శ్రీసువర్చలా౦జనేయ దేవాలయం లొ శ్రీ హనుమజ్జయంతి

శ్రీసువర్చలా౦జనేయ దేవాలయం లొ శ్రీ హనుమజ్జయంతి

శ్లోం -‘’సువర్చలాదిష్టిత వామభాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం

భానుప్రభం రాఘవ కార్య దీక్షం -అస్మత్కులేశం శ్రీ హానూమంత మీడే’’.

స్వస్తిశ్రీ చాంద్రమాన వైశాఖ మాస బహుళ దశమి 22-5-25 గురువారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు లొ శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లొ 20-5-25మంగళ వారం నుంచి 22-5-25 గురువారం వరకు త్రయహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం జరురుతుంది  .భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని సేవించి తరించ ప్రార్ధన .

  కార్యక్రమమ వివరం

20-5-25 -మంగళవారం -వైశాఖ బహుళ అష్టమి -ఉదయం6గం .లకు

 అష్టకలశ స్నపన ,మన్యుసూక్తం తో శ్రీ సువర్చలా౦జనేయస్వామికి అభిషేకం ,నూతన వస్త్ర ధారణ,అనంతరం గ౦ధ సిందూరం ,మల్లె పూలతో అష్టోత్తర సహస్ర నామార్చన  ,నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం 6-30 గం లకు -శ్రీ విష్ణ్వాలయం భక్త సమాజం చే -భజన

21-5-25-బుధవారం – వైశాఖ బహుళ నవమి–ఉదయం 9గం.లకు -మామిడి పండ్లతో విశేష పూజ , నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం -6- గం -7గం వరకు -సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి బృందం చే భక్తి సంగీత విభావరి

             7గం నుంచి -7-45 వరకు -కవి, రచయిత ,విశ్లేషకులు  బ్రహ్మశ్రీ చెన్నాప్రగడ శర్మ(విజయవాడ ) గారిచే ధార్మిక ప్రసంగం .

22-5-25-గురువారం -వైశాఖ బహుళ దశమి -శ్రీ హనుమజ్జయంతి

                     ఉదయం 6గం .నుంచి 9-30గం .లవరకు తమలపాకులతో స్వామి వారలకు విశేష అర్చన(నాగవల్లి పూజ ) .

ఉదయం -9-30గంలకు -శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు -శాంతి కళ్యాణ మహోత్సవం

                           అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

 సాయంత్రం 6గ౦లకు-కాలని మహిళా మండలి వారిచే -శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ -శ్రీ స్వామివార్లకు ప్రత్యేక వడమాల .

అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -13-5–25-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.