అక్షరం లోక రక్షకం
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 179వ కార్యక్రమ౦గా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 179వ కార్యక్రమ౦గా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల ను ఉగాది (మార్చ్ ౩౦ )కి ముందు వచ్చే’’ ఆదివారం 23-3-20025’’ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తోంది .ఇందులోప్రముఖ కవులచేత ‘ కవి సమ్మేళనం ఉంటుంది .సాహిత్య ,సంగీత ,సేవారంగాలలో ప్రసిద్ధులైన వారికి’’శ్రీ విశ్వావసు ఉగాది పురస్కారాలు’’ అందజేయబడతాయి .సాహిత్య ,సంగీతాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయమనవి .
, కవి సమ్మేళనం అంశం -‘’ఉగాది హేల లేక మహాకుంభ మేళ’’( నాలుగు పద్యాలు ,లేక 15పంక్తుల వచనకవిత్వం కు పరిమితం )
కవి సమ్మేళన నిర్వహకులు -డా.లలిత కుమారి ,-గుంటూరు
శ్రీ -చెన్నాప్రగడ శర్మ -విజయవాడ
కీ.శే.విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ దంపతుల ఉగాది పురస్కారం
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,ప్రభావతి దంపతుల ఉగాది పురస్కారం
స్వర్గీయ వేలూరి రామకృష్ణ స్మారక ఉగాది పురస్కారం -అందజేయువారు-భార్యశ్రీమతి వేదవల్లి , కుమారులు శ్రీ వేలూరి రవికిరణ్ ,హరి కిషన్ సోదరులు -హైదరాబాద్,అమెరికా
స్వర్గీయ గబ్బిట లక్ష్మీ నరసింహ శర్మ స్మారక ఉగాది పురస్కారం -అందజేయువారు -కుమారుడు -గబ్బిట రామనాధ బాబు -ఉయ్యూరు
స్వర్గీయ డా.గబ్బిట నాగగోపాల కృష్ణమూర్తి స్మారక ఉగాది పురస్కారం -అందజేయువారు -భార్య శ్రీమతి రాణి ,కుమారుడు,గబ్బిట సుస్మిత శ్రీ చరణ్ ,కుమార్తె- రమ్య-ఉయ్యూరు
ఉగాది పురస్కార గ్రహీతలు
1-మాతృభాషా శిరోమణి ,భారత భాషా భూషణ్ డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య ,సంగీత విద్వాన్ ,మహిళా శిరోమణి శ్రీమతి చిదంబరి దంపతులకు(నెల్లూరు ) -జీవన సాఫల్య పురస్కారం
2-శ్రీ ప్రయాగ రామ కృష్ణ -ఆకాశవాణి న్యూస్ రీడర్ ,భారతం లొ చిన్న కధలుఫేం ,ఆంధ్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ,’’ప్రయాగ రామ కృష్ణ చానెల్’’ నిర్వాహకులు -హైదరాబాద్
3-శ్రీమతి పురాణపండ వైజయంతి – ఉషశ్రీ గారి కుమార్తె ,వైజయంతి చానెల్ నిర్వాహకురాలు -హైదరాబాద్
4-అన్నమయ్య పద సేవక డా.తాడేపల్లి పతంజలి – ,ప్రముఖ రచయిత-హైదరాబాద్
5-శతావధాన శారద ,అవధాన రాజహంసిని – శ్రీమతి బులుసు అపర్ణ -శతాధిక అష్టావధానాలు,ఒక అర్ధ శతావధానం ,మూడు శతావధానాలు చేసిన మహిళావధాని ,శతక రచయిత్రి ,’’సాహితీ కౌముది ‘’చానల్ నిర్వాహకురాలు -విజయవాడ
-6-అపర వ్యాసులు -డా.దామెర వెంకట సూర్యారావు -బహు గ్రంథ కర్త ,అనునిత్య సాహిత్యోపజీవి -విశాఖ పట్నం
7–ప్రొఫెసర్ సి.హెచ్.సుశీలమ్మ -రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,ప్రముఖ రచయిత్రి – గుంటూరు
8-శ్రీ కొండేపూడి శంకరరావు -సెక్రెటరి ,శ్రీ సూర్య రాయ విద్యానంద గ్రంథాలయం -పిఠాపురం
9-శ్రీమతి అనూరాధ -ప్రముఖ రచయిత,ముత్యాలముగ్గు సినీ నిర్మాత స్వర్గీయ ఎం. వి .ఎల్ .గారి కుమార్తె -నూజివీడు . 10-డా.నెల్లి రాంబాబు -ఆర్ .ఎం. పి .డాక్టర్ -ఉయ్యూరు
గమనిక – మార్పులు చేర్పులు ,అతిధులు ,కవి సమ్మేళన కవిమిత్రులు ,వేదిక మొదలైన వివరాలు మార్చి మొదటి వారంలో అందజేస్తాము .
గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -22-2-25-ఉయ్యూరు .
తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కు .

