గంగా ప్రవాహ వాయులీన చిచ్చర పిడుగు ,అపర కరైక్కూడి వైద్యనాథన్ -కుమారి గంగా శశిధరన్
కుమారి గంగా శశిధరన్ 14 ఫిబ్రవరి 2007న జన్మించింది .. ఆమె కేరళకు చెందిన యువ ప్రతిభావంత వయోలిన్ విద్వాంసురాలు. ఆమె దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ సంగీతం అయిన కర్ణాటక సంగీతం యొక్క మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. నాలుగు సంవత్సరాల వయస్సులో, గంగ తన గురువైన విద్వాన్ C.S.ని కలుసుకుంది. ఆమె అనుగ్రహ నుండి వయోలిన్ నేర్చుకోవడం ప్రారంభించింది, ఆమె ప్రఖ్యాత వయోలిన్ మరియు ఉపాధ్యాయురాలు. ఆమె అనురూప్ C S శిష్యురాలు.
కర్నాటక సంగీతం తొ పాటు సినీ గీతాలుకూడా అద్భుతంగా ,అలవోకగా ,మంచి ముఖభంగిమలతో,అనాయాసంగా వాయించే మహా నేర్పు గంగా శశిధరన్ కు ఉంది.మహామహా సహకార వాద్యకారులకు సవాల్ విసురుతున్నట్లుగా సాగే ఆమె వాయులీనం లొ మనసు ,తనువూ లీనమై మనం అనిమిషులం అవాల్సిందే .భగవంతుడు ,సంగీత సరస్స్వతి ఆమెకు కీర్తి ,కనకాలను వర్షించాలని కోరుతున్నాను .అనితర సాధ్యమైన ఆమె నైపుణ్యం అమితాశ్చర్యం కలిగిస్తుంది సంగీత ప్రియులకు .ఆరుదైన కౌశల్యం ఆమెది .ఆ చిన్నారికి మనసారా అభినందనలు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్-2-4-25-ఉయ్యూరు —

