అరుదైన ఆంధ్ర’’ విజయనగర శైలి’’ చిత్ర కారుడు -శ్రీ సి .ఎన్ .వెంకట రావు
శ్రీ వెంకటరావు ఔచిత్యం తెలిసి ,రస భావాలకు అనుగుణంగా రంగులు మేళ వించటం లొ సిద్ధ హస్తుడు .1885లొ జన్మించి 1940లొ 55ఏళ్లకే మరణించాడు .ఆయనకు సాటిరాగల చిత్ర కారుడు అరుదు .ఆయన ఊహా శక్తి అమోఘమైనది ,విశాలమైనది .చిత్రాలలో వైవిధ్యం ఎక్కువ .ఈయనది ‘’విజయ నగర శైలి’’ .రేఖలలో జీవకళ ఉట్టి పడుతుంది .హరిహరులు ,శ్రీరామ పట్టాభిషేకం ,కురుక్షేత్రం ,తత్పరత ,శాంతిపుష్పం ,కాపు పడుచు చిత్రాలు ఆయన సృజన శీలత్వానికి దర్పణాలు .పెనుగొండలో ‘’విజయనగర చిత్ర శాల ‘’నెలకొల్పి యువకులనేకమందికి చిత్రకళ నేర్పారు .షడ్భాషా పండితుడు వెంకటరావు .
ఆధారం -శోభనాచల
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-25-ఉయ్యూరు .
