ హిందూ యూనివర్సిటి వారి ఎం.ఎ పరీక్ష సెకండ్ క్లాస్ లొ పాసయ్యారు .శ్రీ వేంకటేశ్వర యూని వర్సిటి నుంచి డాక్టరేట్ ,,భాగల్పూర్ యూని వర్సిటి నుంచి డిలట్ కూడా పొందారు .అయన సహా ఉద్యోగి మిత్రుడు దా.ఎస్ టి నరసింహా చార్య ‘’సంగమేశం సదా విద్యార్ధి .నైష్టికుడు .ఆయన విమర్శ బహు నిష్టతో కూడినది ‘’అన్నారు .
ఉద్యోగం
విశాఖ పురపాలక ఉన్నత పాఠశాలలో 1951 వరకు గ్రేడ్ వన్ హిందీ పండిట్ గా పని చెసి ,1951-57ఆగస్ట్ వరకు మంగుళూరు ,మద్రాస్ ప్రభుత్వ కాలేజి లలో హిందీ లెక్చరర్ గా ,1957నుంచి 1976వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూని వర్సిటి లొ హిందీ శాఖలో ప్రధాన ఆచార్యుడుగా పని చేశారు .తర్వాత యుజిసి వారు అందించిన గౌరవ వేతనం తో 1980 వరకు పరిశోధకులు గా ఉన్నారు .
1960లొ తిరుపతిలో హిందీ ప్రేమీ మండలి స్థాపించి,మద్రాస్ హైదరాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు నిర్వహించే హిందీపరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత బోధనా చేశారు .
విద్యా సేవలు
మెట్రిక్ నుంచి ఎం ఎ వరకు పరీక్షలకు పరీక్షాధికారి గా ఉన్నారు .పాఠ్యపుస్తక కమిటీ లొ పాఠ్యపుస్తక మండలం లొ విశ్వ విద్యాలయం బోర్డ్ ఆఫ్ సర్వీస్ లొ పని చేశారు .హైస్కూల్ హిందీ పుస్తకాలు రాశారు .ఆకాశ వాణి లొ పలు ప్రసంగాలు చేశారు .ఎన్నో సాహితీ సమావేశాలలో పాల్గొన్నారు .కలకత్తాలోని ‘’భారతీయ జ్ఞానపీఠ’’సంస్థకు సలహాదారు .ఢిల్లీ సాహిత్య అకాడేమికి అనువాదకులు ..సాహిత్య నాట్య సంగీత జ్యోతిష విషయాలపై తెలుగు ,కన్నడ ,హిందీ ఇంగ్లీష్ లలో ఎన్నెన్నో వ్యాసాలు రాశారు .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-25-ఉయ్యూరు

