983-84 పెనమకూరు హైస్కూల్ పదవతరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

983-84 పెనమకూరు హైస్కూల్ పదవతరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

983-84 పెనమకూరు హైస్కూల్ పదవతరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం

ఇవాళ 18-5-25 ఆదివారం  పెనమకూరు హైస్కూల్ లో ఆ స్కూల్ లో 1983-84పదవ తరగతి విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం జరిగింది .సుమారు వారం క్రితం అక్కడి ఒక విద్యార్ధి ఫోన్ చేసి ఆ విషయం చెప్పి ,తప్పక రమ్మన్నాడు .నేను అప్పుడు లేను కదా అన్నాను .ఉన్నారన్నాడు .నాకు తెలిసినంతరకు నేను పెనమకూరులో 1976 అక్టోబర్ లో చేరి ,1979ఆగస్ట్ లో ట్రాన్సఫర్ అయి ఉయ్యూరులో చేరాను .మూడు రోజుల క్రితం సోమరాజు అనే విద్యార్ధి ఫోన్ చేసి నన్ను తప్పక రావాలన్నాడు .పై విషయం అతనికి కూడా చెప్పాను .కాదండి మాకు తెలుసు .మీరున్నారు అన్నాడు .సరే అన్నాను .నాకు 86 ఏళ్ళు ఆ రోడ్డుమీద ఆటోలో రిక్షాలో రావటం కష్టం .ఎవరైనా వచ్చి తీసుకు వెడితే వస్తాను అన్నాను .అలాగే ఏర్పాటు చేస్తాను అన్నాడు .అలాగే ఇవాళ ఉదయం ఆవూరి ఆడపడుచు శ్రీమతితులశమ్మ గారు , సెకండరి గ్రేడ్ టీచర్, ఆమె భర్త అంటే ఆవూరి అల్లుడు,డ్రిల్ మాస్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గార్లను బెజవాడ నించి ఎక్కి౦చు కోచ్చిన కారు లో నన్ను ఉయ్యూరులో పిక్ అప్ చేసుకొని  వెళ్లారు .నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦,సిద్ధ యోగి పుంగవులు పుస్తకాలు రెండు బండిల్స్ సుమారు 85 పుస్తకాలు నాతో కారులో తీసుకు వెళ్లాను .మేము సుమారు 11గం లకు చేరాం అక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరు .సోమరాజు గుర్తుపట్టి పలకరించగా మిగిలిన వారు అతన్ని అనుసరించారు .ఆడపిల్లల్లో-పిల్లలేమిటి దాదాపు యాభై ఏళ్ల వాళ్ళు  శ్రీమతి కొల్లి లక్ష్మి , శారద  ,విద్యార్ధులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు .ముందుగా జంటకు సన్మానం చేసి తర్వాత నాకు ,తర్వాత రిటైర్ద్ అటెండర్ జశ్వంత రావు లకు శాలువా పుష్ఫహారం ,నూతన వస్త్రాలతో సన్మానించారు .తర్వాత ఈ కార్యక్రమ రూపకల్పన లో పాల్గొన్నవారికి సన్మానం .ఆతర్వాత పాల్గొన్న ఆబాచ్ విద్యార్ధుల పరిచయం ,ఆతర్వాత ఒంటి గంటకు విందు  వెజ్ ,నాన్ వెజ్ వేరువేరుగా అందించారు .తర్వాత మళ్లీ కొన్ని పరిచయాలు అయ్యాక  తులశమ్మ గారు మాట్లాడారు .నన్ను మాట్లాడమని అడగలేదు. నెత్తిన పాలు పోసినట్లయింది .మధ్యమధ్యలో ఆడ మగ యా౦కర్ల పాటలు చెవులు చిల్లు పడేసౌండ్ బాక్స్ లు ఇబ్బంది కలిగించాయి . , నా పుస్తకాలు ఒక సెట్ దంపతులకు ,మరోసేట్ తులసమ్మ గారి అన్న దంపతులకు అందించి,మిగిలిన అన్ని పుస్తకాలను రాజు, లక్ష్మి లకుఅప్పగించి అందరికి అందజేయమని  మేముపావు తక్కువ మూడుకు  బయల్దేరి  వచ్చేశాం . నన్ను మాట్లాడమని అంటే ఈ కింది విషయాలు చెబుదామనుకొన్నాను .

‘’పెనమకూరు కు చెందిన1435కాలపు కవి అనంతామాత్యుడు ‘’భోజ రాజీయం ‘’కావ్యం రాశాడు  ఇందులో అందరికి తెలిసిన ‘’ఆవు -పులి ‘’కథ ఉంది.సత్య సంధతకు హరిశ్చంద్రుడిని చెబుతాం కాని ఒక జంతువు అయిన ఆవు తనను చంపబోయిన పులికి ఇచ్చిన మాటప్రకారం ఇటికి వెళ్ళి లేగకు పాలిచ్చి మంచిమాటలు చెప్పి .తిరిగి రాగా దాని సత్య సంధత కు మెచ్చిన పులి ఆవును చంపకుండా వెనక్కి పంపేస్తుంది .అనంతామాత్యుడు అహోబిల నరసింహస్వామి భక్తుడు .ఆయనే ‘’అనంతుని ఛందస్సు ‘’అనేఅలంకార శాస్త్రం రాశాడు .

  అలాగే పౌరాణిక నాటకాలలో శ్రీ కృష్ణ పాత్ర ధరించిన శ్రీ అబ్బూరి వరప్రసాద రావు పెనమకూరు వాస్తవ్యుడే .పద్యం పాడటం లో ఆయనను మించిన వారు లేరు .నేను పని చేసిన కాలం లో ఒక హరిజన విద్యార్ధి ప్రసాద రావు ఉండేవాడు అద్భుతంగా పద్యాలు పాడే వాడు .అతన్ని జూనియర్ ఘంటసాల అనే వాళ్ళం .అతనిని బాగా ప్రోత్సహించాను. అతని తండ్రి కూడా ఉయ్యూరులో నా శిష్యుడు .ప్రసాద్ ఉయ్యూరు కాలేజిలో లో కూడా పాటలలో మంచి పేరు తెచ్చుకొన్నాడు బహుమతులు పొందాడు .

అక్కడే దగ్గరలో ఉన్న కనకవల్లిలో  ‘’కవి గారు ‘’గా ప్రసిద్ధి చెందినశ్రీ మారేపల్లి రామ చంద్ర శాస్త్రి గారు జన్మించారు .ఆయన ఆతర్వాత విశాఖ పట్నం చేరి దాదాపు వంద గ్రంధాలు రాశారు .సంఘ సంస్కరణలో పాల్గొన్నారు నాటక సమాజం పెట్టి నాటకాలు రాసి ఆడించారు ..కవిగారి జయంతిని 2024 సెప్టెంబర్ 5ఉపాధ్యాయ దినోత్సవం నాదు మాసువర్చలా ఆంజనేయస్వామి దేవాలయం లో నిర్వహించాం .’’బంగారు తీగ ‘’అంటే కనకవల్లి లో  శ్రీ వెంపటి రాదా కృష్ణ ‘’కన్యకాపరమేశ్వరి ‘’నాటకం రాసి రేడియో లో సినిమాలో నటించి ప్రముఖులయ్యారు .మల్లాది సూర్యనారాయణ గొప్పపౌరాణిక  నటులు హరిశ్చంద్ర ఫేం .అయన కుమార్తె మల్లాది వసుంధర సప్తపర్ని నవలారచయిత్రి .ఆయన తమ్ముడు మల్లాది శివరామ శాస్త్రిగారు గొప్ప అవధాని స్వాతంత్ర్య సమర యోధులు .వీరందరితో నాకు పరిచయం ఉంది.కనకవల్లి శివాలయం మా మేనమామ శ్రీ గుండు గంగాధర శాస్త్రిగారు మహాలక్షమ్మ దంపతులు 1953 లో వారం రోజులు ప్రతిష్టా మహోత్సవం జరిపారు .ఊరందరికీ రెండుపూటలా భోజనాలు టిఫిన్లు .కనకవల్లి కి చెందిన ఉయ్యూరు హైస్కూల్  నాక్లాస్ మేట్స్ మారేపల్లి చలపతి ,వెంపటి సుబ్రహ్మణ్యం వగైరాలు .

  నేను పెనమకూరు లో చేరినప్పుడు హెడ్ మాస్టర్ శ్రీ వేములపల్లి కృష్ణ మూర్తి గారు .అంతకుముందు  మేడూరు లో లెక్కల మాస్టారు .స్కూల్ డిసిప్లిన్ గొప్పగా ఉండేది .పాస్ బెల్ కు పిల్లలంతా క్యూ లోవెళ్ళి  క్యూలో వచ్చేవారు .అయితే ఆయనకు ఎవారైనా బడికి రాగానే టీచర్  నమస్కారం చెయ్యకపోతే గుర్తుపెట్టుకొని బాధించేవారు .అప్పుడు స్కూల్ లో స్టాఫ్ యూనియన్ లేదు ట్రాన్స్ ఫర్ వెళ్ళినా కొత్తగా వచ్చి చేరినా టీ పార్టీ లులేవు .అప్పుడు నేను ,డ్రిల్ మాస్టర్ వై జగనమోహన రావు ఆయన భార్య భ్రమరాంబ సోషల్ టీచర్ హిందీ టీచర్ రామరత్నం గారు భర్త డ్రిల్ మాస్టర్ నరసింహారావు , సెకండరి  గ్రేడ్ టీచర్ నాగమణి గారు భర్త రికార్డ్ అసిస్టెంట్ సా౦బశివరావు,తెలుగు మాస్టార్ వెంపటి శర్మగారు ఉయ్యూరు నుంచే బస్ లో వచ్చేవాళ్ళం .ఒక్కో సారి లేట్ అయేది .పాపం హెడ్ గారు ఏమీ అనే వారు కాదు .అప్పుడు మేమంతా ఇక నుంచి లేట్ గా రాకూడదని నిర్ణయించుకొని మగవాళ్ళం  సైకిళ్ళ మీద ఆడవారు రిక్షాలో చాలా ముందుగానే వచ్చేవాళ్ళం .క్రాఫ్ట్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు తాడంకి నుంచి ,చిన్న తెలుగుమేస్టార్ నౌలూరి సూర్యనారాయణ గారు కపిలేశ్వరపురం నుంచి ,డ్రాయింగ్ మాస్టర్ భద్రాచారిగారి గారు గన్నవరం నుంచి ,మరో సోషల్ పిజికే  పునాది పాడు నుంచి వచ్చేవారు .ఎస్ ఆర్ కె అనే లెక్కల మేష్టారు ,వెంకటప్పయ్య సౌదామని దంపతులు సెకండరి గ్రేడ్ లు. వెంకటప్పయ్యగారికి గొప్ప ఇంగ్లీష్ పాండిత్యం ఉండేది .నేచురల్ సైన్స్కు  మరో రాధాకృష్ణ భార్య తెలుగు పండిట్ .హిందీ కి షరీఫ్ గారు .మారో సెకండరి గ్రే డ్ శ్రీ రామారావు గారు నిక్కచ్చి మనిషి .

 నేను జగన్మోహన రావు ఆలోచించి స్టాఫ్ సెక్రెటరి ని ఎన్నకోవాలని అనుకొని,అందర్నీ చెప్పి , హెచ్ ఏం గారిని ఒప్పించి ఏర్పాటు చేశాం  నేనేసేక్రేటరి అనుకొంటా .జగన్మోహన్ ,భద్రచారి  జాయింట్ సెక్రెటరి గా ఎన్నికై బాగా పని చేశాం .ఒకసారి మురళీధర రావు గారు విష్ చేయలేదని హెచ్ ఏం ఇబ్బంది పెడుతుంటే మేమిద్దరం హెడ్ నుకలిసి నచ్చచెప్పి నమస్కరించటం మా కనీస బాధ్యత ఒక వేళ పొరబాటున మర్చిపోతే మనస్సులో పెట్టుకోవద్దని , మురళితో సారీ  చెప్పించి , హెడ్ ను కన్విన్స్ చేశా౦.ఆప్పటి నుంచి హాయిగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాం . పిల్లలకు మంచి నీటి సౌకర్యం లేదు .కనుక రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాటు చేయాలని స్టాఫ్ మీటింగ్ లో నిర్ణయం చేసి టీచర్స్ జీతాన్ని బట్టి చందాఇవ్వాలని ఆడబ్బు జీతాల్లో కట్ చేసుకోవాలని చెప్పి ,ఊరి పెద్దలను పొరుగూరి పెద్దలను స్కూల్ అయ్యాక సైకిళ్ళ మీద  హెడ్ గారితో సహా వెళ్ళి చందాలు వసూలు చేసి కెసిపి వారితో బోర్ వేయించి మోటార్ బిగించి  ,పిల్లలు త్రాగటానికి పంపులు ఏర్పాటు చేశాం.  ఇదొక రికార్డ్ . ఆ ఏడు వార్షికోత్సవం ఘనంగా జరిపాం .విద్యార్దులచేత నాటక నాటికలు ,పాటలు పద్యాలు విచిత్ర వేషాలు తో హోరేత్తించాం .ఆరోజు రాత్రి మాస్టాఫ్ అందరికి  హెడ్ మాస్టా రింట్లోనే కమ్మని విందు భోజనం .  

  పెనమకూరు సర్వీస్ అంటే దివి తుఫాను తప్పక గుర్తుకొస్తుంది .ఇందిరాగాంధీ పుట్టిన రోజు నవంబర్ 19శనివారం దివి సీమ ఉప్పెన భయంకరంగా వచ్చి వేలాది మందిని పశువులను పొట్టబెట్టుకున్నది .18ఉదయం నుంచే వాతావరణం మార్పు కనిపించింది .ఉదయం తొమ్మిదికి సైకిల్ పై స్కూల్ కు వెళ్ళాం .కలెక్టర్ గారి ఆజ్ఞమేరకు సెలవు ప్రకటించినట్లు హెడ్ గారు చెప్పగా తిరిగి వచ్చేశాం  .అర్జునుడు అనే అటెండర్ రిటైర్ అయితే సన్మానం చేయాలని అనుకొన్నాం .హెడ్ గారు వామభావాల మనిషి అయినా ఒప్పుకోలేదు .చివరికి ఒప్పించి సన్మానం చేశాం .అర్జునుడు చాలా ఆనందించాడు .ఆతను క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సేక్రేటరికూడా .నేనుఉయ్యూరు బదిలీయిఅనప్పుడు ఘనం గా స్టాఫ్ పార్టీ ఇచ్చింది హెడ్ గారు నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు .ఇన్ని  జ్ఞాపకాలు తరుముఒంటూ వచ్చి చేరాయి .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-25-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.