ఆంధ్ర గీర్వాణ మహా వక్త , 20వ శతాబ్దపు లూమినరీ,ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు లెక్చరర్ ,వేదాంత పంచ దశి సారం ,రామతత్వ రసాయన కర్త,,’’అభినవ భట్ట బాణ’’-బ్రహ్మశ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు
రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి జననం: 9 -12-1908 న శ్రీకాకుళంజిల్లావేగావతీ నదీతీరాన పాలకొండమండలం లోని గుడివాడ అగ్రహారం లో శ్రీ ముఖ లింగేశ్వరుడు ,శ్రీమతి సోదెమ్మ దంపతులకు జన్మించారు .రామాయణ భారత భాగవతాలను తండ్రిగారి వద్ద వినటం ,రాత్రిపూట సంస్కృత పురాణాలు చదవటం ,తన ఈడుపిల్లలకు ఆకధలు చెప్పటం అలవాటయింది .తోమ్మిదోయేడు దాటాక ఇంగ్లీష్ నేర్వటం ప్రారంభించారు 13ఏట తండ్రి మరణించారు .తర్వాత శ్రీహరిపురం అగ్రహారం లో నెలకు అరవై రూపాయల జీతంతో పంతులయ్యారు .
బొబ్బిలి తాలూకా గోల్లాది లో శ్రీ గన్నవరపు అబ్బన్న శాస్త్రి గారి వద్దచేరి కాళిదాస త్రయాన్ని కావ్య నాటకాలను18నెలలు మాత్రమె అధ్యయనం చేసి పండితులయ్యారు .ప్రభుత్వ పరీక్ష పాసై ,విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్జనకు చేరారు .శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి శ్రీ నౌదూరు వెంకట శాస్త్రి ,శ్రీ పేరి వెంకట శాస్త్రి ,శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి ,శ్రీ కొంపెల్ల విశ్వనాధ శాస్త్రి వంటి ఉద్దండుల వద్ద వ్యాకరణం నేర్చారు .శ్రీ గంటి సూర్య నారాయణ గారి వద్ద మీమాసాధులు,శ్రీ పరవస్తు రామానుజా చార్యుల వద్ద ఋగ్వేదం భాషా శాస్త్రం ,ఉపనిషత్తులు అవలోడనం చేశారు .
1929లో పాలకొండ పాఠశాలలో సంస్కృత పండితులుగా ఉద్యోగించారు .1940టెక్కలి ఆంగ్ల పాఠశాలలో తెలుగు పండిట్ అయ్యారు .1951లో విశాఖలోని ఏ వి ఎన్ కాలేజి పండితపదవికి ఎంపికయ్యారు . తరువాత సాహిత్యం & కళల రంగంలో పండితులుగా మారారు .అప్పటికే బిఏ ,కాశీ విశ్వవిద్యాలయ సంస్కృత స్నాతకోత్తర డిగ్రీలు దీనికి బాగా తోడ్పడ్డాయి .ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో ఆంధ్ర పండితునిగా ప్రమోషన్ పొంది మూడేళ్ళు పని చేశారు .అధ్యాపకునిగా గొప్ప పేరు పొందారు ప్రవచనకర్తగా బాగా రాణించారు .
పదవీ విరమణ తర్వాత విశాఖాలో స్థిరపడి ,1950లో దివ్యజ్ఞాన సమాజం హాలులో భగవద్గీత ప్రవచనం ప్రారంభించారు 1969-75వరకు ఆరేళ్ళు విశాఖ ద్వారకా నగర్ లోని శంకర మఠం లో రామాయణ భారత భాగవతాదులు నిరాఘాటంగా ప్రవచించారు
రచయిత, అనువాదకుడు, వ్యాఖ్యాత
శాస్త్రి గారు నింద్య నిర్ణయం , విక్రమోర్వశీయం , శ్రీ రామతత్వ రసాయనం , సౌందర్య లహరి , వేదాంత పంచదశి సారం , కాశీ శతకం , రామచంద్ర శతకం వంటి కొన్ని ప్రాచీన సంస్కృత రచనలు మరియు శతకాలను తెలుగు భాషలో పవిత్రమైన గద్య మరియు పద్యాలలో అనువదించారు. కర్రా శ్రీనివాసరావుతో కలిసి వరివస్య రహస్యము అనే పంచదశ మంత్రాన్ని ( గాయత్రీ మంత్రం యొక్క తాంత్రిక వెర్షన్ ) అనువదించారు . ప్రతీకారం అనే సంసృత నాటకం రాశారు .’’తారక ‘’గ్రంధానికి వ్యాఖ్యానం రచించారు [ 2 ] శాస్త్రి సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ప్రాచీన సంస్కృత గ్రంథాలు, నింద్య నిర్ణయం, విక్రమోర్వశేయం, శ్రీ రామతత్వ రసాయనం, సౌందర్యలహరి, వేదాంత పంచదాశి వంటి అనేక ప్రాచీన సాహిత్య రచనలు మరియు శతకాలకు వ్యాఖ్యానాలు వ్రాసి అనువదించడం కష్టతరమైన పని. తెలుగులో కవిత్వం.వరివస్యా రహస్యం అనే మంత్ర శాస్త్ర గ్రంధం ,వాసుదేవ మననం శంకర కృత పంచాననం ,చతుస్సూక్తి ,మొదలైన 24గ్రంధాలు రచించారు .
విశాఖ పండిత ఆధ్వర్యం లో జరిగిన భువన విజయం లో పెద్దన పాత్ర ధరించిన శాస్త్రిగారికి సువర్ణ గండ పెండేర సత్కారం ఘనంగా జరిగింది 1968షష్టిపూర్తి ఉత్సవం నభూతో గా జరుపుకొన్నారు .విశాఖ మధురానగర్ లో సద్గురు బ్రహ్మశ్రీ రామదూత మందిర ప్రాంగణం లో 1975 నుండి రెండు దశాబ్దాలపాటు రామాయణాది పురాణ ప్రవచనం తో పాటు శ్రీ సీతారామాంజనేయ సంవాదం ,ఉత్తర రామ చరిత్ర ,భాస్కర రామాయణం ,వివేక చూడామణి ల అమృత సారాన్ని ప్రవచనం ద్వారా పంచిపెట్టి శ్రోతలను ధన్యులను చేశారు తాము తరించి ఇతరులను తరిమ్పజేశారు .19-11-1995 న 87వ ఏట అభినవ భట్ట బాణ బ్రహ్మశ్రీ రాంభట్ల నరసింహ శాస్త్రి గారు దైవ సన్నిధి చేరారు .
ఆధ్యాత్మిక ప్రసంగాలు
1969 నుండి 1995 వరకు తన చివరి రోజుల వరకు 3 దశాబ్దాలకు పైగా విశాఖపట్నంలో తన జీవితకాలంలో శాస్త్రి వాల్మీకి రామాయణం మరియు వ్యాస భాగవతంతో పాటు కాళిదాసు మరియు శంకరాచార్యుల రచనలపై వందలాది పండిత & ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చారు . విశాఖపట్నంలోని ఆల్ ఇండియా రేడియోలో ప్రసిద్ధ సూక్తి ముక్తావళిని ఆయన నిర్వహించారు . తన జీవితకాలంలో కాళిదాసు, వాల్మీకి రామాయణంతో పాటు శంకరాచార్యులు మరియు వ్యాస భాగవతం రచనలపై వందలాది పండిత ఉపన్యాసాలు ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్నాయి. 1968లో విశాఖపట్నంలోని ప్రముఖులు ఆయన షష్టిపూర్తిని ఘనంగా జరుపుకున్నారు.
గౌరవ బిరుదులు
సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు టాటా సుబ్రహ్మణ్య శాస్త్రి ‘అభినవ భట్ట బాణ’ అని పిలిచారు. తన కెరీర్‌లో పండితరత్న, దైవజ్ఞ శిరోమణి వంటి సాహిత్య సంస్థలు ఆయనకు అనేక బిరుదులను ప్రదానం చేశాయి. విశాఖపట్నంలో కల్యాణమండపాల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చిన ద్రవిడ సంక్షేమ సంఘం వ్యవస్థాపక సభ్యుడు శాస్త్రి. ఆయన గౌరవార్థం విశాఖపట్నంలోని శ్రీ లలితా కల్యాణమణాపంలో ఆయన విగ్రహాన్ని నిర్మించారు.
మరణం
శాస్త్రి 19 నవంబర్ 1995న విశాఖపట్నంలో మరణించారు . విశాఖపట్నం మధురానగర్‌లోని శ్రీ సద్గురుబ్రహ్మ రామదూత మందిరంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి . ఆలయ ప్రాంగణంలో గంటి నరసింహమూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి జయంతి 2008లో విశాఖపట్నంలో జరిగింది. మధురానగర్‌లోని శ్రీ సద్గురుబ్రహ్మ రామదూత మందిరం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గంటి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మతం మరియు ఆధ్యాత్మికతపై ప్రసంగాలు చేశారు. పండితులు జి.అక్కుభట్ల శర్మ, మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి, అప్పళ్ల సోమేశ్వరశర్మతో పాటు భాస్కరశర్మ, వేదుల కాశీవిశ్వేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్కృత పండితురాలు సారిపల్లి సీతకు ‘శాస్త్రవిశారద’ బిరుదు ప్రదానం చేశారు. గంటి నరసింహం కృతజ్ఞతలు తెలుపుతూ, శాస్త్రి యొక్క మూడు ప్రచురించని రచనలను ముద్రించడానికి మరియు అతని పేరు మీద ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల సహాయం కోరారు.
మీడియా కవరేజ్
2004లో “విశాఖ మన్యులు” అనే పుస్తకంలో శాస్త్రి విశాఖపట్నం నుండి వచ్చిన 133 మంది ప్రముఖులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో ఆయన శతజయంతి సందర్భంగా భారత జాతీయ దినపత్రిక “ది హిందూ”లో కూడా శాస్త్రి గురించి ప్రచురితమైంది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయన జీవితం మరియు రచనలను “20వ శతాబ్దపు వెలుగులు”లో ప్రచురించింది.వీరి ఫోటో దొరకలేదు
ఆధారం -బ్రహ్మశ్రీ రాంభట్ల నృసింహ శర్మగారి వ్యాసం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -7-5-25-ఉయ్యూరు

