చిత్ర కళా చరితార్ధుడు -శ్రీ వేటూరి హరిశ్చంద్ర శర్మ
చిత్ర మర్మాలు అవపోసన పట్టిన శ్రీ వేటూరి హరిశ్చంద్ర శర్మ చిత్రకళోపాధ్యాయుడు .రాజమండ్రిలో 10-10–1917 న జన్మించారు .అద్భుత కళా సృష్టికి ఆలవాలమైన ఆయన చిత్రాలు ఎన్నో కళా ప్రదర్శనలో విశ్లేషకుల మన్ననలు బహుమతులు పొందాయి .నీటి తైల వర్ణ చిత్రాలు ,పెన్సిల్ స్కెచెస్ లతో ఎన్నో సోలో ప్రదర్శనలు నిర్వహించారు .దాదాపు 200 చిత్రాలు రచించారు శర్మాజీ .వీటిలో పోర్త్రైట్ ,లాండ్ స్కేప్ చిత్రాలు ,ఫిగర్ స్టడీస్ చిత్రాలతో పాటు దారు శిల్పాలు పెన్సిల్ స్కెచ్ లూ ఉన్నాయి .
1936 లో ఎస్ ఎస్ ఎల్ సి పాసై ,1956లో బొంబాయి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి అయిదేళ్ళు చదివి డిప్లమో పొందారు హరిశ్చంద్ర శర్మ .1950లోనే హయ్యర్ గ్రేడ్ లో ఫ్రీహాండ్ జామేట్రికల్ డ్రాయింగ్ ను సెకండ్ క్లాస్ లో పాసయ్యారు .హయ్యర్ గ్రేడ్ డిజైన్ టిటి సి లో ఫస్ట్ క్లాస్ సాధించారు .చిత్రకళా రంగం లో శర్మ గారి కృషి గుర్తించిన చిత్రకళా అకాడెమీ ‘’ఆలిండియా ఆర్టిస్ట్ డైరెక్టరి ‘’లో శర్మ గారి పేరు చేర్చిగౌరవించింది .
1957లో విద్యార్ధులకు, చిత్రకళా ఉపాధ్యాయులకోసం’’మోడరన్ ట్రెండ్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ‘’చేసిన రేడియో ప్రసంగం అటు చిత్ర కళ నేర్చే వారికి నేర్పే ఉపాధ్యాయులకు ఎంతగానో తోడ్పడింది .ఆయన అనుభవం అందరికి ‘’దారి వెలుగే ‘’అయింది .
జాతీయ స్థాయిలో శర్మగారు అనేక పట్టణాలలో చిత్ర కళా ప్రదర్శనలలో తమ చిత్రాలు ప్రదర్శించారు .ప్రశంసలు బహుమతులు పొందారు .30 చిత్రకళా ఉపాధ్యాయులుగా సంతృప్త జీవితం గడిపిన శ్రీ వేటూరి హరిశ్చంద్ర శర్మ గారు అమరులయ్యారు .
ఆధారం -శ్రీ వంటేద్దు బాలాజీ గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-25-ఉయ్యూరు ,

