వారణాశి సోదరుల గగన గంగా సాహితీ లహరి

వారణాశి సోదరుల గగన గంగా సాహితీ లహరి

వారణాశి సాహితీ వారధి గా వారణాశి సోదరులు గలగల అనుక్షణం పారే గంగ గా,శ్రీనివాసు, యమున గ శ్రీ వెంకట కృష్ణమూర్తి ,  ,కనిపించీ కనిపించకుండా ,నవ్వీ నవ్వకుండా ఉండే అంతర్వాహిని సరస్వతి గా శ్రీ ఫణి అంటే సోదరత్రయం త్రివేణీ సంగమంగా  మహా కుంభ మేళ అనంతరం  వెలువరించి ,నిన్న ఉయ్యూరులో సరసభారతి శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలలో తమకు సహకారంఅంద జేసిన శ్రీ ప్రయాగ రామ కృష్ణ  చేత ఆవిష్కరింప జేశారు .తమ తలిదండ్రులకు అంకితమిచ్చి ఋణం తీర్చుకొన్నారు .గ్లేజింగ్ కలర్ పేపర్ పై జిగేల్ అక్షరాలతో మహా సుందరంగా ఉంది సంకలనం .

 ఇంతకీ ఇందులో ఏముంది ?2022,23 ,24 సంవత్సరాలలో దీపావళికి సింగిల్ పేజీ కదల పోటీ పెట్టి ప్రధమ ,ద్వితీయ, తృతీయ  బహుమతి పొందిన కధలున్నాయి . ,ఇందులో శ్రీ చలపాక రాసిన కధ సంకలనానికివన్నె తెచ్చింది .అత్తామామల్ని సుఖ పెట్టాలనుకొనే కోడలు రేపటి వెలుగు .దూడ కోసం  తల్ల డిల్లె ఆవు ,అమ్మకోసం తల్లడిల్లే కూతురు సాద్రుశ్యంగా అమ్మా ఆవు బాగుంది .మతాలకు అతీతమైన ఆత్మీయత కంటిలో నీరు తెప్పిస్తుంది పవిత్ర హృదయాలకు .చేతికర్ర కన్నా కొడుకు చేతిఊతం ఆవాలి ముదుసలులకు ఆని చెప్పినదే చేతికర్ర .అక్క  గుండె చాటు ప్రేమ కు ఫిదా అయిన తమ్ముడు .బక్క పానాలను ఆదుకోవాలి సెల్ సోదిలో పడి ఆడుకోరాదు   .అదొక్కటే లేదు అన్న దురాశ దుఖానికి కారణం .ఉపాధ్యాయ దినోత్సవానికి సార్ధకత చెప్పే కత. కధ కారాదు అనే తండ్రి ఆత్మహత్య .ప్రేమకు బానిస అయిన మహిళ మానవత్వ పరిమళ శోభిత ఆని చలపాక ప్రకాష్ చెప్పారు .

  కధలలో వైవిధ్యం ఉంది సామాజిక స్పృహ ఉంది బరువు బాధ్యత గుర్తింపు ఉంది .జీవన విధానం లొ ఆచరణాత్మక విధానమూ ఉన్నది .సుత్తి లేకుండా సూటిగా చెప్పిన విధానమూ ఉండి నచ్చింది .అన్నీ కదా మణి దీపాలే .వారణాసి సోదర త్రయానికి అభినందనలు .మూడేళ్ళ తర్వాత అయినా ,సుఖ ప్రసవమే జరిగింది .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-25-

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.