తెలుగు హాస్య రచనలు చేసిన సంస్కృతాంధ్ర ,హిందీ పండితుడు,అధ్యాపకులు -శ్రీ ముట్నూరి సంగమేశం గారు- 2(చివరి భాగం )
ప్రముఖులతో పరిచయం
శ్రీ ముట్నూరి సంగమేశం గారీకి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం డా దివాకర్ల వెంక వెంకటావధాని శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ,ఆచార్య రాయప్రోలు సుబ్బారావు ,శ్రీ కోరాడ రామ కృష్ణయ్య ,డా.నిడదవోలు వెంకటరావు గార్లతో చాలా సన్నిహిత పరిచయం ఉంది.డా.సాళ్వ కృష్ణమూర్తి గారితో కలిసి మద్రాస్ లొ భారతి పత్రికలో భామా కలాపం పై చాలా వ్యాసాలూ రాశారు .తిరుపతిలోని పండిత ప్రకా౦డులతోనూ అలాగే గొప్ప స్నేహం ఉండేది .
రచనా సంపన్నత
సప్తగిరి అనే తిరుపతి దేవస్థానం మాసపత్రికలో అనెక హిందీ తెలుగు వ్యాసాలూ రాశారు సంగమేశం గారు రాసిన ‘’తెలుగు హాస్యం ‘’గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ పుస్తకం గ 1952లొ గుర్తించి పురస్కారం అందించింది .’’సాహిత్యాచార్య ముట్నూరి సంగమేశం గారు అత్యుత్తమ సమీక్ష చేశారు .దీనికి బహుమతినిచ్చిన భాషా సమితిని ప్రశంసిస్తున్నాను ‘’అన్నారు హైదరాబాద్ ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ పరిజాల హనుమంతరావు గారు .డా. రాయప్రోలు సుబ్బారావు గారు భవభూతి ఉత్తర రామ చరిత్రను ఆంధ్రీకరించి వెలువరిస్తూ ‘’’’మూడు భాషలలో అంద చందాలు తెలిసిన ‘’శాణికుడు ‘’సంగమేశ్వర రావు గారు చదివి మెచ్చటం నా కృషికి గొప్ప బహుమతి ‘’అన్నారు ఆంగ్ల ఉపన్యాసకులు శ్రీ ఆర్ జయంతా గారు సంగమేశం గారు సాహిత్య సమితి వ్యాసావళిలో రాసిన ‘’గాదా సప్తశతి ‘’వ్యాసం ఎంతోబాగున్నదని ఎన్నెన్నో విషయాలు చర్చించారని శ్రీమాన్ రాళ్ళపల్లి వారు మెచ్చారు ;కృష్ణ కర్ణామృతం వ్యాసం రాశారు ఆతర్వాత శ్రీ మల్లం పల్లి శరభయ్యగారు కూడా రాశారు .బెంగుళూరు యూనివర్సిటి తెలుగు శాఖ అధ్యక్షులు డా తంగిరాల వెంకట సుబ్బారావు గారు సంగమేశంగారి కర్ణామృత వ్యాసంలో చాలా భాగం విమర్శకోసం తీసుకొన్నారు .లీలాశుక బిల్వమంగళుడు తెలుగు వాడే ఆని తెలియ జేసిన సంగామేశంగారిని అభినందించారు
హిందీ రచయిత శ్రీ జయశంకర ప్రసాద్ ‘’కామాయిని నవల ను అనువదించారు .అవధానాలలో శర్మగారికి నిషిద్ధాక్షరి ఇష్టమైన అంశం.
సత్కార సన్మానాలు
సంగమేశంగారు రాసిన ‘’వేదవాజ్మయం ‘’గ్రంధాన్ని మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ .టి .రామారావు ఆవిష్కరించి సన్మానించారు .తిరుపతి కేంద్రీయ విద్యాపీఠం ఘనంగా సన్మానించింది .8-5-2001అన్నమాచార్య 593జయంతినాడు వీరి ఉపన్యాసానికి ఫల పుష్ప స్వామి ప్రసాదాలతో ,వెండి డాలర్ తో ఘన సత్కారం పొందారు విశాఖ అభినయ ఆర్ట్స్ ,తిరుపతి తిమ్మా వజ్ఝల కోదండరామయ్య మిత్రమండలి వారు సన్మానించారు శ్రీ వెంకటేశ్వర రసజ్ఞ సమాఖ్య కూడా సత్కరించింది తిరుపతి భారతీయ విద్యాభవన్ ‘’జ్యోతిష భారతీ ‘’సమితిలో గౌరవ నిర్దేశికులుగా నియమించి సన్మానించింది .దీనికి పాఠ్యావలి కూడా సంగమేశంగారితో రాయించారు ..వీరి తెలుగు హాస్యం పుస్తకానికి హైదరాబాద్ తెలుగుభాషా సమితి 500రూపాయలు నగదుకానుకనిచ్చి సత్కరించింది .ప్రచురించింది కూడా .ఢిల్లీ సాహిత్యఅకాడమి వీరితో శ్రీ మోతీ చంద్ హిందీలో రాసిన ‘’సార్ద వాహులు ‘’నవలను ఆంధ్రీకరింప జేశారు .ఇది అత్యుత్తమ అనువాద గ్రంధంగా గుర్తింపబడి వెయ్యి రూపాయల నగదు పురస్కారం పొందింది .భారత మానవ వనరుల శాఖ పెట్టిన హిందీ గ్రంథరచన పోటీలో సంగమేశం గారి ‘’గోదా పరిణయం 1978-79 కు 25000 నగదు బహుమతి పొందారు .చిన్న కధ -వికాసం ,అన్నమయ్య పుస్తకాలకు కూడా బహుమతులు పొందారు .
హిందీలో బాల భగవద్గిఇతే వెంకటేశ్వర సుప్రభాతం ,గోదాపరినయం మొదలైన 18పుస్తకాలు ,తెలుగులో తెలుగు హాస్యం ,వేద వాజ్మయం దాక్షిణాత్య నాట్యం అన్నమయ్య సాహితీ కౌముది ,వాల్మీం లొ శాపాలు వరాలు , నాటకం లొ హాస్యం ,తెలుగు సాహిత్యంలో నాట్యకళా ప్రస్తావనలు మొదలైన 15గ్రంధాలు రాశారు .హిందీ వ్యాసాలూ 24,తెలుగు వ్యాసాలూ 36,ఇంగ్లీష్ వ్యాసాలూ 5రాశారు .రామాయణ రహస్యాలు భాగవత రహస్యాలు వంటి 12గ్రంధాలకు గొప్ప సమీక్షలు రాశారు
సంగమేశంగారికి నాటక నృత్యాలలోనే కాక చదరంగం లోనూ గొప్ప ప్రావీణ్యం ఉంది.
ఇన్ని విషయాలు సంగమేశంగారి అబ్బాయి శ్రీ ముట్నూరి అన్నాజీ రావు గారు ‘’మానాన్న గారి జీవిత విశేషాలు ‘’రాయక పోయి ఉంటే ఆ మహామహుని గురించి మనకు అస్సలు తెలిసి ఉండేదికాదు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -7-2-25-ఉయ్యూరు

