1-స్వాత౦త్ర్య సమరయోధుడు -శ్రీ కందాళ సర్వేశ్వర శాస్త్రి
17-12-1902న భీమునిపట్నం లో శ్రీ కందాళ సర్వేశ్వర శాస్త్రి శ్రీ నీలకంఠం దంపతులు జన్మించారు .మద్రాస్ యూని వర్సితిలో లా చదివి డిగ్రి పొందారు.విశాఖ లో లాయర్ వృత్తీ లో ప్రవేశించారు .మహాత్ముని పిలుపు పై సహాయ నిరాకారమ ఉద్యమం లో పాల్గొని ,7-2-1822 అరెస్ట్ అయి ,10నెలలు కఠిన కారాగార శిక్ష ,మూడువందల జరిమానా విధింపబడి కడలూరు బరంపురం జైళ్ళలో అనుభవించారు .మద్రాస్ లో లా చదివేటప్పుడే సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం నడిపి బహిష్కరణకు గురయ్యారు .1930ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు ఏడాదికాలం జైలు శిక్ష బరంపురం నెల్లూరు ,కడలూరు కన్ననూరు లలో అనుభవించారు .గాంధి-ఇర్విన్ ఒప్పందం ప్రకారం ముందే విడుదలయ్యారు .1932 శాసనోల్లంఘనలో పది నెలలు జైలుపాలయ్యారు .
శ్రీకాకుళం జిల్లాలో యువజన ఉద్యమం నడిపారు .క్రియా శీలుడైన సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు .ఆంధ్రాయూని వర్సిటి సెనేట్, సిండికేట్ సభ్యులుగా ఉన్నారు ఆని 1970లో మరణించారని శ్రీ పరుచూరి కోటేశ్వరరావు గారు తెలియజేశారు .
2-ఉత్తరాంధ్ర ప్రముఖనటులు -శ్రీ రామాయణం సర్వేశ్వర శాస్త్రి
విజయనగరం జిల్లా కోరుకొండదగ్గర భీమ సింగి గ్రామం లో 1889లో రామాయణం లక్ష్మీ నరసింహ శాస్త్రి వెంకట సుబ్బమ్మ దంపతులకు సర్వేశ్వర శాస్త్రి జన్మించారు .తండ్రి మహాఉద్దండ పండితుడు ‘’అభినవ భీమకవి ‘’బిరుదాంకితులు .తాతగారు రామాయణ పురాణం చెప్పేవారు కనుక ఇంటిపేరు రామాయణం అయిందట .తల్లి గోప్పగాయని .
శాస్త్రిగారు విజయనగరంలో రిప్పన్ స్కూల్ లో మెట్రిక్ చదివి నాటకాల ధ్యాసతో ఉండేవారు .విజయనగరం బ్రాంచి కాలేజిలో టీచర్ గా కొంతకాలం చేసి ,పెద్దకాలేజిలో రైటర్ గాపనిచేసి 1947లో రిటైర్ అయ్యారు .అనేక నాటక సంస్థలలో అనేక పాత్రలు ధరించారు .విజయనగర్ విజయరామ డ్రమటిక్ కంపెని వీరికి వెన్ను దన్నుగా నిలిచింది .రసపుత్ర విజయం లో రాజ సింహుడు ,రామదాసులో రామదాసు ,ప్రసన్నయాదవం ,పాండవోద్యోగం ,పద్మవ్యూహం లో శ్రీ కృష్ణ పాత్ర ,గయోపాఖ్యానం లో గయుడు ,విజయనగర సామ్రాజ్యపతనం లో రుస్తుం హరిశ్చంద్ర లో హరిశ్చంద్రుడు భక్త శిరియాలలో శిరియాలుడు ,రాయబారం లో అర్జునుడు ,చిత్రనళీయం లో నలుడు ,చింతామణిలో బిల్వ మంగళుడు ,చెకుముకి శాస్త్రి ,హిరణ్యకశిపు పాత్రలు ధరించి గొప్పగా నటించి ప్రేక్షకాభిమానం పొందిన గిప్పనటులు శాస్త్రి .ముఖ్యపట్టణాలలో నాటకాలు ఆడి ప్రముఖుల ప్రశంసలు అందుకొన్నారు .1-10-1962న 73 వ ఏట నట దిగ్గజం శ్రీ రామాయణం సర్వేశ్వర శాస్త్రి పరమ పదిచారని శ్రీ మిరియాల రామ కృష్ణ రాశారు .
వీరిద్దరి ఫోటోలు దొరకలేదు
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-5-25-ఉయ్యూరు .

